MLC Elections Counting Live Updates : అనురాధ గెలుపుపై సజ్జల ఇలా అన్నారేంటి.. ఇదేందయ్యా...!
ABN , First Publish Date - 2023-03-23T18:24:12+05:30 IST
ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల (MLA Quota MLC Elections) కౌంటింగ్ ప్రారంభమైంది. గంటలోపే ఫలితాలను వెల్లడిస్తారు. ఎన్నికల్లో వందశాతం ఓటింగ్ నమోదయింది.
11:27 pm : నాకేం అవసరం..!
క్రాస్ ఓటింగ్ చేశారని సోషల్ మీడియాలో (Social Media).. ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఈ విషయం కోడై కూయడంతో ఎట్టకేలకు తనపై వచ్చిన ఆరోపణలకు శ్రీదేవి వివరణ ఇచ్చుకున్నారు. ‘ నేను క్రాస్ ఓటింగ్ (Cross Voting) చేయలేదు. క్రాస్ ఓటింగ్ చేయాల్సిన అవసరమే నాకు లేదు. నాపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమే. పార్టీ ఇచ్చిన కోడ్ ప్రకారమే నేను ఓటు వేశాను. ఉదయమే నా కుమార్తెతో పాటు సీఎం జగన్ గారిని కలిశాను. సొంత అన్నలా చూసుకుంటానని నాతో జగన్ చెప్పారు. జగన్ గారి నుంచి నాకు స్పష్టమైన హామీ వచ్చింది. క్రాస్ ఓటింగ్ చేసిందెరో రెండ్రోజుల్లో నిజా నిజాలు బయటికొస్తాయి. మాకు కొన్ని విలువలు ఉన్నాయి. విలువలతో కూడిన రాజకీయాలకు కట్టుబడి ఉన్నాం. దళిత మహిళపై దుష్ప్రచారం చేయొద్దు. దళిత మహిళను కాబట్టే ఇలా చులకనగా చూస్తున్నారు. నేను అధిష్ఠానంపై అసంతృప్తిగా ఉంటే నియోజకవర్గానికి ఇంచార్జ్‌ని పెట్టినప్పుడే రాజీనామా చేయాలి. నేను సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాను. ఆ 22 మందిని స్క్రూటిని చేసి నిజాన్ని తేల్చండి. మళ్లీ చెబుతున్నాను.. నాకు క్రాస్ ఓటింగ్ చేయాల్సిన అవసరమే లేదు. ఇందులో నా పేరును దయచేసి లాగొద్దు’ అని శ్రీదేవి చెప్పుకొచ్చారు.
11: 00 pm : మేకపాటి నో రియాక్షన్!
క్రాస్ ఓటింగ్ ఆరోపణలపై ఇంతవరకూ స్పందించని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
వైసీపీ పెద్దలు ఫోన్ చేయగా స్విచాఫ్ వస్తున్నట్లు సమాచారం
ఫోన్ స్విచాఫ్ రావడంతో క్రాస్ ఓటింగ్ చేసుకుంటారనే దానిపై వైసీపీలో మరింత పెరిగిన అనుమానం
ఉదయగిరి నియోజకవర్గానికి పరిశీలకుడిగా ధనుంజయ్ రెడ్డిని నియమించడంతో అధిష్ఠానంపై గత కొన్నిరోజులుగా అసంతృప్తితో మేకపాటి
10:22 pm : ఏసుక్రీస్తు కన్నా జగనే ఎక్కువ..!
వైసీపీ తరపున గెలుపొందిన ఎమ్మెల్సీ అభ్యర్ధి జయమంగళ వెంకటరమణ
టీడీపీ ఎమ్మెల్సీ ఇస్తానని నాకు ఇవ్వలేదు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకరిద్దరు తప్పు చేసిన మిగిలిన వారు నాకు ఓట్ వేశారు
ఏసుక్రీస్తు దయవల్ల ఎన్నికలో విజయం సాధించాను
జగన్ మోహన్ రెడ్డి ఆ ఏసుక్రీస్తు కన్నా ఎక్కువ నాకు..: వెంకటరమణ
09 : 55 pm : అరెరే.. సజ్జల ఇలా అనేశారేంటి..?
చంద్రబాబు మా ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారు: సజ్జల
ప్రలోభాలకు గురిచేయడం చంద్రబాబుకు అలవాటే: సజ్జల
మా పార్టీ నుంచి టీడీపీకి ఓటేసిన వారిని గుర్తించాం: సజ్జల
సరైన సమయంలో చర్యలు తీసుకుంటాం: సజ్జల
మాకు సంఖ్యాబలం ఉందనే అభ్యర్థులను పోటీకి పెట్టాం
ఆనం, కోటంరెడ్డిని లెక్కలోకి తీసుకోలేదు: సజ్జల
ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉందని అనుకోవడం లేదు: సజ్జల
09 :40 pm : తాను తీసుకున్న గోతిలో తానే..!
ఎమ్మెల్సీగా గెలిచిన పంచుమర్తి అనురాధకు అభినందనలు: సీపీఐ రామకృష్ణ
జగన్‌రెడ్డి తాను తీసుకున్న గోతిలో తానే పడ్డారు: సీపీఐ రామకృష్ణ
ఎమ్మెల్యేలు విజ్ఞత ప్రదర్శించారు: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
09 :35 pm : గర్వించ దగ్గ విజయం..
పంచుమర్తి అనురాధకు శుభాకాంక్షలు: ఎంపీ కేశినేని నాని
అనురాధ ఎమ్మెల్సీగా ఎన్నికవడం గర్వించదగ్గ విషయం
టీడీపీ బీసీల పార్టీ అని మరోసారి నిరూపించారు: కేశినేని నాని
09 :30 pm : బడుగు బలహీనవర్గాల విజయం..
పంచుమర్తి అనురాధ పోరాటస్ఫూర్తి అభినందనీయం: యనమల రామకృష్ణుడు
అనురాధ విజయం.. బడుగు బలహీనవర్గాల విజయం: యనమల
09 :25 pm : ఓటమిపై విశ్లేషిస్తాం!
ఓటమిపై విశ్లేషిస్తాం: మంత్రి కొట్టు సత్యనారాయణ
మాక్ పోలింగ్‌లో కూడా తప్పిదాలు జరిగాయి: మంత్రి కొట్టు
దీనిపై పార్టీ లోతుగా విశ్లేషణ చేస్తుంది: కొట్టు సత్యనారాయణ
సరైన సమయంలో చర్యలు ఉంటాయి: కొట్టు సత్యనారాయణ
09 :15 pm : వైసీపీలో చర్చ వీరిపైనే..!
క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన వైసీపీ ఎమ్మెల్యేలు వీరేనా?
ఆనం రామనారాయణరెడ్డి?, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి?,
మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి?, ఉండవల్లి శ్రీదేవి?
వీరే క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు వైసీపీలో చర్చ
09 :00 pm : నందమూరి అభినందనలు..
పంచుమర్తి అనురాధకు అభినందనలు: నందమూరి రామకృష్ణ
టీడీపీ ఆడపడుచు అనురాధకు శుభాకాంక్షలు: నందమూరి రామకృష్ణ
పంచుమర్తి అనురాధ విజయానికి కారకులైన..
ప్రతి ఒక్కరికీ అభినందనలు: నందమూరి రామకృష్ణ
08:40 pm : వైసీపీ రియాక్షన్ ఇదీ..
సీక్రెట్ ఓటింగ్‌లో విప్ ఉండదు : వైసీపీ
క్రాస్ ఓటింగ్‌పై పార్టీలో చర్చిస్తాం : వైసీపీ
ఎవరు తప్పు చేశారో తేలుస్తాం : వైసీపీ
క్రాస్ ఓటింగ్‌కు ఎవరు పాల్పడ్డారో తేలితే కఠిన చర్యలు ఉంటాయ్ : వైసీపీ
ఫలితాలు వెలువడినప్పట్నుంచి ఇద్దరిపై అనుమానం వ్యక్తం చేస్తున్న వైసీపీ
తాము అలా చేయలేదంటూ సోషల్ మీడియా, మీడియా వేదికగా ప్రకటనలు
08:35 pm : ఇది ప్రజల్లో వచ్చిన మార్పు..
ఇది ప్రజల్లో వచ్చిన మార్పుకుని నిదర్శనం.. : గండి బాబ్జి మాజీ ఎమ్మెల్యే
పంచ మూర్తి అనురాధ గెలుపుకు కృషి చేసిన వారికి అందరికీ ధన్యవాదాలు : మాజీ ఎమ్మెల్యే పళ్ళ శ్రీనివాసరావు
అధికారులు నియంత్రక్క పోకడలతో పోకూడదు అనడానికి దిగి నిదర్శనం : పళ్ళ
జగన్‌ని అంతలాగా పాలన చేశారు కాబట్టి ప్రజలు : పళ్ళ
08:32 pm : తెలుగుదేశం పడలేసిన కెరటం
విశాఖ టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, తెలుగు తమ్ముళ్లు
‘తెలుగుదేశం పడలేసిన కెరటం టీడీపీకి 23 సీట్లు వస్తే.. జగన్ హేళన చేశారు ..అదే 23 తో మూడో నెల 2023లో, దేవుడు తిరిగి రాసాడు.. ఇప్పటికైనా జగన్ ప్రజలేం కోరుకుంటున్నారు జగన్ అది చేయాలని కోరుతున్నాను. సెమీఫైనల్స్ లో ఓడిపోయాక ఫైనల్స్‌లో ఇంకా పోటీ ఉండదు. వై నాట్ 175 అన్నల వై నాట్ సెవెన్‌కి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అయిపోయింది దిగిపోవాలి ప్రజలు అంటున్నారు. వైసిపి పార్టీకి కౌంట్ డౌన్ అయింది.. పతనానికి ఆరంభం ప్రారంభమైంది. ఎక్కడ సౌండ్ లేకుండా రౌండ్ వేసి అనురాధాని గెలిపించారు. తెలుగుదేశం పార్టీ ప్రభంజనం ఎవరు ఆపలేరు’ అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.
08:30 pm : జగన్ అహంకారానికి చెంప పెట్టు..!
జగన్ అహంకారానికి ఈ ఫలితాలు చెంప పెట్టు : గద్దె అనురాధ
వైసిపి ఎమ్మెల్యే లే జగన్ ను నమ్మే పరిస్థితి లేదు..
దాష్టికాలు, దాడులు, దుర్మార్గంతో జగన్ పాలన..
ఎప్పుడు పోతాడా అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు..
ఈ ఫలితాలు సార్వత్రిక ఎన్నికలలో టిడిపి విజయానికి నాంది..
వైసిపి నేతలు మేకపోతు గాంభీర్యంతో ఉన్నారు.
ఎక్కడకి వెళ్లినా జగన్ పాలనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
సమయం రాగానే జగన్‌ను సాగనంపడం ఖాయం : గద్దె అనురాధ
08:27 pm : మార్పునకు పునాది..
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన..
పంచుమర్తి అనురాధకు శుభాకాంక్షలు: టీడీపీ నేత కేశినేని చిన్ని
పంచుమర్తి అనురాధ విజయం.. బీసీల విజయం: కేశినేని చిన్ని
ఈ విజయం ఏపీ రాజకీయాల మార్పునకు పునాది: కేశినేని చిన్ని
08:25 pm : అనురాధను అభినందించారుగా..!
రీవెరిఫికేషన్‌లోనూ పంచుమర్తి అనురాధ విజయం
అనురాధ గెలుపును అధికారికంగా ప్రకటించిన రిటర్నింగ్ అధికారి
అనురాధను అభినందించిన వైసీపీ అభ్యర్థులు, ఏజెంట్లు
08:20 pm : ఊహించని ట్విస్ట్..
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని ట్విస్ట్
రెండో ప్రాధాన్యత ఓట్లతో జయ మంగళ వెంకటరణ విజయం
మొదట కోలా గురువులు గెలిచారని ప్రకటన
ఆ తర్వాత రెండో ప్రాధాన్యత ఓట్లతో జయ మంగళ విజయం.. అధికారికంగా ప్రకటించిన అధికారులు
ఇటీవలే టీడీపీలో తనకు అన్యాయం జరిగిందని వైసీపీ తీర్థం పుచ్చుకున్న వెంకటరమణ
ఆనందంలో మునిగి తేలుతున్న వెంకటరమణ అభిమానులు, అనుచరులు
08:10 pm : మళ్లీ అనురాధనే గెలుపు..
రీవెరిఫికేషన్లోనూ టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం
అనురాధ గెలుపును అధికారికంగా ప్రకటించిన రిటర్నింగ్ అధికారి
మరికాసేపట్లో అనురాధకు డిక్లరేషన్ ఫామ్ ఇవ్వనున్న రిటర్నింగ్ అధికారి
08:00 pm : రంగంలోకి దిగిన చంద్రబాబు..
టీడీపీ విజయంపై రీవెరిఫికేషన్ అడుగుతున్న వైసీపీ
రీవెరిఫికేషన్కు అభ్యంతరం చెప్పిన టీడీపీ ఏజెంట్లు
అందరికీ చూపించి బ్యాలెట్ పేపర్ను బాక్స్లో..
వేసిన తరువాత రీవెరిఫికేషన్ ఏంటని అభ్యంతరం
రీవెరిఫికేషన్ కావాలంటే అప్పుడే అడగాల్సిందన్న టీడీపీ
అవసరమైతే సీఈసీకు వెళ్లాలని సూచన
ఎన్నికల ప్రక్రియపై సీఈసీ దృష్టికి తీసుకెళ్లిన టీడీపీ
సీఈసీకి వెంటనే లేఖ రాసిన చంద్రబాబు
07:55pm : రీ కౌంటింగ్‌కు వైసీపీ పట్టు..
పంచుమర్తి అనురాధకు గెలుపుపై రీకౌంటింగ్కు డిమాండ్
రీకౌంటింగ్ కోసం వైసీపీ నేతలు, ఏజెంట్లు డిమాండ్
07:48pm : దేవుడు స్క్రిప్ట్ ఇదే జగన్..!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అనురాధ గెలుపుపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ఎమ్మెల్సీగా విజయం సాధించిన విజయవాడ మాజీ మేయర్, చేనేత ఆడపడుచు, మా తెలుగుదేశం కుటుంబసభ్యురాలు పంచుమర్తి అనూరాధ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మేము 23 సీట్లే గెలిచామని ఎద్దేవ చేశావు. అందులో నలుగురిని సంతలో పశువుల్లా కొన్నావు. చివరికి అదే 23వ తేదీన, అదే 23 ఓట్లతో నీ ఓటమి-మా గెలుపు. ఇది కదా దేవుడు స్క్రిప్ట్ అంటే జగన్ గారు!’ అని లోకేష్ ట్వీట్ చేశారు.
07:42 pm : మిన్నంటిన సంబురాలు..
అమరావతిలో చంద్రబాబు ఇంటి దగ్గర మిన్నంటిన సంబురాలు
టపాసులు పేల్చి స్వీట్లు పంచిన టీడీపీ శ్రేణులు
నిన్న పట్టభద్రులు, నేడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ విజయం
భవిష్యత్‌లో జరిగే ఎన్నికల్లోనూ తమదే విజయం అంటున్న నేతలు
చంద్రబాబు ఇంటి దగ్గరకు భారీగా చేరుకుంటున్న టీడీపీ నేతలు
కాసేపట్లో మీడియాతో మాట్లాడనున్న చంద్రబాబు
07:40 pm : గెలిచిన, ఓడిన అభ్యర్థులు వీరే..
ఎమ్మెల్సీ ఫలితాల్లో టీడీపీ-1, వైసీపీ-6 స్థానాల్లో విజయం
టీడీపీ తరఫున.. :-
1. 23 ఓట్లతో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అనురాధ విజయం
వైసీపీ తరఫున.. :-
1. సూర్యనారాయణ రాజు-22 ఓట్లతో గెలుపు
2. బొమ్మి ఇజ్రాయిల్-22 ఓట్లతో గెలుపు
3. పోతుల సునీత-22 ఓట్లతో గెలుపు
4. మర్రి రాజశేఖర్-22 ఓట్లతో గెలుపు
5. ఏసురత్నం- 22 ఓట్లతో గెలుపు
6. కోలా గురువులు-21 ఓట్లతో గెలుపు (రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుపు)
ఓడింది ఇతనే..
1. జయమంగళ వెంకటరమణ ఓటమి
ఇటీవలే టీడీపీని వీడి వైసీపీలో చేరిన వెంకటరమణ
టికెట్ కన్ఫామ్ చేసుకునే వైసీపీ కండువా కప్పుకున్న జయమంగళ
07:25 pm : అయ్యో మంగళా..!
రెండో ప్రాధాన్యత ఓట్లతో కోలా గురువులు విజయం
వైసీపీ అభ్యర్థి జయమంగళ వెంకటరమణ ఓటమి
ఇటీవలే టీడీపీని వీడి వైసీపీలో చేరిన వెంకటరమణ
07:22 pm : సంబరాల్లో టీడీపీ శ్రేణులు
ఏపీ, తెలంగాణలో టీడీపీ కార్యకర్తలు సంబరాలు
అమరావతి టీడీపీ కార్యాలయంలో టీడీపీ శ్రేణుల సంబరాలు
ఇటు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లోనూ కార్యకర్తలు సంబరాలు
07:20 pm : సెకండ్ రౌండ్ ఏం జరుగునో..!
ముగిసిన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు..
రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభం
కాసేపట్లో అధికారికంగా ఫలితాల ప్రకటన
07:13pm : విజయోత్సవంలో టీడీపీ
అమరావతిలోని చంద్రబాబు నివాసం దగ్గర కోలాహలం
చంద్రబాబు ఇంటికి చేరుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంపై సంబరాల్లో టీడీపీ శ్రేణులు
గెలిచిన అనురాధకు కేక్ తినిపించిన చంద్రబాబు
07:06pm : వైసీపీ తరఫున ఎవరెవరు గెలిచారు..?
ఎమ్మెల్సీ ఫలితాల్లో టీడీపీ-1, వైసీపీ-5 స్థానాల్లో విజయం
23 ఓట్లతో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అనురాధ విజయం
సూర్యనారాయణ రాజు-22, బొమ్మి ఇజ్రాయిల్-22 ఓట్లు
పోతుల సునీత-22, మర్రి రాజశేఖర్-22, ఏసురత్నం- 22 ఓట్లు
కోలా గురువులు-21, జయమంగళం-21 ఓట్లు
కొనసాగుతున్న 2వ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు
జయమంగళం, కోలా గురువులులో గెలిచేదెవరనే దానిపై ఉత్కంఠ
06:55 pm : విక్టరీ సింబల్ చూపించిన అనురాధ
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ జయకేతనం
బరిలో నిలిపిన ఒక్క అభ్యర్థిని గెలిపించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు..
06:50 pm : ఎవరెవరికి ఎన్ని ఓట్లు..!
06:46 pm : టీడీపీకి కలిసొచ్చింది ఇదే..
టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు కి కలిసొచ్చిన క్రాస్ ఓటింగ్
అనురాధ గెలుపుతో.. వైసీపీలో ఒక అభ్యర్థి ఓటమి ఖాయం
06:36pm : అనురాధకు ఓటేసిన ఆ ఇద్దరు ఎవరు..?
19 మంది ఎమ్మెల్యేలే చేతిలో ఉన్నప్పటికీ 23 ఓట్లతో అనూహ్యంగా టీడీపీ అభ్యర్థి గెలుపు..
కోటంరెడ్డి, ఆనం కాకుండా అనురాధకు ఓటేసిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు
ఊహించని షాక్‌తో అనురాధకు ఓటేసిన ఎమ్మెల్యేలు ఎవరనే ఆరా తీసే పనిలో వైసీపీ అధిష్టానం..!
06:34 pm : ఊహించని ఫలితం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని ఫలితం
అనుకున్నట్లే ఒక్క సీటును గెలుచుకున్న టీడీపీ
టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపు
అనురాధకు ఓటేసిన ఆ ఇద్దరు ఎవరు..?
06 :26 pm : అనురాధ గెలుపు..
వైసీపీకి దిమ్మతిరిగే షాక్
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా పంచుమర్తి అనురాధ విజయం
23 ఓట్లతో పంచుమర్తి అనురాధ గెలుపు
వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగినట్లు అనుమానం
06 :20pm : వందకు వంద శాతం..
కొనసాగుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
175కు 175 ఓట్లు చెల్లినట్లుగా రిటర్నింగ్ అధికారి ప్రకటన
06:00 PM : ప్రారంభమైన కౌంటింగ్.. వైసీపీలో మొదలైన టెన్షన్..
ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల (MLA Quota MLC Elections) కౌంటింగ్ ప్రారంభమైంది. గంటలోపే ఫలితాలను వెల్లడిస్తారు. ఎన్నికల్లో వందశాతం ఓటింగ్ నమోదయింది. ఒక్కో అభ్యర్థి విజయానికి 22 ఓట్లు కావాలి. మొదటి ప్రాధాన్యత ఓట్లు ముందుగా లెక్కిస్తున్నారు. అవసరమైతే రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. అయితే వైసీపీ (YCP)కి క్రాస్ ఓటింగ్ టెన్షన్ మొదలైంది. ఏడు స్థానాల్లోనూ గెలుస్తామని వైసీపీ నేతలు ధీమాగా ఉన్నారు. మరోవైపు తిరుగుబాటు అభ్యర్థుల ఓట్లు కీలకం కానున్నాయి. అభ్యర్థి గెలవాలంటే 22 మంది ఎమ్మెల్యేలు ఓటేయాలి. వైసీపీ సొంత బలం 151 మాత్రమే. టీడీపీ (TDP) నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతిస్తుండడంతో దాని బలం 155కు చేరింది. అయితే వైసీపీకి చెందిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotamreddy Sridhar Reddy), వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి (Anam Ramanarayana Reddy) అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారిని వైసీపీ ఇప్పటికే నియోజకవర్గ ఇన్‌చార్జులుగా తొలగించి వేరేవారిని నియమించింది. ముఖ్యంగా కోటంరెడ్డిని కొద్దిరోజుల కింద నిండు సభలో మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు నానా బూతులు తిట్టారు. సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్ వేటు కూడా వేశారు. వీరిద్దరూ అంతరాత్మ ప్రబోధానుసారం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేస్తామని ఇప్పటికే ప్రకటించారు. అదే జరిగితే వైసీపీ బలం 153కి పడిపోతుంది. టీడీపీ అభ్యర్థికి అధికారికంగా 19 ఓట్లు ఉన్నాయి. ఆనం, కోటంరెడ్డి ఓటేస్తే టీడీపీ బలం 21కి పెరుగుతుంది. అప్పుడు వైసీపీ, టీడీపీ అభ్యర్థులకు సమాన ఓట్లు లభిస్తాయి. అప్పుడు రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది. వైసీపీకే ఎక్కువ ప్రాధాన్య ఓట్లు ఉంటాయి కాబట్టి ఆ పార్టీ అభ్యర్థి గెలవడం తేలికే. కానీ గెలుపు చావుతప్పి కన్ను లొట్టపోయినట్లుగా దక్కుతుంది.