Retirement visa: యూఏఈలోని ప్రవాసులకు పదవీ విరమణ వీసా.. దరఖాస్తు ఇలా..!
ABN , First Publish Date - 2023-11-16T08:14:32+05:30 IST
పదవీ విరమణ తర్వాత ప్రవాస నివాసితులు దేశంలోనే ఉండేందుకు వీలు కల్పిస్తూ 2021 నవంబర్‌లో యూఏఈ ప్రభుత్వం రెసిడెన్సీ చట్టానికి సవరణలు చేసింది. దీనిలో భాగంగా పదవీ విరమణ చేసిన, 55 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న నివాసితులు 5 సంవత్సరాల దీర్ఘకాలిక వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
Retirement visa in Dubai: పదవీ విరమణ తర్వాత ప్రవాస నివాసితులు దేశంలోనే ఉండేందుకు వీలు కల్పిస్తూ 2021 నవంబర్‌లో యూఏఈ ప్రభుత్వం రెసిడెన్సీ చట్టానికి సవరణలు చేసింది. దీనిలో భాగంగా పదవీ విరమణ చేసిన, 55 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న నివాసితులు 5 సంవత్సరాల దీర్ఘకాలిక వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే వారు తమ జీవిత భాగస్వాములు, పిల్లలను కూడా స్పాన్సర్ చేసే వెసులుబాటు కల్పించింది. 'రిటైర్‌మెంట్ వీసా' (Retirement visa) పేరిట దీన్ని తీసుకొచ్చింది. అసలు ఈ ఐదేళ్ల దీర్ఘకాలిక రిటైర్‌మెంట్ వీసాకు అర్హులు ఎవరు? అర్హతలేంటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? దరఖాస్తు రుసుము? తదితర వివరాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
Indian Students: గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా.. యూఎస్ వర్సిటీల్లో భారీగా పెరిగిన విదేశీ విద్యార్థులు.. మనోళ్ల లెక్కలు తెలిస్తే షాకవ్వాల్సిందే!
ఎవరు అర్హులు..?
విజిట్ దుబాయ్ ప్రకారం రిటైర్‌మెంట్ వీసాకు అర్హత పొందేందుకు ప్రవాస నివాసి ఈ క్రింది ప్రమాణాలను తప్పనిసరిగా కలిగి ఉండాలి
* అతడు/ఆమె యూఏఈ (UAE) లోపల లేదా వెలుపల 15 సంవత్సరాల కంటే తక్కువ కాకుండా పని చేసి ఉండాలి (లేదా) పదవీ విరమణ సమయంలో 55 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి
* కింది ఎంపికలలో ఒకదానిని నెరవేర్చాలి
1. కనిష్ట వార్షిక ఆదాయం 180,000 దిర్హమ్స్ (రూ.40లక్షలు) లేదా 15వేల దిర్హమ్స్ (రూ.3.39లక్షలు) నెలవారీ ఆదాయం
2. 3 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో 1 మిలియన్ దిర్హమ్స్ (రూ.2.26కోట్లు) పొదుపు
3. ఆ దేశంలో 1 మిలియన్ దిర్హమ్స్ (రూ.2.26కోట్లు) ఆస్తిని
UAE: విమాన టికెట్స్ నుంచి ట్రాఫిక్ ఫైన్స్ వరకు.. ఇలా యూఏఈలో 5 విషయాలలో వాయిదాలలో చెల్లించే సౌకర్యం
ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?
మొదటి దశలో మీరు మీ ఆప్షన్లలో ఏదో ఒకదానిని ఎంపిక చేసుకోవడం. ఒకవేళ మీరు 'పొదుపు' ఆప్షన్ ద్వారా వెళుతున్నట్లయితే.. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) తో డీలింగ్ ఉంటుంది. అదే ఆస్తి ఆధారిత దరఖాస్తుల కోసమైతే సంబంధిత అధికారం దుబాయ్ ల్యాండ్ డిపార్ట్‌మెంట్ (Dubai Land Deparment) కి ఉంటుంది. ఇక
జీడీఆర్ఎఫ్ఏ (GDRFA) కోసం మీరు అధికారి వెబ్‌సైట్ https://smart.gdrfad.gov.ae లోకి వెళ్లి, ‘Individuals’ లాగిన్ ఆప్షన్‌ను ఎంచుకుని కొత్త అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. స్క్రీన్‌పై ప్రాంప్ట్‌లను అనుసరిస్తూ మీరు ఆన్‌లైన్ ఫారమ్‌ను సమర్పించవచ్చు. ఇక డీఎల్‌డీ (DLD) కోసం దరఖాస్తు చేయసుకోవాలంటే మాత్రం దరఖాస్తుదారు తప్పనిసరిగా రియల్ ఎస్టేట్ రెగ్యులేటింగ్ ఏజెన్సీ కార్యాలయాన్ని వ్యక్తిగతంగా సందర్శించాల్సి ఉంటుంది.
UAE Golden Visa: యూఏఈ ఇచ్చే గోల్డెన్ వీసాతో బోలెడు బెనిఫిట్స్.. నివాసం నుంచి వ్యాపారం వరకు ప్రవాసులకు కలిగే ప్రయోజనాలివే..!
కావాల్సిన ధృవపత్రాలు..?
1. దరఖాస్తుదారు, తనపై ఆధారపడిన వారి పాస్‌పోర్ట్ కాపీ - జీవిత భాగస్వామి, పిల్లలు
2. వివాహ ధృవీకరణ పత్రం కాపీ - మీరు మీ జీవిత భాగస్వామిని స్పాన్సర్ చేస్తుంటే
3. దరఖాస్తుదారు, డిపెండెంట్స్ ప్రస్తుత వీసా కాపీ - మీరు యూఏఈ నివాసి అయితే
4. దరఖాస్తుదారు, డిపెండెంట్స్ వారి ఎమిరేట్స్ ఐడీల కాపీ - మీరు యూఏఈ నివాసి అయితే
అలాగే అవసరమైన అదనపు పత్రాలు మీరు ఎంచుకున్న ఎంపికపై ఆధారపడి ఉంటాయి.
5. ఆదాయ రుజువు: ఈ పత్రం తప్పనిసరిగా లబ్ధిదారుని పేరు, ప్రారంభ తేదీని కలిగి ఉండాలి. ఇది ఆదాయ మూలాన్ని అందించే సంబంధిత సంస్థ నుండి వచ్చిన లేఖ కావచ్చు (పెన్షన్ పథకం వంటివి). (లేదా) మీ మునుపటి యజమాని నెలవారీ పదవీ విరమణ ఆదాయాన్ని అందించడం కొనసాగిస్తుంటే వారి నుండి వచ్చిన లేఖ కావచ్చు. (లేదా) మీకు స్థిరమైన ఆదాయాన్ని కలిగి ఉన్నట్లు చూపించే సంబంధిత పత్రాలు కావచ్చు.
ఆరు నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్: స్టేట్‌మెంట్ తప్పనిసరిగా మీ ఆదాయ మూలం నుండి నెలవారీ 15వేల దిర్హమ్స్ (రూ.3.39లక్షలు) లేదా సంవత్సరానికి 180,000 దిర్హమ్స్ (రూ.40లక్షలు) కనీస డిపాజిట్‌ని చూపించాలి. అది తప్పనిసరిగా దుబాయ్ ఆధారిత బ్యాంక్ నుండి అయి ఉండాలి. అలాగే అది తప్పనిసరిగా బ్యాంక్ ద్వారా స్టాంప్ చేయబడి ఉండాలి.
6. పదవీ విరమణ రుజువు: ఇది మీరు గతంలో ఉద్యోగంలో ఉన్నారని, అర్హత కలిగిన పదవీ విరమణ పొందిన వ్యక్తి అని అధికారులకు నిరూపించడం. ఇది మీ చివరి యజమాని నుండి వచ్చిన సర్వీస్ ఎండింగ్ లేటర్. ఇది మీరు పదవీ విరమణ పొందిన వ్యక్తి అని నిర్ధారిస్తుంది. అలాగే మీరు పని చేసిన సంవత్సరాల సంఖ్యను నిర్ధారిస్తుంది.
7. పొదుపు రుజువు: ఇది యూఏఈ ఆధారిత బ్యాంక్ నుండి అరబిక్‌లో స్టాంప్ చేయబడిన బ్యాంక్ లేఖ. యూఏఈలో ఉన్న బ్యాంక్‌లో 3 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో 1 మిలియన్ దిర్హామ్ పొదుపులు ఉన్నాయని లేఖలో పేర్కొనాలి. తప్పనిసరిగా జీడీఆర్ఎఫ్ఏకి పంపాలి.
NRI: లండన్‍లోని భారతీయ కుటంబంలో విషాదాన్ని మిగిల్చిన దీపావళి వేడుకలు.. ఒకే ఫ్యామిలీకి చెందిన ఐదుగురు మృతి!
దరఖాస్తు రుసుము..?
మీ దరఖాస్తును జీడీఆర్ఎఫ్ఏ లేదా డీఎల్‌డీ ఆమోదించినట్లయితే ప్రతి దరఖాస్తుకు రూ.84,141 చెల్లించాలి. ఎంట్రీ పర్మిట్, వీసా స్టేటస్ సర్దుబాటు, రెసిడెన్సీ స్టాంపింగ్, ఎమిరేట్స్ ID, మెడికల్ ఎగ్జామినేషన్, మేనేజ్‌మెంట్ ఫీజులతో సహా అన్ని వీసా సంబంధిత ఖర్చులను ఈ మొత్తం కవర్ చేస్తుంది.