UAE: శుద్రపూజల పేరిట మోసం.. యూఏఈలో ఏడుగురికి రూ. 11లక్షల జరిమానా!

ABN , First Publish Date - 2023-07-27T11:25:36+05:30 IST

శుద్రపూజల పేరిట పలువురిని మోసగించిన ఏడుగురికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) లో న్యాయస్థానం ఆరు నెలల జైలుతో పాటు 50వేల దిర్హమ్స్ (రూ. 11.16 లక్షలు) జరిమానా విధించింది.

UAE: శుద్రపూజల పేరిట మోసం.. యూఏఈలో ఏడుగురికి రూ. 11లక్షల జరిమానా!

అబుదాబి: శుద్రపూజల పేరిట పలువురిని మోసగించిన ఏడుగురికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) లో న్యాయస్థానం ఆరు నెలల జైలుతో పాటు 50వేల దిర్హమ్స్ (రూ. 11.16 లక్షలు) జరిమానా విధించింది. యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఏడుగురు వ్యక్తులు ఓ ముఠాగా ఏర్పడి గత కొంతకాలంగా శుద్రపూజల (Practising Sorcery) పేరుతో స్థానికులను మోసగిస్తున్నారు. ఈ ముఠా సభ్యులు తమకు జిన్ రాజుల శక్తి (అదృశ్య శక్తులు) ఉన్నాయని పలువురిని నమ్మించారు. ప్రజలకు ఆరోగ్య సమస్యలను దూరం చేసే అనేక శక్తులు ఉన్నాయని నమ్మించి పులువురిని మోసగించారు. దాంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఏడుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం చేతబడి చేయడం, శుద్రపూజల పేరిట మోసం వంటి ఆరోపణలపై ఏడుగురిని కోర్టులో హాజరుపరిచారు. విచారణలో ఏడుగురు నిందితులను దోషులుగా తేల్చిన న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష, రూ. 11.16 లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా జరిమానాలు, నేరాలకు సంబంధించి 2021లో తీసుకువచ్చిన ఫెడరల్ డిక్రీ లా నంబర్ 31 ప్రకారం చేతబడి, శుద్రపూజలు, మోసం అనేవి భారీ జరిమానాలతో శిక్షించదగిన నేరాలు అని పబ్లిక్ ప్రాసిక్యూషన్ గుర్తు చేసింది. ఇక శుద్రపూజలు, చేతబడికి సంబంధించిన ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాల గురించి తెలిస్తే తమకు తెలియజేయాల్సిందిగా పౌరులు, నివాసితులను అధికారులు కోరారు.

London: ఉన్నత చదువుల కోసం పరాయి దేశం వెళ్లి కానరాని లోకాలకు.. తెలుగు యువకుడ్ని బలిగొన్న రోడ్డు ప్రమాదం


Updated Date - 2023-07-27T11:25:36+05:30 IST