Telugu States Politics : బీఆర్ఎస్‌లో అంతా గందరగోళం.. తండ్రిదో దారి.. కొడుకుదో దారి.. మంత్రులది మరోదారి.. ఎందుకీ పరిస్థితి..?

ABN , First Publish Date - 2023-06-15T18:18:47+05:30 IST

అవును.. తెలంగాణ బీఆర్ఎస్‌లో (BRS) అంతా గందరగోళంగా ఉంది.. పార్టీ నేతలంతా ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తున్నారు..! సీఎం కేసీఆర్‌ (CM KCR) ఒకలా మాట్లాడితే.. కేటీఆర్ (KTR) ఇంకోలా మాట్లాడుతున్నారు.. ఇక కొందరు మంత్రులు (TS Ministers) అయితే తండ్రీకొడుకులిద్దరికీ పూర్తి డిఫరెంట్‌గా మాట్లాడేస్తున్నారు..! ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం బీఆర్ఎస్‌లో ఎవరికి వారే యమునా తీరేలా పరిస్థితి నెలకొంది..

Telugu States Politics : బీఆర్ఎస్‌లో అంతా గందరగోళం.. తండ్రిదో దారి.. కొడుకుదో దారి.. మంత్రులది మరోదారి.. ఎందుకీ పరిస్థితి..?

అవును.. తెలంగాణ బీఆర్ఎస్‌లో (BRS) అంతా గందరగోళంగా ఉంది.. పార్టీ నేతలంతా ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తున్నారు..! సీఎం కేసీఆర్‌ (CM KCR) ఒకలా మాట్లాడితే.. కేటీఆర్ (KTR) ఇంకోలా మాట్లాడుతున్నారు.. ఇక కొందరు మంత్రులు (TS Ministers) అయితే తండ్రీకొడుకులిద్దరికీ పూర్తి డిఫరెంట్‌గా మాట్లాడేస్తున్నారు..! ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం బీఆర్ఎస్‌లో ఎవరికి వారే యమునా తీరేలా పరిస్థితి నెలకొంది. ఇంతకీ ఎందుకీ పరిస్థితి..? ఎవరి విషయంలో ఇలా సీఎం మొదలుకుని మంత్రులు ఇలా మాట్లాడుతున్నారు..? మంత్రి కేటీఆర్‌ నిజంగానే భయపడ్డారా..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంచలన కథనంలో చూద్దాం..

Jagan-and-kcr.jpg

ఇదీ అసలు కథ..!

ఏపీ ప్రభుత్వం (AP Govt), సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) విషయంలో ఎందుకో తెలంగాణ సీఎం కేసీఆర్, హరీష్ రావు (Minister Harish Rao) , కేటీఆర్ మొదలుకుని ఇతర మంత్రులు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. బహిరంగ సభల్లో ఇతర రాష్ట్రాలతో పోలుస్తూ.. ముఖ్యంగా పక్కనున్న ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) గురించి ప్రస్తావిస్తూ కరెంట్, నీళ్ల విషయంలో గులాబీ బాస్ కేసీఆర్ తగిలీ తగలనట్లుగా విమర్శిస్తున్నారు. ఇక కేసీఆర్ కేబినెట్‌లో కీలక మంత్రి హరీష్ రావు అయితే ఏపీపై ఒంటికాలిపై లేస్తున్నారు.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి, సెటిలర్స్‌ను ఇక్కడే ఉండాలని కోరడం, నీటి సమస్య, కరెంట్ కోతలు, ప్రాజెక్టులు ఇలా ఒకట్రెండు కాదు.. సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా ఏపీలో నెలకొన్న సమస్యలను ప్రస్తావిస్తూ ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందుకు ఏపీ నుంచి అంతే రీతిలో మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) , మంత్రులు కారుమూరి, అప్పలరాజు ఇలాంటి వారు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు. ఈ మధ్యే హరీష్ రావు ఏపీ గురించి మాట్లాడగా.. మంత్రిగారి కథ ఇదీ అని పేర్ని నాని.. ఏవేవో సంచలన ఆరోపణలు చేశారు. ఇక మల్లారెడ్డి (Ministr Mallareddy) , ఒకరిద్దరు ఇతర మంత్రుల విషయానికొస్తే.. ఏపీ ప్రభుత్వం తీరు సర్లేదని, వైఎస్ జగన్‌కు పాలన చేత కావట్లేదని ఏపీలో కూడా బీఆర్ఎస్ వస్తేనే అక్కడి ప్రజలకు బాగుంటుందని చెప్పుకొచ్చారు. చూశారుగా.. పక్కనున్న రాష్ట్ర ప్రభుత్వం, జగన్‌పై కేసీఆర్, హరీష్, ఇతర మంత్రులు ఎలా మాట్లాడుతున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారనేది..!.

Mallareddy-and-Harish-Rao.jpg

కేటీఆర్ రూటే సపరేటు..!

కేసీఆర్, హరీష్‌తో సహా కొందరు మంత్రుల తీరు ఇలా ఉంటే.. ఇందుకు పూర్తి భిన్నంగా మంత్రి కేటీఆర్ ప్రవర్తన ఉండటం గమనార్హం. కేటీఆర్ తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో పురాతన శ్రీ లక్ష్మి వేంకటేశ్వర ఆలయంతో పాటు కొన్ని కొన్ని దేవాయాల పునరుద్ధరణకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ముందుకొచ్చింది. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో (TTD Chairman YV Subba Reddy) కలిసి కేటీఆర్ భూమి పూజలు చేశారు. కార్యక్రమం అనంతరం సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. సుబ్బారెడ్డన్న, జగన్ అన్న (Jagan anna) అని సంబోదిస్తూ మాట్లాడారు. అంతేకాదు.. గట్టిగా చప్పట్లు కొట్టి మనసారా అభినందించాలని సభకు వచ్చిన జనాలకు కూడా కేటీఆర్ చెప్పారు. ఇవన్నీ ఒక ఎత్తయితే తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా.. కేవలం ప్రాంతాలుగా విడిపోతున్నామని ప్రజలుగా మాత్రం కలిసే ఉన్నామని మంత్రి చెప్పుకొచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్‌ను కానీ.. ఏపీ సర్కార్‌ను పొల్లెత్తు మాట అనకుండా ఆకాశానికెత్తేస్తూ మాట్లాడేశారు. పోనీ ఇది టీటీడీ చేస్తున్న కార్యక్రమం కాబట్టి పొగడ్తలు కామనే అంటారా..? మంత్రులంతా ఆ రేంజ్‌లో విమర్శలు గుప్పిస్తుండటం, జగన్‌పై దుమ్మెత్తిపోస్తుంటే.. కేటీఆర్ మాత్రం తన రూటే సపరేటు అన్నట్లుగా ప్రవర్తిస్తుండటం చిత్రవిచిత్రంగా ఉంది.

jagan-and-ktr.jpg

మంత్రిగారు భయపడ్డారా..?

ఏపీలో రోడ్ల పరిస్థితి, ఇంకా కొన్ని విషయాలపై కేటీఆర్ గతంలో మాట్లాడగా .. వారం, పదిరోజుల పాటు ఇతర పార్టీ కార్యకర్తలు, వైసీపీ వీరాభిమానులు ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పించారు. ఎంతలా అంటే.. ఆ కామెంట్స్ రాయలేనంత పరిస్థితి. అటు బీఆర్ఎస్‌ కూడా ఆ విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తూ వచ్చింది. సోషల్ మీడియా వేదికగా అయితే జగన్ ఫ్యాన్స్ బరితెగించి మరీ కామెంట్స్ చేశారు. దీంతో అప్పట్లో ఏపీ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వాలుగా (AP Vs TS Govt) పరిస్థితులు మారిపోయాయి. ఆ కొద్దిరోజులూ ఎక్కడ చూసినా ఇదే చర్చ జరిగింది. ఆ విమర్శలు, కౌంటర్లు తట్టుకోలేక బహిరంగంగానే ‘క్షమించండి’ (Sorry) అనేంత పరిస్థితి. దీంతో అప్పట్నుంచీ వైసీపీ గురించి మాట్లాడాలన్నా .. వైఎస్ జగన్ పేరెత్తాలన్నా కేటీఆర్ ఎందుకో జంకుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయ్. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తుంటే అసలు బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోందో తెలియక కార్యకర్తలు, అభిమానులు అయోమయంలో పడ్డారు. ఇంతకీ బీఆర్ఎస్.. జగన్‌కు ఫేవర్‌గా ఉందో.. వ్యతిరేకంగా ఉందో అన్నది క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే బీఆర్ఎస్‌లో నెలకొన్న ఈ గందరగోళానికి కూడా వీలైనంత త్వరగా ఫుల్ స్టాప్ పెట్టాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే.. ఇదంతా పక్కా ప్లాన్‌తో వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలు చేస్తు్న్నాయనే ఆరోపణలు లేకపోలేదు.

KTR-And-Jagan.jpg

మొత్తానికి చూస్తే.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై బీఆర్ఎస్, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు ఎంత విమర్శలు చేసుకున్నప్పటికీ కేసీఆర్-వైఎస్ జగన్‌ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉందన్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్‌గా మారిన తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఇలా నేతలు ఎవరికి వారుగా ఏది పడితే అది మాట్లాడుతుండటం ఇప్పుడు రచ్చరచ్చగా ఉంది. పార్టీలో అధినేత ఏం చెప్పినా దాన్నే మంత్రులు మొదలుకుని కార్యకర్తల వరకూ అదే ఫాలో అయిపోతుంటారు.. కానీ ఎందుకో ఈ పరిస్థితి బీఆర్ఎస్‌లో ఇప్పుడు లేకపోవడంతో ఈ విచిత్ర పరిస్థితిపై తెలుగు రాష్ట్రాల్లో చర్చించుకోవాల్సి వస్తోంది. బీఆర్ఎస్‌లో ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో ఏంటో మరి..!

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Amith Shah ABN MD Radhakrishna: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ‌ని కలవనున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా..

******************************

Shah Meeting With Celebrities : టాలీవుడ్‌పై బీజేపీకి ఎందుకింత స్పెషల్ ఫోకస్.. రాజమౌళి, ప్రభాస్‌తో అమిత్ షా భేటీపై సర్వత్రా ఉత్కంఠ..!

******************************

Ambati Rayudu In Politics : అంబటి రాయుడు కాదు బాబోయ్.. బూతుల రాయుడు.. ఇంత పచ్చిగానా.. ఓహో వైసీపీకి నచ్చింది ఇందుకేనా..?

******************************

Janasena : జనసేన కండువా కప్పుకున్న ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్.. చేరిక సరే ఈసారైనా పోటీచేస్తారా..?

******************************

TS Congress : కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు జరుగుతున్న వేళ సీన్ రివర్స్.. ఎందుకిలా..?

******************************

Mudragada : రీ-ఎంట్రీకి సిద్ధమైన ముద్రగడ.. ఎంపీగా బరిలోకి దింపే యోచనలో వైసీపీ.. ఇంత నమ్మకద్రోహం చేసినా ఎందుకీ సాహసం..!?

******************************
TS Politics : రేవంత్ రెడ్డి సక్సెస్.. బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కేసీఆర్‌ అత్యంత సన్నిహితుడు రాజీనామా..

*****************************

Updated Date - 2023-06-15T18:29:17+05:30 IST