Chandrababu Arrest: జెనెక్స్ సంచలన నిర్ణయం.. వైసీపీ వాళ్లకు సర్వీసులు బంద్.. వీళ్లని చూసి బుద్ధి తెచ్చుకోవాలి

ABN , First Publish Date - 2023-09-23T19:38:56+05:30 IST

ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. అభివృద్ధి పనుల కన్నా కక్ష్య సాధింపు చర్యలపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నట్టు కనిపిస్తోంది. అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేసి.. దిగజారుడు మాటలు...

Chandrababu Arrest: జెనెక్స్ సంచలన నిర్ణయం.. వైసీపీ వాళ్లకు సర్వీసులు బంద్.. వీళ్లని చూసి బుద్ధి తెచ్చుకోవాలి

ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. అభివృద్ధి పనుల కన్నా కక్ష్య సాధింపు చర్యలపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నట్టు కనిపిస్తోంది. అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేసి.. దిగజారుడు మాటలు, పనులతో ప్రతిపక్ష నేతలపై ప్రతీకారం తీర్చుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఇప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అక్రమ అరెస్ట్ వెనుక కూడా జగన్ హస్తమే ఉందంటూ ఏపీ వ్యాప్తంగా చెప్పుకుంటున్నారు. అక్రమాస్తుల కేసులో తాను ఇంతకుముందు 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన జగన్.. తన ప్రతిపక్ష నేతలూ అలాంటి శిక్షే అనుభవించాలన్న ఉద్దేశంతో పక్కా ప్లాన్‌తో చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేయించారంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అరెస్ట్‌పై టీడీపీ శ్రేణులు వినూత్న పద్ధతిలో తమ నిరసనలు తెలుపుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే.. ఆటోమొబైల్ రంగంలో కార్ కేర్ సేవలు అందిస్తున్న జెనెక్స్ సంస్థ సైతం చంద్రబాబు అక్రమ్ అరెస్ట్‌కి వ్యతిరేకంగా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న జెనెక్స్ షోరూమ్‌లో.. వైసీపీకి చెందిన నేతలు, మద్దతుదారులు, కార్యకర్తలకు ఎలాంటి సర్వీసులు అందించకూడదని నిర్ణయించింది. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్‌ చేసినందుకు నిరసనగా.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని ఆ జెనెక్స్ సంస్థ తెలిపింది. దీనిపై జెనెక్స్ ఎండీ అమర్ మాట్లాడుతూ.. తాము జెనెక్స్ సంస్థను 2005లో స్థాపించామని, చంద్రబాబు వేసిన రూట్స్ వల్ల మాధాపూర్‌తో పాటు హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాలు అప్పుడప్పుడే అభివృద్ధి చెందడం ప్రారంభం అయ్యాయని అన్నారు. ఇప్పుడు ఈరోజు ఈ నగరం గానీ, తమ జెనెక్స్ సంస్థ ఈ స్థాయికి ఎదిగిందంటే.. దానికి చంద్రబాబే కారణమని చెప్పారు.


అప్పుడు చంద్రబాబు వేసిన బీజం, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరుకునేలా చేసిందని.. అమెరికాని తలదన్నే రీతిలో హైదరాబాద్ తయారైందని అమర్ పేర్కొన్నారు. ఈరోజు తనతో పాటు హైదరాబాద్ నగరంలో ఉన్న కోట్ల జనాభా చాలా సంతోషంగా జీవితం గడుపుతున్నామంటే.. ప్రత్యక్షంగా, పరోక్షంగా చంద్రబాబే కారణమన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు రాజమండ్రి జైల్లో ఉన్నారని తెలిసి తనకు చాలా బాధేసిందని.. వైసీపీ వాళ్లు కుట్రపన్ని ఆయన్ను జైల్లో పెట్టారని అన్నారు. అందుకే.. తనకు వీలైనంత వరకు చంద్రబాబు మద్దతు ఇవ్వాలని అనుకున్నానని, ఇందులో భాగంగానే వైసీపీ నేతలు, మద్దతుదారులు, అభిమానులకు సర్వీసులు ఆపేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. తనకు నష్టం వచ్చినా పర్లేదని, వైసీపీ వాళ్లు ఎవరొచ్చినా మొహమాటం లేకుండా సేల్స్ లేదా సర్వీసులు ఇవ్వమని చెప్పేస్తానని అన్నారు.

తాను తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని.. ఇది తన వ్యాపార నిర్ణయమని.. చంద్రబాబుకి మద్దతుగా ఈ డెసిషన్ తీసుకున్నానని జెనెక్స్ ఎంపీ అమర్ ఖరాఖండీగా తేల్చి చెప్పారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయంపై నెట్టింట్లో హర్షం వ్యక్తం అవుతోంది. జెనెక్స్ ఎండీ నిజంగా మంచి నిర్ణయం తీసుకున్నారని.. మిగతా వాళ్లు కూడా ఈ సంస్థని చూసి బుద్ధి తెచ్చుకోవాలని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-09-23T19:38:56+05:30 IST