Telugudesam : బిగ్ షాక్.. పదవి వచ్చిన కొన్ని రోజులకే మాజీ ఎమ్మెల్యే రాజీనామా.. టీడీపీలో చేరనున్న కీలక నేత..!

ABN , First Publish Date - 2023-03-09T23:31:59+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు (AP 2024 Elections) ఇంకా సమయం ఉండగానే జంపింగ్‌లు షురూ అయ్యాయి. తమకు ఏ పార్టీలో సముచిత స్థానం ఉంటుందో ఆ గూటిలో చేరిపోతున్నారు నేతలు.

Telugudesam : బిగ్ షాక్.. పదవి వచ్చిన కొన్ని రోజులకే మాజీ ఎమ్మెల్యే రాజీనామా.. టీడీపీలో చేరనున్న కీలక నేత..!

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు (AP 2024 Elections) ఇంకా సమయం ఉండగానే జంపింగ్‌లు షురూ అయ్యాయి. తమకు ఏ పార్టీలో సముచిత స్థానం ఉంటుందో ఆ గూటిలో చేరిపోతున్నారు నేతలు. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ (Congress, BJP) పార్టీలకు చెందిన ముఖ్య నేతలు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇప్పటికే పలువురు నేతలు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పసుపు కండువాలు కప్పుకున్నారు. తాజాగా.. మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా (Resignation) చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు..? టీడీపీలో ఎందుకు చేరుతున్నారనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

ఇంతకీ ఎవరా నేత..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా (M Shajahan Basha) ఆ పార్టీకి రాజీనామా చేశారు. మదనపల్లెలో (Madanapalle) ఒకప్పుడు ఈయన పేరు మార్మోగింది. వైఎస్‌కు (YSR) అత్యంత ఆప్తుడిగా కూడా ఈయనకు మంచి పేరుంది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ (Congress) కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే అప్పట్లో పార్టీకి ఈయన సేవలను గుర్తించిన అధిష్ఠానం ఈ మధ్యనే అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) సభ్యునిగా కీలక పదవిని ఇచ్చింది. 45 మంది సభ్యులున్న ఏఐసీసీలో ఈయనకు చోటు దక్కడంతో ఆయన అభిమానులు, కార్యకర్తలు చాలా సంతోషపడ్డారు. అయితే.. ఇంతలోనే ఏం జరిగిందో తెలియట్లేదు కానీ ఫిబ్రవరి చివర్లో ఈ పదవి రాగా.. పట్టుమని నెలరోజులు కూడా పూర్తవ్వక ముందే కాంగ్రెస్ పార్టీకి షాజహాన్ రాజీనామా చేశారు. ఈయన రాజీనామా కాంగ్రెస్‌పార్టీకి గట్టి ఎదురుదెబ్బేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే షాజహాన్‌కు సోదరుడైన మహ్మద్ నవాజ్ బాషా (Mohammed Nawaz Basha) ప్రస్తుతం మదనపల్లె ఎమ్మెల్యేగా (Madanapalle MLA) ఉన్నారు. వైసీపీ (YSRCP) అధికారంలోకి వచ్చాక షాజహాన్ వర్సెస్ నవాజ్‌గా పరిస్థితులు మారాయి. దీంతో సోదరుడ్ని ఎదుర్కోవడానికి టీడీపీలో చేరాలని షాజహాన్ నిర్ణయించుకున్నారు.

Madanapalle-Cons.jpg

సుదీర్ఘంగా చర్చించాక..!

వీరాభిమానులు, ముఖ్య కార్యకర్తలతో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత షాజహాన్ తన భవిష్యత్ కార్యాచరణపై ఇలా కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీతోనే (Telugudesam) నియోజకవర్గం, రాష్ట్రాభివృద్ధి ఉంటుందని భావించిన ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పసుపు కండువా కప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రజల అభీష్టం మేరకు, మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం టీడీపీలో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం నాడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యువగళం పాదయాత్ర మదనపల్లిలో జరగనుంది. ఈ పాదయాత్రలో భాగంగా జరిగే బహిరంగ సభలో తన అనుచరులు, ముఖ్య నేతలతో.. లోకేష్ సమక్షంలో షాజహాన్ టీడీపీ కండువా కప్పుకోబోతున్నారు.

Madanapalle.jpg

ఇదిలా ఉంటే.. ఈ మధ్యే టీడీపీ అధినేత చంద్రబాబుతో (Nara Chandrababu) మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా అమరావతిలో భేటీ అయ్యారు. ఆ రోజే ఈ చేరిక గురించి ఇద్దరి మధ్య జరిగినట్లు తెలుస్తోంది. పాదయాత్రలో భాగంగా చేరాలని ముహూర్తం ఫిక్స్ చేసుకున్న శుక్రవారం నాడు టీడీపీలో చేరబోతున్నారని అభిమానులు చెబుతున్నారు. ఈయన టీడీపీలో చేరిన తర్వాత అధిష్టానం ఆయనకు ఇచ్చే హామీ ఏంటి..? .. రానున్న ఎన్నికల్లో మదనపల్లి నుంచి అభ్యర్థిగా నిలబెడుతుందా లేదా..? అనేది తెలియాల్సి ఉంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.

******************************

ఇది కూడా చదవండి..

******************************

MLC Kavitha : ఢిల్లీలో బిజిబిజీగా ఎమ్మెల్సీ కవిత.. ఈడీ విచారణ నేపథ్యంలో హాట్ టాపిక్‌గా మారిన ఫ్లెక్సీలు.. ఇదీ అసలు కథ..!

******************************

******************************

MLC Kavitha : కేబినెట్‌ భేటీలో కేసీఆర్ అనూహ్య నిర్ణయం.. సమావేశం మధ్యలోనే ఇద్దరు మంత్రులు బయటికొచ్చి..!


******************************

Delhi Liquor Scam : విచారణలో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అడిగే ప్రశ్నలివేనా.. నరాలు తెగే ఉత్కంఠ..!


******************************

Delhi Liquor Scam : ఢిల్లీ బయల్దేరేముందు కేసీఆర్-కవిత 15 నిమిషాల ఫోన్‌కాల్‌లో ఏమేం మాట్లాడుకున్నారు..!?

******************************

Delhi Liquor Scam : సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎప్పుడేం జరిగింది.. పిన్ టూ పిన్ వివరాలివిగో..!


******************************

Delhi Liquor Scam : ఈడీ నుంచి రాని రిప్లై.. కేసీఆర్ ఫోన్ కాల్ తర్వాత ఢిల్లీకి పయనమైన ఎమ్మెల్సీ కవిత.. బీఆర్ఎస్‌లో నరాలు తెగే ఉత్కంఠ!

******************************

Delhi Liquor Scam : లిక్కర్ స్కామ్‌లో కవిత పాత్ర ఉందని తేలితే.. బీఆర్ఎస్ శ్రేణులు షాకయ్యే విషయాలు చెప్పిన న్యాయ నిపుణులు..!


******************************

Updated Date - 2023-03-09T23:35:44+05:30 IST