Kavitha ED Enquiry : విచారణకు వెళ్లే ముందు ఈడీకి కవిత సంచలన లేఖ.. ఇందులో లాజిక్ ఏమిటంటే..?

ABN , First Publish Date - 2023-03-21T12:32:19+05:30 IST

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi Liquor Scam Case) ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) మూడోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు..

Kavitha ED Enquiry : విచారణకు వెళ్లే ముందు ఈడీకి కవిత సంచలన లేఖ.. ఇందులో లాజిక్ ఏమిటంటే..?

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi Liquor Scam Case) ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) మూడోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు. సరిగ్గా 11.15 గంటలకు ఢిల్లీలోని సీఎం కేసీఆర్ నివాసం నుంచి బయటికొచ్చిన కవిత 11.30 గంటలకు ఈడీ ఆఫీసులోకి ఎంటరయ్యారు. అంతకుముందు ఈడీ దర్యాప్తు అధికారి జోగేంద్రకు కవిత సంచలన లేఖ రాశారు. ఈ లేఖలో పలు కీలక విషయాలను ఆమె ప్రస్తావించారు. కవిత ఫోన్లు (Kavitha Mobiles) ధ్వంసం చేశారని ఈడీ (ED) అభియోగం మోపిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఈడీ ఆరోపణలను తీవ్రంగా తప్పబట్టారు.

కవిత చెప్పిన లాజిక్ ఇదీ..!

‘నేను విచారణకు సహకరిస్తున్నాను. ఈడీ దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా నేను గతంలో వాడిన ఫోన్లను సమర్పిస్తున్నాను. ఒక మహిళ ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడం గోప్యత హక్కుకు భంగం కలగదా.. ?. దుర్బుద్ధితో వ్యవహరిస్తున్న దర్యాప్తు సంస్థ నేను ధ్వంసం చేశానని పేర్కొంది. నాకు సమన్లు కూడా ఇవ్వకుండానే.. కనీసం అడగకుండానే ఏ పరిస్థితుల్లో దర్యాప్తు సంస్థ ఈ ఆరోపణలు చేసింది?. నన్ను తొలిసారిగా మార్చి నెలలో విచారణ కోసం ఈడీ పిలిచింది. కానీ గత ఏడాది నవంబరులోనే ఫోన్లు ధ్వంసం చేశానని ఈడి ఆరోపించడం అంటే దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడమే. తప్పుడు ఆరోపణను ఉద్దేశపూర్వకంగా లీకేజీ ఇవ్వడం వల్ల నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను ప్రజల్లో నిందిస్తున్నారు. తద్వారా నా ప్రతిష్టకు తీవ్ర భంగం కలగడమే కాకుండా నా పరువును మా పార్టీ ప్రతిష్టను ప్రజల్లో తగ్గించే ప్రయత్నం జరిగింది. రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఈడీ వంటి దర్యాప్తు సంస్థ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్న విధిని తొక్కిపెట్టి వ్యవహరించడం దురదృష్టకరం. అందుకే నా పాత ఫోన్లన్నీ ఈడీ అధికారికులకే ఇచ్చేస్తున్నాను’ అని లేఖలో కవిత పేర్కొన్నారు. మొత్తానికి చూస్తే.. ఫోన్లను ధ్వంసం చేయలేదన్న విషయాన్ని ఇలా తన పాత ఫోన్లన్నీ మీడియా ముందే చూపించడంతో పాటు.. ఈడీకి ఇచ్చి కవిత నిరూపించారు. అంతేకాదు.. మార్చిలో విచారణకు పిలవడం.. నవంబర్‌లోనే ఫోన్లను ధ్వంసం చేశారని చెప్పడమేంటని గట్టి లాజిక్‌తోనే కవిత ఈడీని కొట్టారని నిపుణులు చెబుతున్నారు.

Untitled-11.jpg

అనంతరం విచారణకు హాజరయ్యే ముందు ఢిల్లీలోని కేసీఆర్ నివాసం దగ్గర ఒకసారి.. ఈడీ ఆఫీసు ముందు మరోసారి కవిత తన ఫోన్లను (Kavitha Mobile Phones) మీడియాకు చూపించారు. సోమవారం జరిగిన విచారణలో మొబైల్స్ తీసుకురావాలని ఈడీ అధికారులు ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో ఇవాళ తన వెంట కవిత ఆ ఫోన్లు తీసుకెళ్లారని తెలియవచ్చింది. ఈ ఫోన్లన్నీ ఈడీ ఆఫీసర్లకు కవిత ఇవ్వడంతో వారు స్వాధీనం చేసుకున్నారు.

Kavitha-Mobiles-IMEI-Number.jpg

Kavitha-Letter-1.jpg

Kavitha-Letter-2.jpg

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Kavitha ED Enquiry : ఈడీ విచారణకు వెళ్తూ పాత ఫోన్లు చూపించిన కవిత.. బీఆర్ఎస్ శ్రేణుల్లో పెరిగిపోయిన టెన్షన్..

******************************

MLC Kavitha ED Enquiry : విచారణకు వెళ్లే ముందు కవిత కీలక సమావేశం.. ఈడీ ఆఫీసు చుట్టూ భారీగా మోహరించిన పోలీసులు.. కీలక పరిణామాలుంటాయా..!?


******************************

Updated Date - 2023-03-21T13:06:22+05:30 IST