YSR Congress : గుడివాడ నుంచి కొడాలి నాని ఔట్.. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వట్లేదా.. వాట్ నెక్స్ట్..!?
ABN , First Publish Date - 2023-09-04T17:41:56+05:30 IST
గుడివాడలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నానికి (Kodali Nani) సీఎం వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan Reddy) చెక్ పెడుతున్నారా..? నమ్మినబంటు, తనకోసం ప్రాణాలిచ్చే వ్యక్తి కొడాలి నాని అని అసెంబ్లీ వేదికగా చెప్పిన సీఎం.. ఇప్పుడు ఆయన్నే పక్కనెడుతున్నారా..?..
గుడివాడలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నానికి (Kodali Nani) సీఎం వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan Reddy) చెక్ పెడుతున్నారా..? నమ్మినబంటు, తనకోసం ప్రాణాలిచ్చే వ్యక్తి కొడాలి నాని అని అసెంబ్లీ వేదికగా చెప్పిన సీఎం.. ఇప్పుడు ఆయన్నే పక్కనెడుతున్నారా..? రానున్న ఎన్నికల్లో కొడాలి కంచుకోట అయిన గుడివాడ (Gudivada) నుంచి టికెట్ ఇవ్వలేనని తేల్చి చెప్పేయనున్నారా..? ఇందుకు ఇటీవల జరిగిన ఒకట్రెండు పరిణామాలే బలం చేకూర్చాయా..? అంటే తాజా పరిస్థితులను బట్టి చూస్తే ఇవన్నీ అక్షరాలా నిజమేనని అనిపిస్తోంది. ఇంతకీ వైఎస్ జగన్ ప్లానేంటి..? నానిని నిజంగానే పక్కనెడుతున్నారా..? కొడాలిని కాదని జగన్ ఇంకెవర్ని గుడివాడ నుంచి బరిలోకి దింపాలని అనుకుంటున్నారు..? సోషల్ మీడియా వేదికగా వైసీపీ కార్యకర్తలు, నాని వీరాభిమానులు ఏమని చర్చించుకుంటున్నారు..? ఇటీవల గుడివాడ వైసీపీలో జరిగిన తన్నులాట వెనుక ఏం జరిగింది..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN-Andhrajyothy)లో చూద్దాం..
ఇదీ అసలు కథ..!
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం గురించి ప్రత్యేకించి చెప్పడానికి ఏమీ లేదు. ఒకప్పుడు టీడీపీ (Telugudesam) కంచుకోట.. ఇప్పుడు వైసీపీ (YSR Congress) అడ్డాగా ఉంది.! కొందరేమో గుడివాడ గడ్డ.. కొడాలి నాని అడ్డా అని చెప్పుకుంటూ ఉంటారు. నాటికి నేటికీ గుడివాడ టీడీపీ కంచుకోటేనని తెలుగు తమ్ముళ్లు చెబుతుంటారు. అయితే రానున్న ఎన్నికల్లో సీన్ మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. కొడాలి నానిని కాదని.. ఎంపీ వల్లభనేని బాలశౌరికి (Vallabhaneni Balasouri) ఎమ్మెల్యే టికెట్ (MLA Ticket) ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని వైసీపీ వర్గాల నుంచి విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందుకు వైఎస్ జగన్ కూడా బాలశౌరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా టాక్ నడుస్తోంది. అందుకే గుడివాడలో నానిని కాదని.. ప్రభుత్వ కార్యక్రమాలు, వ్యక్తిగత కార్యక్రమాలు కూడా ఎంపీ షురూ చేశారని తెలియవచ్చింది. ఇందులో భాగంగానే.. ఇటీవల కొత్త మున్సిపల్ కార్యాలయంలో నూతన పెన్షన్‌ల పంపిణీ కార్యక్రమానికి ఎంపీ ముఖ్య అతిథిగా విచ్చేశారని భోగట్టా. ఈ కార్యక్రమం సజావుగా సాగుతుండగా ఎమ్మెల్యే నాని లేకుండా కార్యక్రమం నిర్వహించడం ఏంటి..? అని కొడాలి వర్గీయులు కోపోద్రిక్తులయ్యారు. దీంతో గొడవ రాజుకోగా.. బాలశౌరి సమక్షంలోనే వైసీపీలో విభేదాలు బహిర్గతమయ్యాయి. వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు, మరో నాయకుడు వడ్లాని సుధాకర్ నడిరోడ్డుపై కొట్టుకున్నారు. ఎమ్మెల్యే నాని వర్గీయులనుద్దేశించి పగలు ఒక పార్టీ, రాత్రి ఒక పార్టీ అంటూ మండలి వ్యాఖ్యానించారు. మాట మాట అనుకుంటూనే మండలి, వడ్లాని సుధాకర్ బాహాబాహీకి తలపడి నడిరోడ్డుపైన కొట్టుకున్న పరిస్థితి. అంతేకాదు.. రాళ్లతో ఒకరిపై మరో వర్గం దాడి చేసుకుందంటే పరిస్థితి ఎలా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటనలో అటు నాని.. ఇటు బాలశౌరి వర్గీయులిద్దరూ గాయాలపాలయ్యారు. అయితే కేసుల జోలికి మాత్రం ఎవరూ వెళ్లలేదు.
అసలేం జరుగుతోంది..?
నాని ఎమ్మెల్యేగా కొనసాగుతుండగానే.. కొడాలికి వ్యతిరేకంగా మరో వర్గాన్ని, ఎంపీ నాయకత్వాన్ని.. వైఎస్ జగన్ రెడ్డి ప్రోత్సహించడంపై మాజీ మంత్రి వర్గం భగ్గుమంటోంది. వాస్తవానికి గుడివాడలో ఇటు పుల్ల తీసి.. అటు పెట్టాలన్నా సరే కొడాలి పర్మిషన్ కచ్చితంగా కావాలి. అలాంటిది నానికి ఎలాంటి సమాచారం లేకుండా.. కనీసం మాట వరుసకైనా పిలవకుండా.. ప్రొటోకాల్ పక్కనెట్టి మరీ గుడివాడకు బాలశౌరి రావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఈ పరిస్థితిని గమనించిన వైసీపీ శ్రేణులు, కొడాలి వర్గీయులు ఆశ్చర్యపోయారట. అసలు గుడివాడలో ఏం జరుగుతోంది..? నియోజకవర్గాన్ని జగన్ ఏం చేయాలని అనుకుంటున్నారు..? నానిని మించిన అంత మొగాడు ఇక్కడున్నాడా..? అంటూ కొడాలి ప్రధాన అనుచరులు, నియోజకవర్గ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో సోషల్ మీడియా వేదికగా రగిలిపోతున్నారట. అయితే ఇందులో నిజానిజాలెంత అనేది తెలుసుకొని తర్వాత స్పందించాలని నాని కూడా ఆచితూచి అడుగులేస్తున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే తాడేపల్లి ప్యాలెస్‌కు (Tadepalli Palace) వెళ్లి డైరెక్టుగా జగన్ రెడ్డితోనే తాడో పేడో తేల్చుకోవడానికి కొడాలి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలియవచ్చింది.
ఇదే జరిగితే నానీ పరిస్థితేంటి..!?
వైసీపీలోని ఒకరిద్దరు ముఖ్యనేతలు అందిస్తున్న సమాచారం మేరకు.. తాను ఈసారి ఎమ్మెల్యేగా పోటీచేయాలని అనుకుంటున్నట్లు మనసులోని మాటను సీఎంకు.. బాలశౌరి చెప్పారట. అయితే ప్రస్తుతానికి అటు గుంటూరు.. ఇటు విజయవాడలో దాదాపు ఎక్కడా ఖాళీ అనేది లేదు. నాని అయితే తాను ఎలా చెప్పినా వింటారని.. అందుకే గుడివాడను ఈ ఒక్కసారి వదిలేయమని అడగాలనే యోచనలో జగన్ ఉన్నారట. అందుకే.. ఇక గుడివాడలో ఇప్పట్నుంచే పనులు షురూ చేయాలని బాలశౌరికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. జగన్ అలా చెప్పిందే ఆలస్యం.. ఎంపీ ఇలా రంగంలోకి దిగిపోయారట. అందుకే ఇటీవల గుడివాడలో వైసీపీలోని ఇరు వర్గీయుల మధ్య గొడవ జరిగిందనే టాక్ నడుస్తోంది. ఈసారి నానిని మచిలీపట్నం పార్లమెంట్ స్థానం (Machilipatnam) నుంచి బరిలోకి దింపాలన్నది జగన్ ప్లానట. సీఎం చెబుతారు సరే.. నాని ఓకే అంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. అసలే నాని తనకు నమ్మినబంటు అని జగన్ చెబుతుంటారు.. ఈ పరిస్థితుల్లో సీఎం ఆదేశాలను కాదంటారో.. లేకుంటే మిన్నకుండా మచిలిపట్నం పోయి పోటీచేసుకుంటారో.. అసలు ఇందులో నిజానిజాలెంత అనేది తెలియాలంటే మరికొన్నిరోజులు వేచి చూడాల్సిందే మరి.