H-1B Visa: హెచ్‌-1బీ వీసా దరఖాస్తుదారులకు గుడ్‌న్యూస్.. రెండో విడత లాటరీ పూర్తి

ABN , First Publish Date - 2023-08-03T07:29:01+05:30 IST

అమెరికన్‌ హెచ్‌-1బీ వీసాలకు దరఖాస్తు చేసిన వారికి శుభవార్త. అమెరికన్‌ ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ఈ వీసాలకు రెండో విడత లాటరీ పూర్తి చేశారు.

H-1B Visa: హెచ్‌-1బీ వీసా దరఖాస్తుదారులకు గుడ్‌న్యూస్.. రెండో విడత లాటరీ పూర్తి

హెచ్‌-1బీ వీసాలకు రెండో విడత లాటరీ

వాషింగ్టన్‌, ఆగస్టు 2: అమెరికన్‌ హెచ్‌-1బీ వీసాలకు దరఖాస్తు చేసిన వారికి శుభవార్త. అమెరికన్‌ ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ఈ వీసాలకు రెండో విడత లాటరీ పూర్తి చేశారు. అమెరికన్‌ సంస్థల్లో చేరే ప్రత్యేక నైపుణ్యాలు గల ఉద్యోగులకు హెచ్‌1-బీ వీసాలు జారీ చేస్తారు. ప్రధానంగా అమెరికన్‌ టెక్‌ కంపెనీలు భారత్‌, చైనా వంటి దేశాల నుంచి వేలసంఖ్యలో ఉద్యోగులను ఈ వీసా ద్వారా నియమిస్తున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి హెచ్‌1-బీ వీసాకు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారి నుంచి తగిన సంఖ్యలో అభ్యర్థులను ఎంపిక చేసినట్లు యూఎస్‌ సిటిజెన్‌షిప్‌, ఇమ్మిగ్రేషన్‌ సేవల సంస్థ(యూఎస్‌సీఐఎస్‌) మంగళవారం వెల్లడించింది. అక్టోబరు ఒకటవ తేదీతో ప్రారంభమయ్యే ఈ ఆర్థిక సంవత్సరానికి హెచ్‌1-బీ వీసాలకు అర్హత సాధించిన వారికి ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు తెలిపింది.

యూఎస్‌సీఐఎస్‌ గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ వీసాల జారీకి రెండో విడత లాటరీ తీయాల్సి వచ్చింది. మొదటి విడత లాటరీకి పలువురు ఒకటికంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లు చేయడమే ఇందుకు కారణం. ఈ సమస్య అప్పుడు తగిన సంఖ్యలో వీసాల జారీకి అడ్డంకిగా మారినట్లు వెల్లడించింది. ఇలా వీసాల నమోదును ఎవరూ దుర్వినియోగం చేయకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేసింది. చట్టబద్దంగా దరఖాస్తు చేసేవారికే వాటిని జారీ చేస్తామని స్పష్టం చేసింది. 2020లో ప్రారంభించిన హెచ్‌1-బీ ఎలకా్ట్రనిక్‌ రిజిస్ట్రేషన్‌ వ్యవస్థ ద్వారా వీసాల జారీ ప్రక్రియ మెరుగైనట్లు యూఎ్‌ససీఐఎస్‌ పేర్కొంది.

Updated Date - 2023-08-03T07:29:01+05:30 IST