Kavitha ED Enquiry : ఎమ్మెల్సీ కవిత ముందు నాలుగు ఆప్షన్లు.. హైదరాబాద్ వచ్చీ రాగానే...!

ABN , First Publish Date - 2023-03-16T16:58:21+05:30 IST

దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) ఇవాళ ఈడీ విచారణకు (ED Enquiry) హాజరుకాలేదు.

Kavitha ED Enquiry : ఎమ్మెల్సీ కవిత ముందు నాలుగు ఆప్షన్లు.. హైదరాబాద్ వచ్చీ రాగానే...!

దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) ఇవాళ ఈడీ విచారణకు (ED Enquiry) హాజరుకాలేదు. హస్తిన వేదికగా కవిత ఏం చేయబోతున్నారు..? ఈడీ అధికారులు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు..? అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒక్క మాటలో చెప్పాంటే గురువారం ఉదయం నుంచి హస్తిన వేదికగా పెద్ద హైడ్రామానే నడిచింది. ఆఖరికి ఈ పరిణామాలన్నింటి తర్వాత కవితకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. 20న ఈడీ ఎదుట హాజరుకావాల్సిందేనని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఇవాళ్టి ఈడీ విచారణపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టులో (Supreme Court) కవిత దాఖలు చేసిన పిటిషన్ 24న విచారణకు రానుంది. అయితే ఈ లోపే విచారణకు రావాలని కవితకు ఈడీ నుంచి నోటీసులు రావడంతో బీఆర్ఎస్‌ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది. నోటీసులిచ్చి రెండు, మూడు గంటలు గడిచినా కవిత నుంచి ఇంతవరకూ ఎలాంటి రియాక్షన్ రాలేదు. ఇక ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో (Ministers KTR, Harish Rao) కలిసి కవిత బయల్దేరారు. అయితే.. నోటీసులు అందుకున్న కవిత ఇప్పుడు ఏం చేయబోతున్నారు..? ఆమె ముందు ఏమేం ఆప్షన్లు ఉన్నాయ్..? ఈ మొత్తం వ్యవహారంపై న్యాయ నిపుణులు ఏమంటున్నారు..? అనే విషయాలు ఇప్పుడీ కథనంలో తెలుసుకుందాం.

వాట్ నెక్స్ట్..?

అనారోగ్యంతో ఉన్నానని ఈడీకి సమాచారం పంపిన కవిత ముందు ఇప్పుడు నాలుగు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

1. ఈడీ నోటీసుల ప్రకారం ఈనెల 20న విచారణకు హాజరుకావడం.

2. ఈ నెల 24 కంటే ముందే తన పిటిషన్‌ను విచారించాలని మరోసారి సుప్రీంను ఆశ్రయించడం.

3. ఈడీ సమన్లపై సుప్రీంకోర్టులో స్టే కోరడం.

4. యాంటిసిపేటరీ బెయిల్‌కు అప్లై చేయడం.

ఇందులో కవిత నాలుగో ఆప్షన్‌ అవకాశాలు మెండుగా ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మరి కవిత మనసులో ఏముందో ఏంటో..!

Kavitha-Options.jpg

ఉదయం నుంచి ఇదే చర్చ!

ఇవాళ ఉదయం ఢిల్లీలోని సీఎం కేసీఆర్ నివాసంలో బీఆర్ఎస్ లీగల్ సెల్ సభ్యులు, న్యాయ నిపుణులతో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు.. కవిత సుదీర్ఘంగా చర్చించారు. చర్చల అనంతరం తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని.. విచారణకు హాజరుకావట్లేదని తన న్యాయవాది సోమా భరత్‌ కుమార్ ద్వారా ఈడీకి కవిత సమాచారం పంపారు. మొదట కవిత విజ్ఞప్తిని అంగీకరించని ఈడీ.. ఆ తర్వాత ఫైనల్‌గా నోటీసులు జారీచేసింది. అయితే ఇలా నోటీసులు ఇస్తారని కవిత ముందే ఊహించారట. అందుకే ఒకవేళ నోటీసులు ఇస్తే ఎలా ముందుకెళ్లాలి..? ఆ నోటీసులకు ఎలా రిప్లయ్ ఇవ్వాలి..? అనేదానిపై కూడా నిశితంగా చర్చించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. హైదరాబాద్‌కు రాగానే సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యి.. ఆ తర్వాత ఈడీ నోటీసులకు రిప్లయ్ కూడా పంపాలనే యోచనలో కవిత ఉన్నట్లు తెలియవచ్చింది. అయితే కవిత రిప్లయ్‌ ఎలా ఉండబోతోందనే దానిపై జనాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు.. ఢిల్లీలో రద్దయిన ప్రెస్‌మీట్ హైదరాబాద్‌లో ఇవాళ 8 గంటలలోపు ఉంటుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రెస్‌మీట్‌తో ఇవాళ ఉదయం నుంచి ఏం జరిగింది.. నోటీసుల విషయంలో ఎలా ముందుకెళ్తారనే విషయంపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.

మొత్తానికి చూస్తే.. కవిత ముందు అయితే నాలుగు ఆప్షన్లు ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఫైనల్‌గా కవిత ఏం నిర్ణయం తీసుకుంటారు..? ఈ నోటీసులపై ఎలా ముందుకెళ్తారనే దానిపై ఫుల్ క్లారిటీ రావాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే మరి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

BRS MLC Kavitha : ఆ అరగంట ఏం జరిగింది..?.. కవిత ఈడీ విచారణ హైడ్రామాలో వెలుగులోకి సీక్రెట్ కోణం..!

******************************
******************************

Kavitha ED Enquiry Live: విచారణకు రాలేనంటూ ఈడీకి కవిత లేఖ.. ‘నో’ చెప్పిన ఈడీ


******************************

TSPSC Paper Leak : టీఎస్‌‌పీఎస్సీ పేపర్ లీకేజీలో కీలక నిందితురాలు రేణుక ఎవరు.. ప్రవీణ్‌తో పరిచయం ఎలా.. పెద్ద కథే ఉందిగా..!


******************************

Janasena : పవన్ పదే పదే ‘కాపు’ ప్రస్తావన తేవడం వెనుక పెద్ద మాస్టర్ ప్లానే ఉందిగా.. ఇదేగానీ వర్కవుట్ అయితే..!


******************************


Updated Date - 2023-03-16T17:01:44+05:30 IST