Chikoti Arrest : అరెస్టయిన చికోటి ప్రవీణ్ థాయ్‌లాండ్‌లో గ్యాంబ్లింగ్‌ కోసం ఏ రేంజ్‌లో ప్లాన్ చేశాడో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-05-01T17:27:54+05:30 IST

క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ (Chikoti Praveen).. ఈ పేరు మరోసారి తెలుగు రాష్ట్రాలతో (Telugu States) ఇతర దేశాల్లోనూ మార్మోగుతోంది. థాయిలాండ్‌లో భారీ..

Chikoti Arrest : అరెస్టయిన చికోటి ప్రవీణ్ థాయ్‌లాండ్‌లో గ్యాంబ్లింగ్‌ కోసం ఏ రేంజ్‌లో ప్లాన్ చేశాడో తెలిస్తే..

క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ (Chikoti Praveen).. ఈ పేరు మరోసారి తెలుగు రాష్ట్రాలతో (Telugu States) ఇతర దేశాల్లోనూ మార్మోగుతోంది. థాయిలాండ్‌లో భారీ గ్యాంబ్లింగ్‌ రాకెట్‌లో చికోటి ప్రవీణ్‌‌ను పటాయ పోలీసులు (Pattaya Police) అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పటాయ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా చికోటీ అండ్ గ్యాంగ్‌ను పట్టుకున్నారు. పారిపోయేందుకు ప్రయత్నించగా భారీగా వచ్చిన పోలీసులు వారిని రౌండప్ చేసి పట్టుకున్నారు. అయితే ప్రవీణ్ గురించే అటు మీడియాలో (Media).. ఇటు సోషల్ మీడియాలో (Social Media) తెగ చర్చించుకుంటున్నారు. చికోటి థాయిలాండ్‌కు ఎప్పుడు వెళ్లారు..? ఆయనతో పాటు ఎవరెవరున్నారు..? ఎన్నికోట్లు డబ్బులు పట్టుబడ్డాయి..? ఈ గ్యాంబ్లింగ్ మొత్తమ్మీద కీలకంగా వ్యవహరించిన మహిళ ఎవరు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ప్రత్యేక కథనం..

Chikoti.jpg

బాబోయ్.. ఈ ప్లాన్ చూశారో..!

థాయిలాండ్‌లో జూదం ఆడేందుకు హైదరాబాద్‌తో (Hyderabad) పాటు భారతదేశంలోని (India) ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు వెళ్లారు. ఏప్రిల్- 27 నుంచి మే-01 వరకు హోటల్‌లో అనేక మంది భారతీయులు గదులు బుక్ చేసుకున్నారు. సోమవారం ఉదయం భారత్‌కు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో సంపావో అనే కాన్ఫరెన్స్ రూమ్‌ను జూదానికి ఉపయోగిస్తున్నారని డిటెక్టివ్‌ల నుంచి పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు (Task Force) అర్థరాత్రి హోటల్‌పై దాడి చేసి గ్యాంగ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మెరుపు దాడిలో మొత్తం 80 మంది భారతీయులను థాయ్ పోలీసులు అరెస్టు చేశారు. థాయిలాండ్‌లో భారీ గ్యాంబ్లింగ్ రాకెట్‌లో తెలంగాణకు చెందిన చికోటి ప్రవీణ్, మాధవరెడ్డి, మెదక్ డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి సహా 80 మంది భారతీయ జూదగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ మొత్మమ్మీద చికోటి ప్రవీణ్ థాయిలాండ్ మహిళలతో కలిసి పటాయలో జూదం డెన్‌ను ఏర్పాటు చేసినట్లు పెద్ద ఎత్తున ఆరోణలు వస్తున్నాయి. థాయ్‌లో గ్యాంబ్లింగ్ కోసం ఒక్కొక్కరి నుంచి లక్షల్లో చికోటి వసూలు చేసినట్లుగా తెలుస్తోంది.

Chikoti-2.jpg

ఎవరెవరు అరెస్ట్ అయ్యారు..!?

చికోటితోపాటు పటాయ పోలీసుల అదుపులో మాధవరెడ్డి, డిసీసీబి చైర్మన్ దేవేంధర్ రెడ్డి కూడా ఉన్నారు. టాస్క్ ఫోర్స్‌ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఈ ముఠా యత్నించగా వెంబడించి మరీ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Casino-F.jpg

ఈ గ్యాంబ్లింగ్ ముఠాలో ఏపీలోని కృష్ణా జిల్లాకు (Krishna District) చెందిన కొందరు ప్రముఖులు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే వారంతా గన్నవరం (Gannavaram) నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు (YSRCP Leaders) అన్నట్లు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. గన్నవరంకు చెందిన మొత్తం 16 మంది మూడ్రోజుల క్రితం పటాయ వెళ్లినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ 16 మంది ఎప్పుడూ పటాయ్‌ వెళ్లే గ్యాంగ్‌లో ఉండేవారేనని స్థానికులు చెబుతున్నారు. గుడివాడతో పాటు, మరికొన్ని ప్రాంతాలకు చెందిన వారు కూడా ఈ గ్యాంగ్‌లో ఉన్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. థాయిలాండ్‌లో గ్యాంబ్లింగ్ ఆడుతూ పట్టుబడిన వారిలో ఈ ఆటలో ఆరితేరిన కృష్ణా జిల్లా గన్నవరంకు చెందిన తిరుమలరావు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇతను ఒక ఆటకు 20 కోట్లు పెట్టి ఆడతాడని తెలుస్తోంది. ఇక కృష్ణా జిల్లాకు చెందిన బిల్డర్ కొప్పడ మధుసూదన్, మల్లికార్జున రావు, మధు, సుదర్శన్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖ రాజకేయనేతలు ఉన్నట్టు సమాచారం. జూదగాళ్ల నుంచి మొత్తం 100 కోట్ల రూపాయిలు పట్టుబడినట్లు సమాచారం.

Chikoti-1.jpg

ఏం జరుగుతుందో..?

బౌద్ధ దేశమైన థాయ్‌లాండ్‌లో జూదంను తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. చిన్నపాటి నేరాలకు పెద్ద పెద్ద శిక్షలు ఉంటాయి. అలాంటిది గ్యాంబ్లింగ్ అందులోనూ కోటాను కోట్లలో నడవడంతో చికోటితో పాటు పట్టుబడిన ఇండియన్స్‌కు ఎలాంటి శిక్షలు విధిస్తారనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. థాయ్‌లాండ్‌లో చట్టాలు కఠినంగా ఉంటాయని తెలియడంతో పట్టుబడిన గ్యాంబ్లింగ్ బ్యాచ్ కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు.. ఈ గ్యాంబ్లింగ్ వ్యవహారంలో సీతర్నన్ కేల్వేల్కర్ అనే మహిళ కీలకంగా వ్యవహరించింది. ప్రస్తుతం ఆమె కూడా పోలీసుల అదుపులోనే ఉంది. అరెస్టయిన వారిలో మొత్తం 14 మంది మహిళలు ఉన్నారు. ప్రస్తుతం చికోటి, సీతర్నన్‌ను ప్రత్యేక పోలీసుల బృందం లోతుగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. నిందితుల నుంచి భారీగా నగదు, గేమింగ్ చిప్స్‌ను పటాయ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోట్లల్లో నగదు, 20 కోట్ల రూపాయిలు విలువచేసే గేమింగ్ చిప్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కొక్క ఇండియన్ నుంచి గ్యాంబ్లింగ్ కోసం లక్షల్లో వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. గ్యాంబ్లింగ్‌లో పట్టుబడిన ఈ కేటుగాళ్లను థాయ్ ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే మరి.

Casino-Ladies.jpg******************************

ఇవి కూడా చదవండి..

******************************

Chikoti Praveen : థాయిలాండ్‌లో చికోటి ప్రవీణ్ అరెస్ట్.. 14 మంది మహిళలు కూడా..

******************************

Casino King Chikoti : థాయిలాండ్‌లో చికోటితో పట్టుబడిన వారిలో వైసీపీ నేతలు.. కీలకంగా వ్యవహరించిన మహిళ..!

******************************

New Secretariat : కొత్త సచివాలయంకు వెళ్లిన ఉద్యోగుల్లో గందరగోళం.. తొలిరోజు సీఎం కేసీఆర్ ఏం చేయబోతున్నారంటే..

******************************

Updated Date - 2023-05-01T17:36:28+05:30 IST