AP Politics : సాయిరెడ్డి- సుబ్బారెడ్డి మధ్య అంతర్యుద్ధం.. తాడేపల్లి ప్యాలెస్‌కు గొడవ..!?
ABN , First Publish Date - 2023-09-25T21:11:55+05:30 IST
అవును.. మీరు వింటున్నది నిజమే వైసీపీ సీనియర్లు విజయసాయిరెడ్డి (MP Vijayasai Reddy).. వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy)మధ్య ఆధిపత్యపోరు రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ అంతర్యుద్ధంతో..
అవును.. మీరు వింటున్నది నిజమే వైసీపీ సీనియర్లు విజయసాయిరెడ్డి (MP Vijayasai Reddy).. వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy)మధ్య ఆధిపత్యపోరు రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ అంతర్యుద్ధంతో వైసీపీ క్యాడర్ నలిగిపోతోంది. ఇద్దరూ సీఎం వైఎస్ జగన్ రెడ్డికి (YS Jagan Reddy) కావాల్సిన వాళ్లు కావడంతో ఎవరివైపు సపోర్టు చేయాలని నేతలు, కార్యకర్తలు డైలమాలో పడిన పరిస్థితట. అయితే ఈ ఇద్దరికి వ్యక్తిగతంగా కానీ.. పార్టీ పరంగా కానీ ఏమైనా గొడవలున్నాయా..? అంటే అలాంటివేమీ లేవు. ఉన్నదల్లా నిషేదిత జాబితా (22 ఏ) నుంచి బయటపడిన దసపల్లా భూముల (Dasapalla Lands) విషయంలోనే గొడవలు. ఇక్కడ మొదలైన ఈ గొడవ చినికి చినికి గాలివానలా మారి తాడేపల్లి ప్యాలెస్‌కు చేరింది. దీంతో పరిస్థితి కాస్త నువ్వా.. నేనా..? అన్నట్లుగా మారిపోయింది.
ఇంతకీ ఏం జరిగింది..?
వైసీపీ చెబుతున్నట్లు మూడు రాజధానుల్లో ఒకటైన విశాఖపట్నం నగరం నడిబొడ్డున దసపల్లా భూములున్నాయి. ఈ భూముల వ్యవహారంలో చాలారోజులుగా గొడవలు జరుగుతున్నాయి. అయితే.. ఈ భూములు రాణి కమలాదేవికి చెందినవని.. ఆమె వారసులు కొనుగోలు చేశామని చెబుతున్న ఓ వర్గానికి ఎంపీ విజయసాయిరెడ్డి అండదండలు ఉన్నాయి. అయితే.. రాణి సాహిబా ఆఫ్ వాద్వాన్ వారసుల పేరుతో బోర్డులు వెలిశాయి. ఈ వర్గానికి సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి మద్దతుగా నిలిచారు. దీంతో సాయిరెడ్డి వర్సెస్ సుబ్బారెడ్డిగా పరిస్థితులు మారిపోయి.. ‘సై’ అనుకునేంత పరిస్థితికి వెళ్లాయి. ఈ వ్యవహారం ఆఖరికి తాడేపల్లి ప్యాలెస్‌కు చేరింది. 15 ఎకరాలున్న ఈ వివాదాస్పద భూమి విలువ సుమారు రూ. 2వేల కోట్లు ఉంటుందని తెలియవచ్చింది. మరోవైపు.. కమలాదేవి వారసులు తమకూ హక్కు ఉందని ఓ వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే అవన్నీ నకిలీ పత్రాలని కలెక్టర్‌కు కమలాదేవి ఫిర్యాదు అందినది. ఈ వ్యవహారాన్ని నిశితంగా పరిశీలించగా కమలాదేవి సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు తేలింది. ఓ కీలక వ్యక్తే ఇలా చేశారని నిర్ధారించారు. ఈ క్రమంలో ఆ సంతకం చేసిన వ్యక్తిపై తగు చర్యలు తీసుకోవాలని.. తమ స్థలాన్ని అప్పగిచాలని వైవీ వర్గానికి చెందిన వ్యక్తి సైతం అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఆ సంతకం ఫోర్జరీ చేసింది విజయసాయిరెడ్డి అనుచరుడే. అరెస్ట్ చేయాలని వైవీ.. చేయొద్దని ఎంపీ సాయిరెడ్డి ఇద్దరూ సీపీ త్రివిక్రమవర్మపై తెగ ఒత్తిడి చేశారు. ఆఖరికి సీపీ బదిలీ దాకా వ్యవహారం పోయిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఆఖరికి తాడేపల్లికి పంచాయితీ చేరింది.
నాకు అక్కర్లేదు..!
గొడవ పెద్దది కావడం, సీఎం వైఎస్ జగన్ (CM YS Jagan) దృష్టికి రావడంతో తాడేపల్లికి రావాలని ఆదేశించారు. ఇద్దర్నీ కూర్చొబెట్టి పంచాయితీ చేసినప్పటికీ వర్కవుట్ అవ్వలేదట. ఈ క్రమంలో ‘న్యాయం వైపు నిలబడి తప్పు చేసిన వారిని శిక్షించమనడం తప్పా..?. తప్పు జరిగిందని తేలింది కాబట్టే అరెస్ట్ చేయమని ఆదేశించాను. ఇంకా తగ్గి ఉండాలంటే ఉండను.. అసలు నాకు ఈ ఇంచార్జ్ పదవే నాకొద్దు..’ అని సమావేశం మధ్యలో నుంచి వచ్చేశారట. బాబాయ్.. ఆగండి ఏంటిది అని వైఎస్ జగన్ వారించినప్పటికీ వైవీ వినలేదట. విజయసాయి మాత్రం సమావేశం పూర్తయ్యే వరకు మిన్నకుండిపోయారట. ఇప్పటికీ ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడనేలేదట. ఇవన్నీ జరిగిన తర్వాత పరిణామాలు చాలానే జరిగాయట. అయితే.. ఈ మొత్తం వ్యవహారంలో అధికారుల అత్యుత్సాహం కనిపించిందని స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే సర్వే చేశాక వారసుల పేర్లు రికార్డుల్లో ఎక్కించాల్సి ఉండగా..అలాగే క్లియరెన్స్ ఇవ్వడంతో వ్యవహారం ఇంతవరకూ వచ్చిందనే ఆరోపణలూ లేకపోలేదు. మొత్తానికి ఈ దసపల్లా భూముల వ్యవహారం ఎప్పట్నుంచో ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి నుంచి చెరో వర్గానికి సపోర్టు చేయడం, జగన్ దగ్గరికి గొడవ దాకా వెళ్లింది. ఈ వ్యవహారానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో ఏంటో చూడాలి మరి.