Share News

PM Modi : తెలంగాణకు విచ్చేస్తున్న మోదీ.. అందరి చూపు ప్రధాని ప్రసంగంపైనే.. ఊహించని ప్రకటన ఉంటుందా..!?

ABN , First Publish Date - 2023-11-10T22:46:25+05:30 IST

PM Modi Telangana Tour : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం నాడు (నవంబర్-11న) సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న ‘మాదిగ-ఉపకులాల విశ్వరూప సభ’కు ప్రధాని హాజరుకాబోతున్నారు...

PM Modi : తెలంగాణకు విచ్చేస్తున్న మోదీ.. అందరి చూపు ప్రధాని ప్రసంగంపైనే.. ఊహించని ప్రకటన ఉంటుందా..!?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం నాడు (నవంబర్-11న) సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న ‘మాదిగ-ఉపకులాల విశ్వరూప సభ’కు ప్రధాని హాజరుకాబోతున్నారు. రేపు సాయంత్రం 4:45 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు మోదీ చేరుకోనున్నారు. అనంతరం 5:30 గంటలకు మోదీ ప్రసంగం ప్రారంభం కానుంది. మరోవైపు.. భారీ జనసమీకరణకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ సభా వేదికగా ఎస్సీ కులాల వర్గీకరణపై కీలక ప్రకటన చేస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాదు వర్గీకరణ అడుగు దూరంలో మాత్రమే ఉందని.. మోదీ రావడం ఆలస్యం ప్రకటనే తరువాయి అని ప్రజలంతా గల్లీ నుంచి ఢిల్లీ వరకూ చెప్పుకుంటున్న పరిస్థితి.


pm modi.jpg

ఎదురుచూపులు!

మాదిగలు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తోన్న ఎస్సీ(SC) ఉప వర్గీకరణను మోదీ ప్రకటించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయన ప్రసంగం కోసం యావత్ తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి.. తెలంగాణలోని ఎస్సీ జనాభాలో మాదిగ కులస్థులు 60 శాతం ఉన్నారు. 20-25 నియోజకవర్గాల్లో వీరు కీలక ఓట్ బ్యాంక్‌గా ఉన్నారు. 4 - 5 సెగ్మెంట్లలో రెండో పెద్ద సామాజికవర్గం కావడంతో ఎమ్మెల్యే అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించే పరిస్థితి మాదిగలకు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రిజర్వేషన్ ఉన్నా తమ ప్రయోజనాలు దెబ్బ తింటున్నాయని మాదిగలు అసంతృప్తి ఉన్నారు. దీంతో ఎస్సీ ఉప వర్గీకరణ చేయాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS) మాదిగలు, ఉపకులాల మహాసభ సమావేశాలు తరచూ నిర్వహిస్తోంది.

modi-pm.jpg

ప్రకటన ఉంటే మాత్రం..!

ఎస్సీ ఉపవర్గీకరణ చేయాలని 3 దశాబ్దాలుగా ఆ సంస్థ డిమాండ్ చేస్తోంది. వర్గీకరణకు బీజేపీ సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. వర్గీకరణ చేస్తే.. బీఆర్ఎస్(BRS) ప్రకటించిన దళితబంధు పథకానికి బీజేపీ(BJP) నుంచి గట్టి కౌంటర్ పడుతుందని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. 2018 ఎన్నికలో ఎంఆర్పీఎస్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. అయితే 2023 ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇస్తుందనే విషయంలో స్తబ్దత కొనసాగుతోంది. ఆ సంస్థ మద్దతు పొందేందుకు బీజేపీ ఆరాటపడుతోంది. అక్టోబర్‌లో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ(Mandakrishna Madiga) ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amithshah)ను కలిసి ఎస్సీ ఉపవర్గీకరణ చేయాలని కోరుతూ వినతిపత్రం అందించారు. తన వినతిపై కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ‘పరేడ్ గ్రౌండ్ పబ్లిక్ మీటింగ్‌లో ప్రధాని మోదీ ఎస్సీ వర్గీకరణను ప్రకటించి, పార్లమెంట్‌లో చట్టాన్ని రూపొందించి ఆమోదిస్తారని మేం ఆశిస్తున్నాం. నవంబర్ 11న ప్రధాని సభ తరువాత మేం ఎవరికి మద్దతు ఇవ్వాలనే నిర్ణయం ఆధారపడి ఉంటుంది’ అని మందకృష్ణ తెలిపారు. సరిగ్గా అటు ఎన్నికలు.. ఇటు సభ ఉండటంతో హైదరాబాద్‌ పరేడ్ గ్రౌండ్‌లో వేదికగా కీలక ప్రకటనే ఉంటుందని ఆయా సామాజికవర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి మరి.

Modi-and-Manda-Krishna.jpg

Updated Date - 2023-11-10T22:49:52+05:30 IST