MLC Kavitha : హుటాహుటిన హస్తినకు బయల్దేరిన మంత్రి కేటీఆర్.. ఏం జరుగుతుందో..!

ABN , First Publish Date - 2023-03-10T19:21:58+05:30 IST

దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో (Delhi liquor Scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) శనివారం నాడు ఈడీ (ED) ఎదుట హాజరుకానున్నారు...

MLC Kavitha : హుటాహుటిన హస్తినకు బయల్దేరిన మంత్రి కేటీఆర్.. ఏం జరుగుతుందో..!

దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో (Delhi liquor Scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) శనివారం నాడు ఈడీ (ED) ఎదుట హాజరుకానున్నారు. దీంతో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మరీ ముఖ్యంగా కవితను అరెస్ట్ చేస్తారని స్వయంగా సీఎం కేసీఆర్ (CM KCR) వ్యాఖ్యానించడంతో అసలేం జరుగుతోందని బీఆర్ఎస్ శ్రేణుల్లో నరాలు తెగే ఉత్కంఠం నెలకొంది. ఇప్పటికే ఢిల్లీలో కవితతో పాటు మహిళా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy), సత్యవతి రాథోడ్‌లు (Satyavathi Rathod) ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం బీఆర్ఎస్ లీగల్ సెల్‌కు చెందిన న్యాయవాదులు వెళ్లారు. ఇలా వరుసగా బీఆర్ఎస్ పెద్దలంతా ఢిల్లీకి పయనం అవుతున్నారు.

KCR-and-KTR.jpg

హుటాహుటిన..!

తాజాగా.. కవిత సోదరుడు, మంత్రి కేటీఆర్ (Minister KTR) కూడా ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం తర్వాత హుటాహుటిన కేటీఆర్ ఢిల్లీ బయల్దేరారు. సుదీర్ఘ చర్చ తర్వాత ఢిల్లీ వెళ్లాలని కేటీఆర్‌కు సీఎం సూచించారు. రేపు కవిత ఈడీ విచారణ ఉండటంతో కేటీఆర్ హస్తిన టూర్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా కేటీఆర్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ కీలక నేతలు కూడా ఆయన వెంట వెళ్తున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా బీఆర్ఎస్ మీటింగ్‌లో కేంద్రం, కవితకు ఇచ్చిన నోటీసులపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కవితను అరెస్ట్ చేసుకుంటే చేసుకోనీ.. అందర్నీ వేధిస్తున్నారని గులాబీ బాస్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఎవరికీ భయపడేది లేదని.. పోరాటం అస్సలు ఆపే ప్రసక్తే లేదన్నారు కేసీఆర్.

kavitha-and-KTR.jpg

కవితకు బాసటగా..!

కవిత ఢిల్లీ బయల్దేరి వెళ్లే ముందు సుమారు 15 నిమిషాల పాటు కేసీఆర్ ఫోన్‌లో (Kavitha-KCR Phone) మాట్లాడారు. కవితకు ధైర్యం చెప్పి అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందని ఢిల్లీ పంపారు. ఇప్పుడు చెల్లి కవితకు బాసటగా నిలిచేందుకు కేటీఆర్ హస్తినకు వెళ్తున్నారు. ఢిల్లీ వెళ్లగానే కవితతో కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ అవుతారని తెలియవచ్చింది. అనంతరం లీగల్ సెల్ సభ్యులతో కూడా ఆయన భేటీ కానున్నారట. ఇప్పటికే ఈ కేసులో ఎలా ముందుకెళ్దాం..? అనేదానిపై బీఆర్ఎస్ పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికే కేటీఆర్ ఢిల్లీ వెళ్తున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

BRS KCR : తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడో ఒకే ఒక్క మాటలో తేల్చేసిన సీఎం కేసీఆర్..


******************************

Delhi Liquor Scam : కవితకు ఈడీ నోటీసులివ్వడంపై ఫస్ట్ టైమ్ స్పందించిన కేసీఆర్.. సీఎం మాటలతో బీఆర్ఎస్‌లో టెన్షన్.. టెన్షన్..


******************************

Updated Date - 2023-03-10T19:39:13+05:30 IST