Chandrababu: వివేకానందరెడ్డి హత్యపై షాకింగ్ విషయాలు చెప్పిన చంద్రబాబు

ABN , First Publish Date - 2023-02-23T23:57:54+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిJagan Mohan Reddyపై టీడీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Chandrababu: వివేకానందరెడ్డి హత్యపై షాకింగ్ విషయాలు చెప్పిన చంద్రబాబు

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) పై టీడీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu) సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబాయ్‌ని చంపిన విధానం, ఆడిన నాటకం కూడా ఎవరూ ఊహించలేరని చంద్రబాబు అన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య (Vivekananda Reddy Murder) జరిగిన రాత్రి అవినాష్ రెడ్డి ఇంట్లోనే వీళ్లందరూ ఉన్నారని సీబీఐ రిపోర్టు ప్రకారం తెలుస్తోందని చంద్రబాబు చెప్పారు. అక్కడే అందరూ ఉండి గొడ్డలి కూడా తెప్పిచ్చారని, అక్కడి నుంచి వెళ్లి రాత్రి వివేకాను చంపి మళ్లీ అవినాష్ ఇంటికే వచ్చారని, అవినాష్ రెడ్డి లోటస్ పాండ్‌కు ఫోన్ చేశాడని సీబీఐ దాఖలు చేసిన కౌంటర్‌లో ఉందని చంద్రబాబు వెల్లడించారు. ఫోన్ చేసి అన్ని అడిగిన తర్వాత నాటకానికి తెరతీశారని చంద్రబాబు ధ్వజమెత్తారు.

వివేకాకు గుండెపోటు వచ్చిందని, రక్తపు వాంతులని నాటకం ఆడారని, ఒక నరహంతకుడికి ఓట్లు వేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఆ రోజు జగన్ వివేకా హత్యపై సీబీఐ విచారణ కోరారని, పేపర్ లో నారాసుర రక్తచరిత్ర అని రాశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసినా కూడా వేరే వాళ్లపై తప్పును వేశారని, భయంకరమైన ఆలోచన చేస్తుంటేనే కంపరం పుడుతుందని చంద్రబాబు మండిపడ్డారు. వివేకానందరెడ్డి వీళ్ల అధికారానికి అడ్డం వచ్చాడని, అవసరమైతే షర్మిలకు పార్లమెంట్ ఇవ్వండని, అవినాష్ రెడ్డికి జమ్మలమడుగు ఇవ్వమని గట్టిగా ఒత్తిడి పెంచుతున్నారని, ఆ అడ్డంకిని లేకుండా తొలగించుకోవాలని ఆ రాత్రి వివేకాను చంపేశారని, జగన్ ఇంటికి ఫోన్లు చేసి మాట్లాడుకున్న తర్వాత గుండెపోటు కింద చిత్రికరించి సాక్షి న్యూస్ లో వేసి ప్రచారం చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చిందని, జగన్ ఊహించి ఉండని తాను తగులుకుంటాడని చంద్రబాబు ఎద్దేవా చేశారు. కుట్రదారులు ఉన్నది, కుట్ర చేసిన తర్వాత వచ్చింది అవినాష్ రెడ్డి ఇంటికే అని అన్నారు. అక్కడి నుంచి లోటస్ పాండ్ కు ఫోన్ చేశారని చంద్రబాబు మండిపడ్డారు.

Updated Date - 2023-02-24T00:36:10+05:30 IST