Governor Vs KCR Govt : గవర్నర్-గవర్నమెంట్ మధ్య మరింత దూరం.. చెన్నై వేదికగా కేసీఆర్‌ను తమిళిసై ఏమన్నారో తెలిస్తే..!?

ABN , First Publish Date - 2023-08-15T18:38:04+05:30 IST

అవును.. పంద్రాగస్టు (August-15th) సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (TS CM KCR) .. రాష్ట్ర గవర్నర్ తమిళిసై (Tamilsai) మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చెన్నైకి వెళ్లిన గవర్నర్ వేడుకల్లో పాల్గొన్నారు...

Governor Vs KCR Govt : గవర్నర్-గవర్నమెంట్ మధ్య మరింత దూరం.. చెన్నై వేదికగా కేసీఆర్‌ను తమిళిసై ఏమన్నారో తెలిస్తే..!?

అవును.. పంద్రాగస్టు (August-15th) సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (TS CM KCR) .. రాష్ట్ర గవర్నర్ తమిళిసై (Tamilsai) మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చెన్నైకి వెళ్లిన గవర్నర్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ ఇచ్చే తేనీటి విందుకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ (CM Stalin) గైర్హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. అటు తమిళనాడు, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రులపై కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ఇచ్చే తేనీటి విందుకు సీఎం గైర్హాజరవడం మంచిదికాదన్నారు. స్టాలిన్ రాకపోవడం నిజంగా బాధాకరమని తమిళిసై చెప్పుకొచ్చారు.


governor-tamilisai.jpg

కేసీఆర్ గురించి..!

రాజ్ భవన్‌లో (Raj Bhavan) తేనీటి విందుకు కేసీఆర్‌ను ఆహ్వానించామని గవర్నర్ తెలిపారు. అయితే సీఎం రావడం, రాకపోవడం అనేది రాజ్ భవన్ పరిధిలో లేదని గవర్నర్ చెప్పుకొచ్చారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ వైఖరి తనను తీవ్రంగా బాధించిందని తమిళిసై ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్లపై ముఖ్యమంత్రుల తీరు ఇలా ఉండటం ఎప్పటికి మంచిది కాదన్నారు. కాగా.. ఇవాళ్టి తేనేటి విందు కార్యక్రమానికి కూడా కేసీఆర్ దూరంగా ఉన్నారు. రాజ్‌భవన్ నుంచి ప్రగతి భవన్‌కు ఆహ్వానం వెళ్లినప్పటికీ ఇంతవరకూ ఎలాంటి స్పందన రాలేదు. కనీసం ప్రభుత్వం తరఫున ఒకరిద్దరు మంత్రులు కానీ.. లేదా సీఎస్‌ వెళ్తారనే దానిపై కూడా ఇంతవరకూ ఎలాంటి సమాచారం రాకపోవడం గమనార్హం.

KCR-And-Governer.jpg

ఎప్పుడూ ఇలాగే..!

రాష్ట్ర గవర్నర్‌గా తమిళిసై వచ్చిన తర్వాత బహుశా నాలుగైదు సందర్భాల్లో తప్పితే.. మిగిలిన అన్నిసార్లూ ఎడమొహం.. పెడమొహంగానే ఉన్నారు.! ఆ మధ్య రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలంగాణ పర్యటనకు వచ్చిన సమయంలో, రాజ్‌భవన్‌లో జరిగిన రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తమిళిసై, కేసీఆర్ (Tamilisai-CM KCR) ఇద్దరూ ఒకే వేదికపై కలవడం, పలకరించుకోవడం జరిగింది. కేసీఆరే స్వయంగా రాజ్‌భవన్‌లోకి వెళ్లడంతో హమ్మయ్యా.. పరిస్థితులు మారాయి అని అనుకున్నారు. అంతేకాదు.. ఆ తర్వాత ఒకట్రెండు బిల్లుల విషయంలో గవర్నర్ నుంచి ఆమోద ముద్ర కూడా రావడంతో గవర్నర్-కేసీఆర్ కలిసిపోయారనే వార్తలు వచ్చాయి. అయితే.. అది ఎన్నోరోజులు లేదు.

KCR-And-Gov.jpg

ప్రొటోకాల్ రగడే!

గత కొన్ని నెలలుగా గవర్నర్‌-కేసీఆర్ (Governor Vs KCR) మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేంతలా పరిస్థితులు ఉన్నాయి. దీంతో సీన్ కాస్త ప్రగతిభవన్ వర్సెస్ రాజ్‌భవన్‌గా (Pragathi Bhavan- Raj Bhavan) మారిపోయింది. ప్రభుత్వం ఏ మాత్రం ప్రోటోకాల్ (Protocol) పాటించట్లేదని కేసీఆర్ సర్కార్‌పై పలుమార్లు బహిరంగంగా గవర్నర్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ మధ్య గవర్నర్ దగ్గర పలు బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ (Governor Vs Govt) మధ్య మరింత గ్యాప్ పెరిగినట్లయ్యింది. ఇటీవలే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడంపై బిల్లు విషయంలో ఎంత రాద్ధాంతం జరిగిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించడం, కేసీఆర్ సర్కార్ వివరణ ఇవ్వడం ఇలా రెండ్రోజులపాటు జరిగాక ఆఖరికి ఆదివారం రోజున గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. గ్యాప్ తగ్గిందని అందరూ భావించారు. కానీ.. అదేరోజు అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడుతూ గవర్నర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే.. ప్రభుత్వం తీరుతో తీవ్ర ఆగ్రహానికి లోనైన గవర్నర్.. పెండింగ్‌ బిల్లుల విషయంలో రాజ్యాంగపరమైన అస్త్రాలు ఉపయోగించడానికి సిద్ధమైనట్లు తెలియవచ్చింది. మొత్తానికి చూస్తే.. గవర్నర్-గవర్నమెంట్ మధ్య రోజురోజుకూ గ్యాప్ పెరుగుతోందే తప్ప అస్సలు తగ్గట్లేదు.

governor-thamikisye.jpg


ఇవి కూడా చదవండి


AP Politics : ఏపీ మంత్రి అమర్నాథ్‌పై దమ్మున్న ‘ఏబీఎన్’ ప్రశ్నల వర్షం.. సమాధానం చెప్పలేక..!


TS Assembly Elections 2023 : మంత్రి సబిత- తీగల చెట్టాపట్టాల్.. అరగంట పాటు రహస్య సమావేశం..!


BRS : ఐదుసార్లు సర్వే చేయించినా ఆ మంత్రిపై నెగిటివ్‌గానే ఫలితం.. టికెట్ లేనట్టే..!?


AP Politics : ఏపీ ఎన్నికల ముందు వైఎస్ జగన్‌కు ఇంత భయమెందుకో..!?

Updated Date - 2023-08-15T18:45:24+05:30 IST