సుధీర్ బాబు సినిమా సీన్ రిపీట్ అయిందిగా.. 12 ఏళ్ల విద్యార్థి అనుమానాస్పద మృతి వెనుక కథేంటంటే..
ABN , First Publish Date - 2023-02-01T19:27:50+05:30 IST
సుధీర్ బాబుది హంట్ అనే సినిమా ఈ మధ్యనే రిలీజ్ అయింది.. ఈ సినిమాలో హీరో ఒక గే.. ఆ విషయం స్నేహితుడికి తెలిసిపోతుంది.. అందరికీ చెప్పేస్తాడేమోనన్న భయంతో ప్రాణ స్నేహితుడినే హీరో చంపేస్తాడు. ఈ తరహా సంఘటనే..
సుధీర్ బాబుది హంట్ అనే సినిమా ఈ మధ్యనే రిలీజ్ అయింది.. ఈ సినిమాలో హీరో ఒక గే.. ఆ విషయం స్నేహితుడికి తెలిసిపోతుంది.. అందరికీ చెప్పేస్తాడేమోనన్న భయంతో ప్రాణ స్నేహితుడినే హీరో చంపేస్తాడు. ఈ తరహా సంఘటనే ఉత్తరప్రదేశ్‌లో కూడా చోటు చేసుకుంది. ఈ వార్తలో కూడా అందరికీ చెబితే పరువు పోతుందన్న భయంతో ఫ్రెండ్‌ను చంపేస్తాడు. స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) సహరాన్‌పూర్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన 12ఏళ్ల విద్యార్థి స్థానికంగా ఉన్న స్కూల్లో చదువుకునేవాడు. ఇదిలావుండగా, సోమవారం సాయంత్రం తమ గ్రామ సమీపంలోని మదర్సాలో స్నేహితులతో కలిసి చదువుకునేందుకు వెళ్లాడు. అయితే రాత్రి అవుతున్నా ఇంటికి రాలేదు. దీంతో అతడి తల్లిదండ్రులు కంగారుపడి చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. అయినా ఎక్కడా అతడి జాడ కనిపించలేదు. చివరకు మదర్సాలో విచారించగా.. చాలా సేపటి క్రితమే స్నేహితులతో కలిసి వెళ్లిపోయినట్లు చెప్పారు. దీంతో వారిలో ఆందోళన మొదలైంది. రాత్రంతా వెతికినా కొడుకు కనపడకపోవడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంగళవారం ఉదయం గ్రామ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో బాలుడి (boy) మృతదేహం ఉన్నట్లు స్థానికుల ద్వారా తెలుసుకున్నారు.
హాస్టల్‌లో 8వ తరగతి విద్యార్థిని మృతి.. అనుమానంగానే ఆ తల్లిదండ్రులు కూతురి బ్యాగ్‌ను పరిశీలిస్తే..
అక్కడికి వెళ్లి చూడగా.. మృతదేహం నగ్నంగా పడి ఉంది. దీంతో మృతుడి మెడపై కత్తి గాట్లు కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని పరిశీలించారు. చుట్టు పక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను (CC cameras) పరిశీలించగా.. మృతుడు తన స్నేహితులతో కలిసి నడిచి వెళ్తున్నట్లు కనిపించింది. చివరకు మొత్తం ఐదుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారించారు. మృతుడిపై లైంగిక దాడి (sexual assault) జరిగిందని, ఈ విషయం బయట చెబుతాడామోనని చంపేసినట్లు నిందితులు అంగీకరించారు. సదరు విద్యార్థులపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా, బాలుడు మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.