Viral Video: అయ్యో పాపం.. బైడెన్‌ను గొడుగు తీవ్రంగానే ఇబ్బంది పెట్టేసిందిగా..!
ABN , First Publish Date - 2023-05-21T12:17:08+05:30 IST
జపాన్‌లోని హిరోషిమాలో జీ-07 సదస్సు (G7 summit) జరుగుతున్న విషయం తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: జపాన్‌లోని హిరోషిమాలో జీ-07 సదస్సు (G7 summit) జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమ్మిట్‌లో పాల్గొనేందుకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) కూడా వెళ్లారు. అయితే, అక్కడ ఆయన ఓ విషయంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆయన జపాన్‌లో విమానం దిగే సమయానికే వర్షం (Rain) మొదలైంది. ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో (Air Force One) ఇవాకునిలోని (Iwakuni) మెరైన్ కార్ప్స్ ఎయిర్ స్టేషన్‌కు (Marine Corps Air Station) బైడెన్ చేరుకున్న సమయంలో వర్షం (Rain) కురుస్తుండటంతో గొడుగుతో ఆయన విమానం మెట్లు దిగడం ప్రారంభించారు. ఆ సమయంలో తన వద్ద ఉన్న గొడుగును తెరిచే ప్రయత్నం చేశారు.
కానీ, అది ఎంతకీ తెరుచుకోకపోవడంతో ఆయన దాన్ని అలాగే పట్టుకుని ఎదురుగా ఉన్న జపాన్ ప్రతినిధులతో కరచాలనం చేస్తూ వారిని పలకరించారు. దాంతో బైడెన్ కొద్దిసేపు వర్షంలో తడవాల్సి వచ్చింది. అయితే, బైడెన్ వర్షంలో తడుస్తుండటం గమనించిన జపాన్ మంత్రి ఒకరు ఆయనకు కొద్దిసేపు తన గొడుగు పట్టారు. ఇక బైడెన్ ఇబ్బందిని గమనించిన ఆయన సిబ్బంది తమవద్ద ఉన్న గొడుగును పట్టారు. ఆ తరువాత అధ్యక్షుడు మరోసారి ప్రయత్నించడంతో గొడుగు తెరుచుకుంది. ఇప్పుడీ ఘటన తాలూకు వీడియో వీడియో నెట్టింట వైరల్ అవుతోంది (Video goes Viral).