New Education Policy: అమెరికాలో భారతీయ విద్యార్థుల కోసం స్పెషల్ కోర్సులు
ABN , First Publish Date - 2023-08-17T11:08:03+05:30 IST
భారతీయ విద్యార్థుల కోసం అగ్రరాజ్యం అమెరికా (America) ప్రత్యేక కోర్సులు రూపొందించింది. మన దగ్గర 2020లో ప్రవేశపెట్టిన కొత్త విద్యా విధానాని (New Education Policy) కి అనుగుణంగా ఇండియన్ స్టూడెంట్స్ కోసం ఇలా స్పెషల్ కోర్సు (Specialised Courses) లకు రూపకల్పన చేసింది.
ఎన్నారై డెస్క్: భారతీయ విద్యార్థుల కోసం అగ్రరాజ్యం అమెరికా (America) ప్రత్యేక కోర్సులు రూపొందించింది. మన దగ్గర 2020లో ప్రవేశపెట్టిన కొత్త విద్యా విధానాని (New Education Policy) కి అనుగుణంగా ఇండియన్ స్టూడెంట్స్ కోసం ఇలా స్పెషల్ కోర్సు (Specialised Courses) లకు రూపకల్పన చేసింది. భారతీయ విద్యార్థుల (Indian Students) కోసం ప్రవేశపెట్టిన ఈ కొత్త ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఏడాది పాటు ఉండే ప్రొఫెషనల్ మాస్టర్స్ డిగ్రీ కోర్సును అందుబాటులోకి తెచ్చింది. తద్వారా మన విద్యార్థులు అక్కడి యూనివర్సిటీలలో పారిశ్రామిక స్పెషలైజేషన్‌తో విద్యను అభ్యసించనున్నారు.
సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమేటిక్స్ విభాగాల్లో ఈ కోర్సు ఉండనుంది. వచ్చే ఏడాది సెమిస్టర్ నుంచి ఈ కోర్సు అందుబాటులో ఉంటుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. కోర్సు పూర్తిచేసిన తర్వాత విద్యార్థులు వీసా నిబంధనలకు అనుగుణంగా మూడేళ్లపాటు అక్కడే ఉండేందుకు అవకాశం ఉంటుంది. యూఎస్ (US) కు చెందిన ఇరవై విశ్వవిద్యాలయాలు, 15 భారత విశ్వవిద్యాలయాలు ఈ కోర్సుపై ఇప్పటికే చర్చలు మొదలెట్టాయి.