Shocking scene: ట్రాఫిక్‌జామ్‌లో ఇరుక్కుపోయిన కారు.. సడన్‌గా కారు దిగి భర్త ఎస్కేప్.. పెళ్లయిన మర్నాడే అత్తారింటికి వెళ్తుండగా షాకింగ్ సీన్..!

ABN , First Publish Date - 2023-03-10T17:08:38+05:30 IST

కొత్తగా పెళ్లైంది అంటే ఎలా ఉంటుంది ఆ జంట. పార్కులు. సినిమాలు అంటూ షికార్లతో ఎంజాయ్ చేస్తుంటారు. అదేంటో గానీ పెళ్లైనా మరుసటి రోజే

Shocking scene: ట్రాఫిక్‌జామ్‌లో ఇరుక్కుపోయిన కారు.. సడన్‌గా కారు దిగి భర్త ఎస్కేప్.. పెళ్లయిన మర్నాడే అత్తారింటికి వెళ్తుండగా షాకింగ్ సీన్..!
అత్తారింటికి వెళ్తుండగా షాకింగ్ సీన్..!

కొత్తగా పెళ్లైంది అంటే ఎలా ఉంటుంది ఆ జంట. పార్కులు. సినిమాలు అంటూ షికార్లతో ఎంజాయ్ చేస్తుంటారు. అదేంటో గానీ పెళ్లైనా మరుసటి రోజే జంప్ అయ్యాడు ఓ పెళ్లికొడుకు. ఎక్కడో... ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

బెంగళూరు (Bangalore) ట్రాఫిక్‌లో ఇటీవల ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కొత్తగా పెళ్లైన ఓ జంట ట్రాఫిక్‌‌ (traffic)లో చిక్కుకుంది. అదే అదునుగా నూతన వరుడు భార్యను వదిలి పారిపోయాడు. అతని కోసం వెంటపడే ప్రయత్నం చేసినా భార్యకు ట్రాఫిక్‌ సహకరించలేదు. మహదేవ్‌పురా టెక్ కారిడార్‌లో ఫిబ్రవరి 16న ఈ ఘటన చోటు చేసుకుంది. పారిపోయిన వరుడికి పెళ్లికి ముందు గోవా (Goa)లో పని చేస్తున్నప్పుడు ఓ అక్రమ సంబంధం ఉండేది. ఈ విషయం పెళ్లి (Wedding) చేసుకోబోతున్న యువతికి తెలిసింది. ఏదో రకంగా ఈ జంట ఫిబ్రవరి 15న పెళ్లి పీటలు ఎక్కింది. అయితే పెళ్లి జరిగిన మరుసటి రోజే వరుడు పారిపోవడంతో వధువు షాక్ అయింది.

DEEEEE.jpg

నూతన జంట పెళ్లి తర్వాత రోజు చర్చికి వెళ్లి తిరిగి వస్తుండగా కారు ట్రాఫిక్‌లో చిక్కుకుంది. ఈ సమయాన్ని అవకాశంగా తీసుకున్న అతడు.. కార్‌ డోర్‌ తీసి పారిపోయాడు. భార్య అతన్ని వెంబడించడానికి ప్రయత్నించింది, కానీ ట్రాఫిక్‌ రద్దీలో ఆమెకు సాధ్యం కాలేదు. ఈ విషయంపై వధువు మార్చి 5న పోలీసులకు ఫిర్యాదు అందింది. వధువు మాట్లాడుతూ.. ‘వరుడిది చిక్కబళ్లాపూర్ జిల్లా చింతామణి గ్రామం. అతను మా నాన్నకు కర్ణాటక, గోవాలో కంపెనీ నిర్వహించడంలో సహకరించాడు. గోవాలో కంపెనీ పనులు చూస్తున్నప్పుడు అతడు ఓ యువతితో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడు. ఈ విషయం నాకు తెలిసింది. ఆ రిలేషన్‌ ముగించుకుంటానని హామీ ఇవ్వడంతోనే పెళ్లికి నేను అంగీకరించాను. కానీ అతను మారలేదు. తనతో సంబంధం ఉన్న అమ్మాయి బ్లాక్ మెయిల్ చేయడంతో భయపడ్డాడు. ఆ తర్వాత పారిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ధోరణి కూడా కనిపించింది. అతను క్షేమంగా ఉన్నాడని, త్వరలో తిరిగి వస్తాడని ఆశిస్తున్నాను.’ అని వధువు చెప్పింది.

ఇది కూడా చదవండి: Chit chat: బార్‌లో ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకున్న మాటలతోనే వీడిన మర్డర్ మిస్టరీ.. అచ్చం అతడు సినిమాలో జరిగినట్టుగానే..!

Updated Date - 2023-03-10T17:08:55+05:30 IST