Saudi Arabia: వారం వ్యవధిలో 15వేల మంది అరెస్ట్.. సౌదీలో అసలేం జరుగుతుంది..?

ABN , First Publish Date - 2023-09-17T11:40:08+05:30 IST

అరబ్ దేశం సౌదీ అరేబియా (Saudi Arabia) గత కొంతకాలంగా ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం మోపుతోంది. దేశవ్యాప్తంగా వరుస తనిఖీలు నిర్వహిస్తున్న సౌదీ అధికారులు చట్టాలను ఉల్లంఘించే వారిని గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు.

Saudi Arabia: వారం వ్యవధిలో 15వేల మంది అరెస్ట్.. సౌదీలో అసలేం జరుగుతుంది..?

రియాద్: అరబ్ దేశం సౌదీ అరేబియా (Saudi Arabia) గత కొంతకాలంగా ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం మోపుతోంది. దేశవ్యాప్తంగా వరుస తనిఖీలు నిర్వహిస్తున్న సౌదీ అధికారులు చట్టాలను ఉల్లంఘించే వారిని గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గత వారం రోజులుగా నిర్వహించిన సోదాల్లో 15వేలకు పైగా మంది ఉల్లంఘనదారులను అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో రెసిడెన్సీ, వర్క్, సరిహద్దు భద్రతా నిబంధనలు అతిక్రమించిన వారు ఉన్నారు. ఈ నెల 7-13 మధ్య దేశ వ్యాప్తంగా ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే చట్టాలను ఉల్లంఘించిన దాదాపు 15,812 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇక అదుపులోకి తీసుకున్న వారిలో 9,801 మంది రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించినవారు (Violations of Residency Laws) ఉంటే.. మరో 3,804 మంది అక్రమంగా దేశ సరిహద్దు (Illegal Border Crossing) దాటారు. అలాగే 2,207 మంది కార్మిక చట్టాలను ఉల్లంఘించగా (Violations of Labor Laws).. 827 మంది పక్క దేశాల నుంచి అక్రమంగా కింగ్‌డమ్‌లోకి ప్రవేశించారని అధికారులు వెల్లడించారు.

కాగా, ఉల్లంఘనదారులలో 61 శాతం మంది యెమెన్ దేశస్తులు (Yemenis) ఉండగా, 18 శాతం మంది ఇథియోపియన్, 21 శాతం మంది ఇతర దేశాలకు చెందినవారు ఉన్నారు. ఇదిలాఉంటే.. రవాణా, ఆశ్రయం కల్పించడంతో సహా ఎవరైనా కింగ్‌డమ్‌లోకి అక్రమంగా ప్రవేశించడాన్ని సహాయం చేసినట్లు తేలితే.. గరిష్టంగా 15 సంవత్సరాల జైలు, 1 మిలియన్ సౌదీ రియాళ్లు(రూ. 2.13కోట్లు) వరకు జరిమానా ఉంటుందని సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Saudi Ministry of Interior) హెచ్చరించింది. అలాగే వాహనాలను కూడా జప్తు చేయడం జరుగుతుందని తెలిపింది. ఇక అనుమానాస్పద ఉల్లంఘనలపై ఫిర్యాదు కోసం మక్కా, రియాద్ ప్రాంతాల వాసులు టోల్-ఫ్రీ నంబర్ 911కు, కింగ్‌డమ్‌లోని ఇతర ప్రాంతాల వారు 999 లేదా 996కు కాల్ చేయవచ్చని మంత్రిత్వశాఖ అధికారులు వెల్లడించారు.

UK: విజిటర్లు, విద్యార్థులకు బ్రిటన్ బిగ్ షాక్.. భారీగా పెరిగిన వీసా ఫీజులు!


Updated Date - 2023-09-17T11:40:08+05:30 IST