Delhi Liquor Scam Case : ఈడీ విచారణకు వెళ్లేముందు కవిత ఏమేం చేయబోతున్నారంటే.. ఉదయాన్నే..!!
ABN , First Publish Date - 2023-03-10T23:25:55+05:30 IST
దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) శనివారం నాడు (మార్చి-11న) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) ఈడీ ఎదుట హాజరుకానున్నారు...
దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) శనివారం నాడు (మార్చి-11న) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) ఈడీ ఎదుట హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి (ED Office) కవిత విచారణకు వెళ్లనున్నారు. కవిత ఈడీ విచారణ నేపథ్యంలో ఢిల్లీలో అసలేం జరుగబోతోందని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. అయితే విచారణకు వెళ్లే ముందు ఉదయం 7.30 గంటలకే జాగృతి కార్యకర్తలతో కలిసి అల్పాహారం చేయనున్నారు. అనంతరం బీఆర్ఎస్ కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఆ తర్వాత 10.30 నిమిషాలకు ఢిల్లీలోని సీఎం కేసీఆర్ నివాసం (CM KCR Delhi House) నుంచి ఈడీ ఆఫీసుకు కవిత బయల్దేరి వెళ్లనున్నారు. సరిగ్గా ఉదయం 11 గంటలకు ఈడీ అధికారులు ఎదుట హాజరుకానున్నారు.
విచారణ ఇలా ఉంటుందా..?
కాగా.. కన్‌ఫ్రాంటేషన్ ఇంటరాగేషన్ పద్ధతిలో పిళ్లై, కవితలను కలిపి ఈడీ విచారించనున్నట్లు తెలుస్తోంది. కన్‌ఫ్రాంటేషన్ ఇంటరాగేషన్ అంటే.. కేసుతో సంబంధం ఉన్నవారిని ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించడం అని అర్థం. ఎమ్మెల్సీ కవిత విచారణకు ముందురోజే మనీష్ సిసోడియా రిమాండ్ రిపోర్టుతో ఈడీ హీటెక్కించింది. ఈ రిపోర్టులో కవిత పేరు ఉంది. ఇదిలా ఉంటే.. ఈడీ కార్యాలయం ఎదుట పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఆఫీస్ ముందు పోలీసు ఉన్నతాధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగానే అధికారులు ఏర్పాట్లు దగ్గరుండి చూస్తున్నారు. ఇటు హైదరాబాద్‌లోనూ పోలీసులు అలర్ట్ అయ్యారు.
హస్తినకు మారిన్ సీన్..!
మరోవైపు.. తెలంగాణ మంత్రులు, ముఖ్యనేతలు, కవిత అనుచరులు పెద్ద ఎత్తున ఢిల్లీ చేరుకున్నారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ ఢిల్లీలోనే ఉన్నారు. సీఎం కేసీఆర్ నివాసంలో న్యాయ నిపుణులు, బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రతినిధులతో కవిత వరుస భేటీలతో బిజిబిజీగా ఉన్నారు. ఈ భేటీ తర్వాత సోదరుడు, మంత్రి కేటీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. శనివారం, ఆదివారం రెండ్రోజులూ కేటీఆర్ ఢిల్లీలోనే ఉండనున్నారు. కవితతో పాటు ఈడీ ఆఫీసు దాకా కేటీఆర్, హరీష్ రావు.. మహిళా మంత్రులు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి చూస్తే.. ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ అంతా హస్తిన వేదికగానే జరుగుతోంది. అయితే.. ఒక్కొక్కరుగా ఢిల్లీకి పయనం అవుతుండటంతో హస్తినలో అసలేం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి. ఆదివారం ఉదయం కూడా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీ వెళ్లనున్నారు. శనివారం నాడు ఏం జరుగుతుందో ఏంటో వేచి చూడాలి మరి.
******************************
ఇవి కూడా చదవండి..
******************************
MLC Kavitha : మంత్రి కేటీఆర్ హస్తినకు చేరుకున్న నిమిషాల వ్యవధిలోనే.. సీన్ మొత్తం మారిపోయిందిగా..!
******************************