Qatar: ఫిఫా వరల్డ్ కప్ ఖతార్‌కు బాగానే కలిసొచ్చింది.. నెలలు గడుస్తున్న తగ్గని పర్యాటకులు.. బిజినెస్ హబ్ కాస్తా..
ABN , First Publish Date - 2023-03-19T12:02:58+05:30 IST
గల్ఫ్ దేశం ఖతార్ గతేడాది ఫిఫా ప్రపంచకప్‌కు (FIFA World Cup) ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే.
దోహా: గల్ఫ్ దేశం ఖతార్ గతేడాది ఫిఫా ప్రపంచకప్‌కు (FIFA World Cup) ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ ముగిసి నెలలు గడిచిన ఆ దేశానికి వెళ్లే సందర్శకుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఖాతార్లోని పర్యాటక ప్రదేశాలు, సాంస్కృతిక ప్రాంతాలను ప్రతిరోజు భారీ సంఖ్యలో పర్యాటకులు సందర్శిస్తున్నారట. ప్రధానంగా రాజధాని నగరం దోహాలోని (Doha) అన్ని ఐకానిక్ ప్రదేశాల్లో గతవారం ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన పర్యాటకులు కనిపించారని అధికారులు తెలిపారు. సౌక్ వాకిఫ్, మ్షీరెబ్, కార్నిచ్, ది పర్ల్లలోని హాటల్స్, రెస్టారెంట్స్, మాల్స్‌లో అరేబియన్ వంటకాలు, ఇతర కొన్ని స్పెషల్ డిషేస్ను విదేశీ పర్యాటకులు ప్రత్యేకంగా ఆస్వాదిస్తున్నారట. ఇక ఇప్పటికే పర్యాటకానికి మంచి పేరు ఉన్న ఖతార్‌కు.. ఫిఫా ప్రపంచకప్ మరింత ఆకర్షణను తెచ్చి పెట్టింది. దాంతో ఆటోమెటిక్‌గా పర్యాటకుల ఫేవరేట్ పర్యాటక గమ్యస్థానంగా మారిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇది కూడా చదవండి: 50 కంటే ఎక్కువ దేశాల పౌరులకు యూఏఈ తీపి కబురు
ఇంతకుముందు బిజినెస్ హబ్‌గా ఉన్న ఖతార్ (Qatar).. ఇప్పుడు పర్యాటకంగా కూడా సందర్శకులను ఆకర్షిస్తుండడం శుభాపరిణామం అని ఈ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఖతార్‌లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధమైనట్లు సమాచారం. అతి త్వరలోనే ప్రపంచ సందర్శకులకు అనేక ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయని దోహా బస్ జనరల్ మేనేజర్ తారెక్ అమోరా వెల్లడించారు. ఇక దోహా బస్ అనేది ఖతార్‌లోని ప్రముఖ డెస్టినేషన్ మేనేజ్మెంట్ కంపెనీ. ఇది సందర్శకులకు పర్యాటకం, ఆతిథ్యం సర్వీసులను అందిస్తుంది. 2013లో వచ్చిన ఈ సంస్థ.. అనతికాలంలోనే బాగా అభివృద్ధి చెందింది. హాప్ ఆన్ హాప్ ఆఫ్ టూర్ ప్రొవైడర్‌గా ప్రైవేట్ యాజమాన్యంలో ఈ సంస్థ స్థాపించబడింది.
ఇది కూడా చదవండి: నారింజ పండ్లు ఎంత పనిచేశాయి.. సౌదీలో తెలుగు ఎన్నారైకి ఊహించని అనుభవం.. అటు ఉన్న ఉద్యోగం ఊడి.. ఇటు స్వదేశానికి రాలేని పరిస్థితి..!