Pawan Vs Jagan : సీఎం వైఎస్ జగన్‌కు సవాల్ చేసి.. సలహా ఇచ్చిన పవన్
ABN , First Publish Date - 2023-10-01T19:20:06+05:30 IST
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం (Jagan Govt) తెచ్చిన వలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలు.. సర్కార్‌లో వణుకు పుట్టించిన సంగతి తెలిసిందే. తాజాగా..
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం (Jagan Govt) తెచ్చిన వలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలు.. సర్కార్‌లో వణుకు పుట్టించిన సంగతి తెలిసిందే. తాజాగా.. అవనిగడ్డ వేదికగా వారాహి యాత్రలో భాగంగా మరోసారి పవన్ మాట్లాడారు. ఈ సందర్భంగా.. తనపై కేసులు పెడతామన్న వైసీపీ నేతలు, సీఎం వైఎస్ జగన్ రెడ్డికి (YS Jagan Reddy) సేనాని సవాల్ విసిరారు. ‘ జగన్‌కే చెబుతున్నా.. సంతోషంగా కేసు పెట్టుకో.. నాకు ఓకే. తప్పు జరుగుతున్నప్పుడు మేం మాట్లాడకుండా ఉండలేం. మళ్లీ చెబుతున్నా మేం భగత్ సింగ్ వారసులం. దేశాన్ని ప్రేమించే దేశభక్తులు రాజకీయం చేస్తే ఎలా ఉటుందో నీకు చేసి చూపిస్తాం జగన్. వైఎస్ జగన్‌ను దేవుడని మొక్కితే.. దెయ్యమై రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నారు’ అని సీఎంపై పవన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
అదే మందు..!
‘స్వయంగా నేను గెలవకున్నా.. నిలబడి పోరాడుతున్నానంటే నా నిబద్జత ఏంటో అర్థం చేసుకోండి. జనసేన-టీడీపీ కూటమికి మద్దతివ్వండి. మళ్లీ జగన్‌కు ఓటేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. సమస్యలపై మాట్లాడుతోంటే నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు. అవనిగడ్డ ప్రాంతంలో ఇసుక దోపిడీ వల్ల 76 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీ భవిష్యత్ కోసం ఈసారి సరైన వ్యక్తులకు అండగా ఉండాలి. ఈసారి తేడా జరిగితే 20 ఏళ్లు వెనక్కు వెళ్లిపోతారు. నేనేం వెనక్కు వెళ్లను.. ఇక్కడే ఉంటాను. జగన్ ఏం ఊరికే ఓట్లు వేయలేదు.. పదేళ్లు రోడ్ల మీద తిరిగారు. ఇప్పుడంటే పరదాలు కట్టుకుని తిరుగుతున్నారు కానీ.. గతంలో రోడ్ల మీదే తిరిగారు. 2019లో దేవుడనుకుని ఓట్లేశారు.. ఇప్పుడు దెయ్యమై పట్టుకున్నాడు. దేవుడు లేని ఊళ్లో.. మంచం కొయ్యే పోతురాజు అన్నట్టుగా ఉంది వైసీపీ ఎమ్మెల్యేల తీరు ఉంది. ఏపీని పట్టి పీడిస్తోన్న వైసీపీ మహమ్మారికి మందే జనసేన-టీడీపీ వ్యాక్సిన్’ అని పవన్ చెప్పుకొచ్చారు.
జగన్‌కు సలహా..!
‘వైసీపీ గుర్తు ఫ్యాన్.. ఎవ్వరికీ అందదు.. ఫ్యాన్ వేస్తే కరెంట్ బిల్లులు పేలతాయి. ఏపీ అభివృద్ధిని.. నిరుద్యోగులను వైసీపీ ఫ్యానుకు ఉరేశారు. దాహం తీర్చే గ్లాసు.. ఓ చోటు నుంచి మరో చోటుకు చేర్చే సైకిల్ కలిశాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన-టీడీపీ కలిసే వెళ్తాయి. బీజేపీతో కలిసి వెళ్లొచ్చు.. కానీ ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి ఉండదు. ఈ ఎన్నికల్లో మధ్యే మార్గంగా ఉండను.. ఓ సైడ్ తీసుకుంటాను. రామ-రావణ యుద్దం జరుగుతున్నప్పుడు రామాయ స్వస్తి.. రావణయా స్వస్తి అనే రకం కాదు. నేను ప్రజల కోసం ఓ సైడ్ తీసుకున్నాను. నన్ను బీసీలు.. ఎస్సీలతో తిట్టిస్తారు. నా చిన్నప్పుడు కూడా నేను ఇలాంటి పనులు చేయను. జగన్ బుద్ధిలేని మనిషిగా, పరిపక్వత లేకుండా వ్యవహరిస్తున్నారు. జగన్‌కు ఎవరు సలహాలిస్తున్నారో.. కాస్త మార్చుకోండి. నన్ను విమర్శించే వారి కులం చూడను.. మనుషుల్నే చూస్తాను’ అని జగన్‌కు సలహా ఇచ్చారు పవన్.
బెదిరింపులు వచ్చాయి..!
‘వైసీపీ పతనం మొదలైంది. కురుక్షేత్రం అంటే కురుక్షేత్రమే. ఈ కురుక్షేత్రంలో జగన్ ఓడిపోవడం ఖాయం.. మేం అధికారంలోకి రావడం ఖాయం. అధికారం కోసం నేను అర్రులు చాచలేదు. రేపు ఇచ్చిన హామీలు నెరవేరకపోతే నేను మీ పక్షాన నిలబడతాను. మేం (టీడీపీ-జనసేన) అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల రుణం తీర్చుకుంటాం. మీ భవిష్యత్ కోసం అనుక్షణం ఆలోచిస్తాను. చాలా బెదిరింపులు వచ్చాయి.. వాటిని నేను లెక్కచేయను. కదన రంగం నుంచి పారిపొమ్మని బెదిరింపులు వచ్చాయి. చాలా ప్రత్యేక పరిస్థితుల్లో ఓటు చీలకూడదు. మనకంటే.. మన పార్టీ కంటే మన నేల ముఖ్యం’ అని పవన్ చెప్పుకొచ్చారు. అయితే పవన్‌ను బెదిరించినది ఎవరు అనే విషయం మాత్రం బయటపెట్టలేదు.
నేను ఎప్పుడూ చెప్పలేదు..!
‘ఏపీలో పరిస్థితులు ఇలా ఉన్నా.. వైఎస్ జగన్ ఇబ్బంది పెడుతున్నారని ఏనాడు ప్రధాని మోదీతో నేను చెప్పలేదు. నా నేల కోసం నేను పోరాడుతాను.. అంతేకానీ.. దేహీ అని ఎవర్ని అడగను. మెగా డీఎస్సీ పక్షాన నిలబడతాను. 2024 లో వచ్చేది జనసేన, టీడిపీ సంకీర్ణ ప్రభుత్వమే. ఓట్లు కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు. ప్యాకేజీలు తీసుకున్నావని మాట్లాడే సన్నాసులకి ఏం చెప్పగలం. ఒకప్పుడు మాదాపుర్‌లో పది ఎకరాలు కొనుక్కొని ఉంటే ఇప్పటికి వేలకోట్లు ఉండేవి. నాకు డబ్బు మీద వ్యామోహం లేదు.. లోకం పచ్చగా కనబడినట్డు కనబడుతుంది. రెండు దశాబ్దాలు రాజకీయాల్లో పనిచేస్తాను.. ఈ ప్రాసెస్‌లో సీఎం పదవి వచ్చినా స్వీకరిస్తాను. అలా అని పదవుల కోసం వెంపర్లాడను. 3 లక్షల పైచిలుకు కుటుంబాలు ఏపీ నుంచి వలస వెళ్లిపోయాయి. 3.88 లక్షల విద్యార్దులు డ్రాపువుట్ అయ్యారు. 5 నుంచి 15 ఏళ్లలోపు 62,754వేలమంది చిన్నారులు చనిపోయారు. ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని పవన్ డిమాండ్ చేశారు. సేనాని కామెంట్స్‌పై వైసీపీ నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో చూడాలి మరి.