Share News

TAMA: అత్యంత వైభవంగా 'తామా' దసరా, బతుకమ్మ వేడుకలు

ABN , First Publish Date - 2023-10-21T09:51:33+05:30 IST

అమెరికాలో ఎప్పుడూ లేని విధంగా తెలుగు అసోసియేషన్ అఫ్ మెట్రో అట్లాంటా (తామా) వారు ఈసారి దసరా, బతుకమ్మ వేడుకలు ప్రవేశ అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది.

TAMA: అత్యంత వైభవంగా 'తామా' దసరా, బతుకమ్మ వేడుకలు

ఆద్యంతం అత్యంత వైభవం: క్రొత్త ఒరవడి సృష్టించిన తామా దసరా - బతుకమ్మ వేడుకలు

TAMA: అమెరికాలో ఎప్పుడూ లేని విధంగా తెలుగు అసోసియేషన్ అఫ్ మెట్రో అట్లాంటా (తామా) వారు ఈసారి దసరా, బతుకమ్మ వేడుకలు ప్రవేశ అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకల్లో వందలాది మంది తెలుగువారు పాల్గొన్నారు. వందలాది మంది ఆడపడుచులు రెండవ రోజైన అటుకుల బతుకమ్మను ఆటపాటలలో భక్తి శ్రద్ధలతో, ఉల్లాసంగా, ఉత్సాహంగా నిర్వహించారు. స్థానిక దేశాన మిడిల్ స్కూల్‌లో అక్టోబర్ 15న (ఆదివారం) మిన్నంటే స్థాయిలో ఈ వేడుకలు జరిగాయి. అట్లాంటా తెలుగువారంతా ఒకే చోట ఉన్నారా అన్న చందాన 1,500 మందికి పైగా పాల్గొన్న ఈ కార్యక్రమానికి రెడ్దిక్స్ లెండింగ్ రమేష్ బోధిరెడ్డి గోల్డ్ స్పాన్సర్‌గా, కాకతీయ ఇండియన్ కిచెన్ ప్రదీప్ అరన్పల్లి సిల్వర్ స్పాన్సర్‌గా, స్టెల్లార్ ఫైనాన్సియల్ సర్వీసెస్ సాహిల్ విరాని, సార్కబ్ సర్వీసెస్ శ్రీధర్ పోటబత్తుల బ్రాంజ్ స్పాన్సర్స్‌గా వ్యవహరించారు. ఈ వేడుకలకు విచ్చేసిన వారందరికీ నిర్వాహకులు కోలాటం కర్రలు ఉచితంగా అందజేశారు.

TTTT.jpg

కాకతీయ ఇండియన్ కిచెన్ వారు సమకూర్చిన విందు భోజనం చాలా బాగుందని, ఏర్పాట్లు, డెకొరేషన్ తారాస్థాయిలో ఉన్నాయని వేడులకు వచ్చిన వారందరూ మెచ్చుకున్నారు. ఈ సారి కూడా యూత్ వాలంటీర్లు అంకితభావంతో పని చేశారు. విచ్చేసిన స్థానిక, జాతీయ సంస్థల నాయకులను త్కరించడంతో పాటు వారిని సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరడం అనేది ఒక మంచి పరిణామం. మన సంస్కృతి, సాంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్ళడంలో అకుంఠిత దీక్షతో పని చేయడంలో 'తామా' టీం ఎల్లప్పుడూ ముందు ఉంటుంది. 2023లో ఇది తామా వారి 22వ కార్యక్రమం. రాబోయే రోజులలో విల్ &amp, ట్రస్ట్ గ్రాండ్ మేళా, డిస్కవరీ ఫ్లైట్ (ఫస్ట్ ఫ్లైట్ ఫ్లయింగ్), చెస్, దీపావళి ఇలా ఇంకా ఎన్నో జరగబోతున్నాయి. వివరాల కోసం www.tama.org ని సందర్శించండి లేదా info@tama.org కి ఇమెయిల్ చేయండి.

TTTTT.jpg

మొదటగా తామా సాంస్కృతిక కార్యదర్శి తిరు చిల్లపల్లి అందరినీ సాదరంగా ఆహ్వానించి, తామా టీంతో జ్యోతి ప్రజ్వలన గావించారు. అధ్యక్షులు సాయిరామ్ కారుమంచి ఆహుతులందరికీ దసరా, బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపి, వారు చేసే పలురకాల కార్యక్రమాలను విపులీకరించారు. బోర్డు ఛైర్మన్ సుబ్బారావు మద్దాళి తామా చేసే పలు సేవ, సాంఘిక కార్యక్రమాలు, తామా వీక్లీ ఫ్రీ క్లినిక్ గురించి వివరించారు. పక్కా లోకల్ అన్న రీతిన సాగిన ఈ కార్యక్రమంలో కళాకారులందరూ స్థానికులే. ప్రముఖ వ్యాఖ్యాతలు శ్రావణి రాచకుళ్ల, డీజే సుజీ కార్యక్రమాన్ని అద్భుతంగా నడిపించడమేకాకుండా దసరా శరన్నవరాత్రుల వైభవం, బతుకమ్మ విశిష్టత గురించి వివరించడం ఆకట్టుకుంది. ముఖ్య అతిథిగా విచ్చేసిన జాన్స్ క్రీక్ సిటీ కౌన్సిల్ సభ్యులు బాబ్ ఎర్రమిల్లి అందరికీ శుభాకాంక్షలు తెలిపి, మన పండుగల ప్రాముఖ్యత చెప్పారు. తెలుగు భాష పిల్లలకు నేర్పించవలసిన ఆవశ్యకతను తెలియజేశారు.

TT.jpg

ప్రఖ్యాత గాయనీగాయకులు వెంకట్ చెన్నుభొట్ల, రామ్ దుర్వాసుల, రాగ వాహిని, కేటీ స్రవంతి, గౌరి కారుమంచి, దుర్గ గోరా భక్తి, జానపద మరియు యుగళ గీతాలు పాడి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. చాలా సంవత్సరాల తరువాత అట్లాంటా స్థానికులు కలసి పాడటం ముదావహం. కళాకారులు నృత్యాలు, గీతాలు, విభిన్న ప్రతిభాపాటవాలతో ప్రేక్షకులను అలరించారు. వ్యాఖ్యాతలను, గాయనీగాయకులను తామా వారు సత్కరించారు. మరొక విశిష్ట అంశం ఏంటంటే హార్టుఫుల్నెస్ ధ్యానం యోగా మాస్టర్ కమలేష్ పటేల్ రచించిన ‘స్పిరిట్యువల్ అనాటమీ’ అనే పుస్తక ఆవిష్కరణ జరగడం. బతుకమ్మ సంబరాలలో భాగంగా తామా వారు బతుకమ్మ పోటీలు నిర్వహించి, వ్యక్తిగత మరియు జట్టు వర్గాలలో మొదటి ముగ్గురికీ ప్రత్యేక బహుమతులు ఇవ్వడమే కాకుండా పాల్గొన్న వారందరికీ కూడా బహుమానాలు అందజేశారు.

TTTTTT.jpg

పండితులు శివ నాగకుమార్ దూశి అమ్మవారి పూజతో బతుకమ్మ వేడుకలు మొదలుపెట్టారు. మహిళామణులు, చిన్నారులు చక్కగా ముస్తాబయ్యి, పలు రకాల ఆకులతో, పూలతో ప్రకృతిసిద్ధంగా అందమైన రకరకాల బతుకమ్మలను పేర్చి, గౌరమ్మను పూజించారు. కళాకారులు మహేష్ కొప్పు, సంజీవ్ డప్పు వాయించడం ప్రత్యేకం. చిన్నారుల దసరా వేషాలయితే సరే సరి. ఒకొక్కరు ఒక్కొక్క చందాన చక్కగా తయారయ్యి విష్ణుమూర్తి, కాళికా దేవి, బాలాత్రిపురసుందరి ఇలా ఎన్నో వేషాలతో కనువిందు చేశారు. మొదటి ముగ్గురికీ ప్రత్యేక బహుమతులూ, తక్కినవారికి తగిన బహుమానాలు ఇవ్వడం జరిగింది. సమర్పకులందరినీ వేదిక మీదకు పిలిచి, సముచితంగా సత్కరించారు. అనంతరం వారు చేసే వ్యాపారాల గురించి చెప్పి, వారికి మద్దత్తు ఇవ్వవలసిందిగా సాయిరామ్ సభికులను కోరారు.

TTTTTTTTT.jpg

స్పాన్సర్స్ తమ కార్యకలాపాలను, తామాతో తమకు ఉన్న అనుబంధాన్ని పంచుకుని, అందరికీ శుభాభినందనలు తెలియజేశారు. విచ్చేసిన ప్రజానీకానికీ, ఆడపడుచులకు, స్పాన్సర్లకు, వాలంటీర్లకు, యూత్ వాలంటీర్లకు, వారిని సమన్వయపరచిన మాలిని ఆకుల, కళాకారులకు, డెకొరేషన్ మాధవి అల్లాడి, జయంతి, డీజే బీట్స్ & ఈవెంట్స్ వెంకట్ చెన్నుబోట్ల, ఫోటోగ్రఫీ ప్రేమ్, వీడియోగ్రఫీ రఘు, డప్పు కళాకారులు మహేష్ కొప్పు, సంజీవ్, తామా టీం, స్కూల్ యాజమాన్యానికి ఉపాధ్యక్షులు సురేష్ బండారు కృతజ్ఞతలు తెలిపి వేడుకలను ఘనంగా ముగించారు.

TTTTTTT.jpg

T.jpg

Updated Date - 2023-10-21T09:51:33+05:30 IST