Viral Video: అర్ధరాత్రి ఓ కుర్రాడి వింత నిర్వాకం.. స్కూటీపై వెళ్తూ ప్రేయసిని ముందు కూర్చోబెట్టుకుని మరీ పాడు పని.. మర్నాడే..!
ABN , First Publish Date - 2023-05-02T15:26:40+05:30 IST
నలుగురూ చూస్తున్నారన్న ఇంకిత జ్ఞానం లేకుండా శృతిమించి రొమాన్స్‌లో మునిగిపోయారు. పైగా అది
సమాజంలో స్త్రీ, పురుషుల మధ్య కొన్ని హద్దులు ఉంటాయి. ఆ హద్దుల్లోనే ఎవరైనా నడుచుకోవాలి. అలా కాకుండా పరిధి దాటితే సభ్యసమాజం అసహ్యించుకుంటుంది.
పిల్లల ప్రవర్తన బట్టే తల్లిదండ్రులకు పేరు వస్తుంది. అలా కాకుండా చెడు మార్గంలో నడుచుకుంటే కనీ పెంచిన పేరెంట్స్‌కు చాలా అవమానం కలుగుతుంది. ఒకప్పుడు అబ్బాయి గానీ.. అమ్మాయి గానీ పబ్లిక్‌లోకి రావాలంటేనే జంకేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. సినిమాల ప్రభావమో లేదంటే సోషల్ మీడియా ప్రభావయో తెలియదు గానీ.. కొంత మంది యువతీయువకులు తమ హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. నాలుగు గోడల మధ్య జరగాల్సిన విషయాలను పబ్లిక్‌గా జరిగిస్తూ నీచంగా నడుచుకుంటున్నారు.
ఈ మధ్య కాలంలో చాలా మంది యువతీయువకులు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. ఆ మధ్య విశాఖలోని గాజువాకలో ఇద్దరు లవర్స్ చేసిన చేష్టలు గుర్తున్నాయా? అబ్బాయి బైక్ నడుపుతుండగా అమ్మాయి పెట్రోల్ ట్యాంక్‌పై రివర్స్‌లో కూర్చుని కౌగిలింతల్లో మునిగిపోయిన సంఘటన పెద్ద వైరల్ అయింది. ఇలాంటి సంఘటనలు దేశ వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉంటున్నాయి. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. కానీ ఖాకీలు మాత్రం సీరియస్‌గా తీసుకుని తాట తీశారు.
చదువు సంస్కారం నేర్పిస్తుంది అంటారు. కానీ వీళ్లిద్దరూ చేసిన యవ్వారాన్ని చూస్తే వీళ్లు ఏం నేర్చుకున్నారో మీరే చెప్పండి. నలుగురూ చూస్తున్నారన్న ఇంకిత జ్ఞానం లేకుండా శృతిమించి రొమాన్స్‌లో మునిగిపోయారు. పైగా అది ఇల్లు కాదు.. పార్కు కాదు.. సినిమా హాలు కాదూ. నలుగురు పోయే రహదారిపై బైక్ స్పీడుగా పోనిస్తూ ముద్దుల్లో మునిగిపోయారు. అయితే ఈ ప్రేమ జంట వ్యవహారాన్ని మాత్రం పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. డ్రైవింగ్ నిబంధనలు ఉల్లంఘించాడన్న కారణంతో భారీ జరిమానా విధించడంతో పాటు స్టేషన్‌కు పిలిచి నాలుగు చీవాట్లు పెట్టి మరీ కౌన్సెలింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ (viral Video) అవుతోంది.
ఛత్తీస్‌ఘడ్‌లోని బిలాస్‌పూర్‌లో (Bilaspur) అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆ ప్రేమ జంట ఎక్కడ నుంచీ వచ్చారో తెలియదు గానీ.. రోడ్డుపై స్కూటీ (scooty) మీద వేగంగా (young man riding) వెళ్తూ ముద్దులు పెట్టుకుంటూ.. కౌగిలింతల్లో మునిగిపోయారు. రోడ్డుపై ఉన్న వారు చూస్తున్నారన్న సోయి కూడా లేకుండా రొమాన్స్‌లో మునిగిపోయారు. ఏ మాత్రం బండి అదుపు తప్పితే అంతే సంగతులు. అబ్బాయి స్కూటీ డ్రైవ్ చేస్తూ ప్రేయసిని (girlfriend) తన ముందు భాగంలో కూర్చోబెట్టుకుని వేగంగా దూసుకుపోయారు. ఈ దృశ్యాలను సమీపంలో ఉన్న బైకిస్టులు ఫోన్‌లో వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది కాస్తా క్షణాల్లో వైరల్ అయింది.
ఈ వీడియో బిలాస్‌పూర్ ట్రాఫిక్ డీఎస్పీ కంటకి చిక్కింది. ఇక అంతే.. బైక్ నెంబర్ ఆధారంగా వివరాలు సేకరించి అబ్బాయిని పట్టుకుని స్టేషన్‌కు తీసుకొచ్చారు. స్టేషన్‌లో ఫుల్‌గా క్లాస్ తీసుకుని.. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినందుకు రూ.8,800 చలాన్ విధించి.. మరోసారి ఇలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చి క్షమాపణలు చెప్పించి వదిలేశారు.
అయితే ఈ ప్రేమ జంట చేసిన తతాంగాన్ని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇదేమీ ఆనందం రా అంటూ ఫైర్ అవుతున్నారు. ఏ మాత్రం తేడా వస్తే ప్రాణాలకే ముప్పు అని.. ఇలాంటి ప్రయోగాలు చేసి తల్లిదండ్రులకు బాధ కలింగించొద్దని మరికొందరు హితవు పలుకుతున్నారు. ఇక ఈ వీడియో చూసిన పేరెంట్స్ పరిస్థితి ఏం కావాలి. అందుకే జర జాగ్రత్తగా ఉంటే మంచిది.