AP Politics: ఎన్టీఆర్ పేరుతో నీచపు ఫ్లెక్సీలు.. ఇది వైసీపీ నేతలకే సాధ్యం

ABN , First Publish Date - 2023-09-11T12:40:15+05:30 IST

వైసీపీ నేత సామినేని ఉదయభాను జగ్గయ్యపేటలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదాస్పదంగా మారింది. చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన సందర్భంగా థాంక్యూ జగన్ పేరుతో సామినేని ఉదయభాను ఫ్లెక్సీ ఏర్పాటు చేసి అందులో సీనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకువచ్చారు. ఈ ఫ్లెక్సీపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. కావాలనే తమను కవ్వింపు చర్యలకు గురిచేస్తున్నారని.. పోలీసులకు ఇవేమీ కనిపించవా అని ప్రశ్నిస్తున్నారు.

AP Politics: ఎన్టీఆర్ పేరుతో నీచపు ఫ్లెక్సీలు.. ఇది వైసీపీ నేతలకే సాధ్యం

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి జగన్ అండ్ కో శునకానందం పొందుతోంది. తాజాగా వైసీపీ నేతలు ఈ విషయాన్ని ఆధారాలతో సహా నిర్ధారిస్తున్నారు. వైసీపీ నేత సామినేని ఉదయభాను జగ్గయ్యపేటలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదాస్పదంగా మారింది. చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన సందర్భంగా థాంక్యూ జగన్ పేరుతో సామినేని ఉదయభాను ఫ్లెక్సీ ఏర్పాటు చేసి అందులో సీనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకువచ్చారు. ఈ ఫ్లెక్సీపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. కావాలనే తమను కవ్వింపు చర్యలకు గురిచేస్తున్నారని.. పోలీసులకు ఇవేమీ కనిపించవా అని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం, వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తుండటం సిగ్గుచేటు అని మండిపడుతున్నారు.

ఇంతకీ ఫ్లెక్సీలో ఏముందంటే..?

థాంక్యూ జగన్.. నా ఆత్మకు శాంతి చేకూర్చావు.. నేను చివరిదశలో అనేక అవమానాలకు, అత్యంత క్షోభకు గురిచేసి.. నా మరణానికి కారణమైన నీచుడు చంద్రబాబు.. నేను చనిపోయాక నా మరణాన్ని వాడుకుని నా కుమారుడు హరికృష్ణ మరణాన్ని కూడా వీడి కుటిల రాజకీయానికి వాడుకుని.. చివరకు నా మనవడు తారకరత్న మరణాన్ని కూడా వీడి కొడుకు నీచ రాజకీయానికి వాడుకున్న నీచుడికి బుద్ధి చెప్పి ‘ నా ఆత్మకు శాంతి చేకూర్చావు’.. నీచుడు, దుర్మార్గుడైన చంద్రబాబు సెప్టెంబర్ 10న జైలుకు వెళ్తున్న సందర్భంగా తెలుగు ప్రజలందరూ ఈరోజును ఆత్మ శాంతి దినోత్సవంగా జరుపుకోవాలని నా విజ్ఞప్తి.. ఇట్లు సీనియర్ ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీలో సామినేని ఉదయభాను ప్రింట్ చేయించారు.

Flexi.jpg

ఈ ఫ్లెక్సీని చూసిన టీడీపీ అభిమానులు వైసీపీ అధినేత జగన్ కావాలని కుట్ర చేసి చంద్రబాబును జైలుకు పంపారని స్పష్టంగా తెలిసిపోతుందని.. వైసీపీ నేతలే బాహాటంగా ఈ విషయాన్ని ఫ్లెక్సీల ద్వారా చెప్తున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు అని విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా ఏపీ ప్రజలు వైసీపీ కుటిల రాజకీయాలను తెలుసుకోవాలని.. తనకు అంటిన అవినీతి మరకలను అందరికీ అంటించే పనిలో జగన్ ఉన్నాడని మండిపడుతున్నారు. తమ అభిమాన నేత చంద్రబాబుకు మద్దతుగా సంఘీబావం తెలపకుండా ఏపీ వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారని.. అటు వైసీపీ నేతల సంబరాలకు మాత్రం 144 సెక్షన్ వర్తించదా అని ఏపీ ప్రభుత్వాన్ని పలువురు టీడీపీ అభిమానులు నిలదీస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Siddharth Luthra : చంద్రబాబును జైల్లో ఉంచడం సరికాదంటూ సిద్దార్థ్ లూద్రా సంచలనం

TDP MLC: నోరు అదుపులో పెట్టుకోండి... అంబటి, రోజాపై విరుచుకుపడ్డ పంచుమర్తి

Updated Date - 2023-09-11T12:49:47+05:30 IST