Skill Case : స్కిల్ డెవలప్మెంట్ కేసులో లోకేష్‌కు భారీ ఊరట

ABN , First Publish Date - 2023-10-12T13:36:13+05:30 IST

స్కిల్ డెవలప్‌మెంట్అక్రమ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఇవాళ ఉదయం నుంచి హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరగ్గా మధ్యాహ్నానికి లోకేష్‌పై ఉన్న స్కిల్ కేసును హైకోర్టు క్లోజ్ చేసింది..

Skill Case : స్కిల్ డెవలప్మెంట్ కేసులో లోకేష్‌కు భారీ ఊరట

స్కిల్ డెవలప్‌మెంట్అక్రమ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఇవాళ ఉదయం నుంచి హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరగ్గా మధ్యాహ్నానికి లోకేష్‌పై ఉన్న స్కిల్ కేసును హైకోర్టు క్లోజ్ చేసింది. దీంతో లోకేష్‌కు బిగ్ రిలీఫ్ దక్కినట్టయ్యింది. లోకేష్‌ను స్కిల్ కేసులోనిందితుడిగా తాము చేర్చలేదని సీఐడీ చెప్పింది. ముద్దాయిగా చూపని కారణంగా ఆయన్ను అరెస్ట్ చేయబోమని కోర్టుకు సీఐడీ తెలిపింది. ఒకవేళ ఈ కేసులో నిందితుడిగా చేరిస్తే 41-ఏ కింద నోటీసులు ఇస్తామని న్యాయస్థానానికి సీఐడీ అధికారులు వెల్లడించారు.


lokesh-ntr.jpg

ఆనందంలో టీడీపీ శ్రేణులు!

ఈ కేసులో లోకేష్‌‌ను ఇవాళ్టి వరకూ లోకేష్‌ను మేము నిందితులుగా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చలేదని హైకోర్టుకు సీఐడీ వివరించింది. హైకోర్టు తీర్పుతో టీడీపీ శ్రేణులు ఆనందంలో మునిగితేలుతున్నాయి. ప్రభుత్వం కక్షపూరితంగా, అక్రమంగా కేసులు బనాయించవచ్చు కానీ.. న్యాయస్థానాల్లో న్యాయమే జరుగుతుందని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ఇది సీఎం వైఎస్ జగన్‌కు దిమ్మతిరిగే షాకేనని టీడీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. త్వరలోనే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కూడా శుభవార్త రావాలని.. టీడీపీ కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఒక్క లోకేష్ విషయంలోనే కాదు.. టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా త్వరలోనే బిగ్ రిలీఫ్ రావొచ్చని ఆ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ap-high-court.jpg

మొదట్నుంచే కన్ఫూజన్!

స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో మొదట్నుంచీ లోకేష్ పేరు ఉందా.. లేదా..? అనేది సీఐడీకే స్పష్టత లేదు. లోకేష్ పేరు లేదని చెబుతున్నప్పటికీ.. చంద్రబాబు అరెస్ట్ తర్వాత సీఐడీ చీఫ్ సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించిన నిధులు లోకేష్‌కు వచ్చాయని ఆరోపణలు చేశారు. అయితే లోకేష్‌కి ఈ శాఖతో ఎలాంటి సంబంధం లేదన్న విషయం జగమెరిగిన సత్యమే. లోకేష్ పంచాయతీరాజ్, ఐటీ శాఖలు నిర్వహించారు. అయితే కిలారు రాజేష్ ద్వారా వచ్చాయన్నది సీఐడీ ఆరోపణ. అంతకుముందు కిలారు రాజేష్ ఇంటి దగ్గర ఐటీ అధికారులు తనిఖీలు చేసి ఎటువంటి ఆధారాలు దొరకపోవడంతో ఆ కేసును మూసేశారు. కానీ.. కిలారు షెల్ కంపెనీల ద్వారా లోకేష్‌కు డబ్బులు వచ్చాయని సీఐడీ పదే పదే చెబుతోంది. దర్యాప్తు చేస్తున్నామని, ఆధారాలు లభిస్తే అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని సీఐడీ అధికారులు పేర్కొన్నారు. అంతేకాదు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇదే పాటపాడడంతో ముందస్తు బెయిల్ కావాలంటూ లోకేష్ తరపు న్యాయవాదులు ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం లంచ్ మోషన్ దాఖలు చేశారు. సీన్ కట్ చేస్తే.. అసలు స్కిల్ కేసులో లోకేష్ నిందితుడే కాదని.. ఆయనకు ఎలాంటి సంబంధంలేదని న్యాయస్థానం ముందే సీఐడీ క్లియర్ కట్ చెప్పింది.

lokesh-cid1.jpg

Updated Date - 2023-10-12T13:42:11+05:30 IST