అన్నయ్య చేసుకోవాల్సిన అమ్మాయితో.. అదే ముహూర్తానికి తమ్ముడితో పెళ్లి.. గంటల్లోనే సడన్‌గా వరుడినే మార్చడం వెనుక కథేంటంటే..

ABN , First Publish Date - 2023-02-23T21:03:21+05:30 IST

రైలు ప్రయాణ సమయంలో ఏర్పడిన వారి పరిచయం చివరకు ప్రేమకు దారి తీసింది. రోజూ ఇద్దరూ ఫోన్లలో మాట్లాడుకోవడం, తరచూ కలుస్తూ ఉండడం చేస్తుండేవారు. ఈ క్రమంలో ఇటీవల యువకుడి వివాహానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. పెళ్లి ఊరేగింపు కూడా సిద్ధమైంది. అయితే ..

అన్నయ్య చేసుకోవాల్సిన అమ్మాయితో.. అదే ముహూర్తానికి తమ్ముడితో పెళ్లి.. గంటల్లోనే సడన్‌గా వరుడినే మార్చడం వెనుక కథేంటంటే..

రైలు ప్రయాణ సమయంలో ఏర్పడిన వారి పరిచయం చివరకు ప్రేమకు దారి తీసింది. రోజూ ఇద్దరూ ఫోన్లలో మాట్లాడుకోవడం, తరచూ కలుస్తూ ఉండడం చేస్తుండేవారు. ఈ క్రమంలో ఇటీవల యువకుడి వివాహానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. పెళ్లి ఊరేగింపు కూడా సిద్ధమైంది. అయితే చివరి నిముషంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అన్న చేసుకోవాల్సిన అమ్మాయిని.. చివరకు తమ్ముడు చేసుకున్నాడు. గంటల వ్యవధిలోనే వరుడు మారడం వెనుక అసలు కథం ఏంటంటే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) గోరఖ్‌పూర్ జిల్లా గుల్రిహా ప్రాంత పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక జుంగియా బజార్ ప్రాంతానికి చెందిన ధ్రువ్ చంద్ చౌరాసియా అనే వ్యక్తికి.. మూడేళ్ల క్రితం రైల్లో వెళ్తుండగా (train journey), బీహార్ ఛప్రా ప్రాంతానికి చెందిన ప్రతిభా చౌరాసియా అనే యువతి (young woman) పరిచయమైంది. రైల్లో మొదలైన పరిచయం ఫోన్ నంబర్లు మార్చుకోవడం, రోజూ మాట్లాడుకోవడం వరకూ వెళ్లింది. తర్వాత ఇద్దరి మధ్య ప్రేమాయణం (love) నడిచింది. ఈ క్రమంలో యువకుడు పలుమార్లు యువతి గ్రామానికి వెళ్లి కలుస్తూ వస్తుండేవాడు. అయితే ఇటీవల ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఫిబ్రవరి 12న యువతిని వారణాసి తీసుకెళ్లి ఓ గుడిలో రహస్యంగా వివాహం చేసుకున్నాడు. అనంతరం ఆమెను సొంతూరికి పంపించాడు.

వాష్ రూంకి వెళ్లాలని చెప్పి భర్తతో రూ.10లు తీసుకున్న నవ వధువు.. చివరకు సీసీ కెమెరాలు పరిశీలించగా.. ఆమె చేసిన నిర్వాకం..

ఈ విషయం ఇంట్లో దాచి పెట్టడంతో కుటుంబ సభ్యులు అతడికి పెళ్లి సంబంధాన్ని ఖాయం చేశారు. బుధవారం వివాహం (marriage) జరగాల్సి ఉండడంతో వధువు గ్రామానికి ఊరేగింపుగా బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ విషయం తెలుసుకున్న బీహార్ యువతి.. నేరుగా గుల్రిహా పోలీసులను ఆశ్రయించింది. తనతో వివాహం చేసుకుని, మళ్లీ రెండో వివాహానికి (Second marriage) సిద్ధపడ్డాడంటూ తన పెళ్లి ఫొటోలు చూపించి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు యువకుడి గ్రామానికి చేరుకుని పెళ్లి ఊరేగింపును (Wedding procession) నిలిపేశారు. ధ్రువ్ చంద్ కుటుంబ సభ్యులు పోలీసులు విషయం తెలియజేయడంతో వారు కూడా అంగీకరించారు. అయితే వివాహం ఆగిపోకుండా ఉండేందుకు.. ధ్రువ్ చంద్ తమ్ముడిని వరుడి స్థానంలో కూర్చోబెట్టి వివాహం జరిపించారు. ఇలా చివరి నిముషంలో అన్న స్థానంలో తమ్ముడు వరుడుగా మారాల్సి వచ్చింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Viral Video: ఎవరీ కుర్రాడు.. వెంటనే కాంటాక్ట్ నెంబర్ పంపండంటూ సెలబ్రెటీల ట్వీట్లు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..!

Updated Date - 2023-02-23T21:06:43+05:30 IST