Delhi Liquor Scam Case : హై అలర్ట్.. కవిత ఈడీ ఆఫీసు నుంచి బయటికొచ్చాక ఏం చేయబోతున్నారు..!?

ABN , First Publish Date - 2023-03-11T18:47:55+05:30 IST

దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ (MLC Kavitha ED Enquiry) ఇంకా కొనసాగుతూనే ఉంది..

Delhi Liquor Scam Case : హై అలర్ట్.. కవిత ఈడీ ఆఫీసు నుంచి బయటికొచ్చాక ఏం చేయబోతున్నారు..!?

దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ (MLC Kavitha ED Enquiry) ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభమైన క్వశ్చన్ అవర్ సాయంత్రం 6.30 గంటలు దాటినా ఇంకా పూర్తి కాలేదు. ఏడున్నర గంటలుగా కవితను ఈడీ అధికారులు విచారిస్తూనే ఉన్నారు. ఇవాళ సాయంత్రం 5.30 గంటలకే విచారణ ముగియాల్సి ఉండగా.. అనూహ్యంగా ఆ సమయాన్ని పెంచారు అధికారులు. అయితే.. ఈడీ ఆఫీసు దగ్గర పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. మీడియాను, బీఆర్ఎస్ కేడర్‌ను ఈడీ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో లేకుండా పోలీసులు దూరంగా పంపుతున్నారు. రూల్ ప్రకారం మహిళలను సాయంత్రం 6 వరకు మాత్రమే విచారించాల్సి ఉన్నా, సమయం దాటినా కవితను ఈడీ బయటకు పంపలేదు. ఈడీ వైఖరితో బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళనలో పడ్డాయి. కవిత బయటికి రాగానే అరెస్ట్ చేస్తారని ఢిల్లీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Kavitha.jpg

భారీ బందోబస్తు..

మరోవైపు.. ఈడీ కార్యాలయం నుంచి కవిత బయటికి రాగానే ఆమెను ఇంటికి తీసుకెళ్లడానికి వాహనాలను అధికారులు సిద్ధంగా ఉంచారు. ముఖ్యంగా ఢిల్లీలోని సీఎం కేసీఆర్ నివాసం దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఇవాళ ఉదయం నుంచే బీఆర్ఎస్ శ్రేణులు ఢిల్లీ భవన్ దగ్గర ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యి భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

ED-office-Police-2.jpg

ఏం జరగబోతోంది..?

అయితే.. విచారణ తర్వాత కవిత ఏం చేయబోతున్నారు..? మీడియాతో మాట్లాడుతారా..? ఢిల్లీలోని నివాసానికి వెళ్తారా లేకుంటే హైదరాబాద్‌కు పయనం అవుతారా..? అని బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈడీ విచారణ ముగిస్తే.. ఇవాళే హైదరాబాద్‌కు కవిత బృందం బయల్దేరనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే.. విచారణకు రావాలని మరోసారి కవితకు నోటీసులు ఇవ్వాలనే యోచనలో ఈడీ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే రేపు ఆదివారం కానుండటంతో సోమవారం విచారణకు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఇవాళ రాత్రికి హైదరాబాద్‌కు వచ్చి.. సోమవారం మళ్లీ వెళ్తారా అనేది తెలియాల్సి ఉంది. కాగా.. శుక్రవారం రాత్రి నుంచే మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి అక్కడే ఉన్నారు.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Delhi Liquor Scam Case : ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణలో అనూహ్య నిర్ణయం తీసుకున్న అధికారులు..


******************************

Delhi Liquor Scam Case : ఎమ్మెల్సీ కవితను విచారిస్తూనే ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ఈడీ.. సిబ్బందిని ఇంటికి పంపి...


******************************

Delhi Liquor Case : ఐదు గంటలు పూర్తయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ.. ఇంకా ఎంతసేపు ఉంటుందంటే...!

******************************

Delhi Liquor Scam Case : ఎమ్మెల్సీ కవితను విచారిస్తూనే ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ఈడీ.. సిబ్బందిని ఇంటికి పంపి...

Updated Date - 2023-03-11T18:56:32+05:30 IST