Canada: విహారంలో విషాదం.. నయగరా జలపాతంలో పడి 21 ఏళ్ల భారతీయ యువతి మృతి!
ABN , First Publish Date - 2023-06-03T11:44:00+05:30 IST
కెనడాలో (Canada) విషాద ఘటన చోటు చేసుకుంది.
ఎన్నారై డెస్క్: కెనడాలో (Canada) విషాద ఘటన చోటు చేసుకుంది. 21 ఏళ్ల భారతీయ యువతి ప్రమాదవశాత్తు నయాగరా జలపాతంలో (Niagara Falls) పడి చనిపోయింది. మృతురాలిని పంజాబ్ రాష్ట్రానికి చెందిన పూనందీప్ కౌర్ (Poonamdeep Kaur) గా గుర్తించారు. ఆమె గత ఏడాదిన్నరగా కెనడాలో ఉంటూ చదువుకుంటోంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం స్నేహితులతో కలిసి నయాగరా జలపాతం చూసేందుకు వెళ్లింది. అక్కడ ప్రమాదవశాత్తు కాలు జారి జలపాతంలో పడిపోయింది. ఇప్పటివరకు ఆమె మృతదేహం దొరకలేదని అధికారులు తెలిపారు. పూనందీప్ మృతితో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. కాగా, ఆమె తండ్రి మనీలాలో ఉంటారని తెలిసింది. స్వదేశంలోని కుటుంబ సభ్యులకు కెనడాలో ఉంటున్న బంధువుల ద్వారా ఆమె ప్రమాదానికి సంబంధించిన విషయం తెలిసింది.