Woman: 3 వారాలుగా ఓ మహిళకు జ్వరం.. ఎమ్మారై స్కాన్ చేసిన డాక్టర్లకు షాక్.. ఏం చేయాలో తెలియక శాస్త్రవేత్తల వద్దకు వెళ్తే..!

ABN , First Publish Date - 2023-08-29T20:48:46+05:30 IST

రోగుల కడుపులో కత్తెర, దూది తదితర వస్తువులు కనిపించడం చాలా సార్లు చూశాం. అలాగే అప్పుడప్పుడూ కొన్ని అరుదైన కేసులు కూడా వెలుగులోకి వస్తుంటాయి. మహిళ చెవి నుంచి పామును బయటికి తీయడం చూశాం. అలాగే యువతి కంటి నుంచి నీరు కాకుండా రక్తం కారడాన్ని కూడా కూడా చూశాం. అయితే తాజాగా...

Woman: 3 వారాలుగా ఓ మహిళకు జ్వరం.. ఎమ్మారై స్కాన్ చేసిన డాక్టర్లకు షాక్.. ఏం చేయాలో తెలియక శాస్త్రవేత్తల వద్దకు వెళ్తే..!

రోగుల కడుపులో కత్తెర, దూది తదితర వస్తువులు కనిపించడం చాలా సార్లు చూశాం. అలాగే అప్పుడప్పుడూ కొన్ని అరుదైన కేసులు కూడా వెలుగులోకి వస్తుంటాయి. మహిళ చెవి నుంచి పామును బయటికి తీయడం చూశాం. అలాగే యువతి కంటి నుంచి నీరు కాకుండా రక్తం కారడాన్ని కూడా కూడా చూశాం. అయితే తాజాగా, ఓ మహిళకు ప్రపంచంలోనే ఎవరికీ రాని వింత సమస్య వచ్చి పడింది. మూడు వారాలుగా జ్వరం తగ్గకపోవడంతో చివరకు వైద్యుల వద్దకు వెళ్లింది. ఎమ్మారై స్కాన్ చేసిన డాక్టర్లు చివరకు షాక్ అయ్యారు. ఏం చేయాలో తెలియక శాస్త్రవేత్తల వద్దకు వెళ్తే.. చివరకు ఏం తేల్చారంటే..

ఆగ్నేయ ఆస్ట్రేలియాలోని (Southeast Australia) న్యూ సౌత్ వేల్స్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన 64 ఏళ్ల మహిళకు (woman) రెండేళ్ల క్రితం ఉన్నట్టుండి కడుపు నొప్పి, విరోచనాలు, దగ్గు, జ్వరం, రాత్రి వేళల్లో విపరీతంగా చెమట పట్టడం వంటి సమస్యలు మొదలయ్యాయి. తగ్గిపోతుందిలే అనుకుని టాబ్లెట్స్ వేసుకున్నా.. మూడు వారాలవుతున్నా సమస్య మాత్రం తగ్గలేదు. దీంతో చివరకు 2021లో స్థానికంగా ఉన్న వైద్యులను సంప్రదించింది. చికిత్స తీసుకునే క్రమంలో ఏడాది గడిచిపోయింది. 2022లో ఈమె సమస్య మరింత పెద్దగా మారింది. చివరకు ఆమెకు మతిమరుపు కూడా ఎక్కువైంది. చేసేదిలేక ఫైనల్‌గా మరో పెద్ద ఆస్పత్రిలో చేరింది. పరీక్షించిన వైద్యులు.. చివరకు ఆమె తలకు (MRI scanning) ఎమ్‌ఆర్ఐ స్కానింగ్ చేశారు.

Viral Video: ఫ్యామిలీ కోర్టులో నాగిని డాన్స్.. న్యాయమూర్తి వాదనలు వింటోంటే సడన్‌గా ఓ మహిళ కింద పడిపోయి..!

ive-worm-in-woman-brain.jpg

రిపోర్టులు చూసి వైద్యులు మొత్తం షాక్ అయ్యారు. ఆమె మెదడులో కదులుతున్న పురుగులు ఉన్నట్లు (live worm) గుర్తించారు. ఇలాంటి కేసును తమ జీవితంలో చూడలేదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనికి ఎలాంటి ట్రీట్‌మెంట్ ఇవ్వాలో తెలీక.. చివరకు ఇటీవల సంబంధిత శాస్త్రవేత్తల వద్దకు వెళ్లారు. పరీక్షించిన సైంటిస్టులు దీన్ని ఓఫిడాస్కారిస్ రాబర్ట్సీగా తేల్చారు. ఓఫిడాస్కారిస్ రాబర్ట్సీ అనేది పైథాన్‌లలో సాధారణంగా కనిపించే రౌండ్‌వార్మ్ అని తెలిపారు. అయితే ఈ పరాన్నజీవి రోగి శరీరంలో కనిపించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి అని చెప్పారు. ఆమె కొండచిలువలు ఎక్కువ ఉండే ప్రాంతంలో సంచరించడం, అక్కడి ఆకులు, గడ్డిని తాకడం వల్ల.. పరాన్నజీవి రోగి శరీరంలోకి వెళ్లి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సదరు మహిళ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిసింది. ఆమె కోలుకుంటోందని, నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో (Viral news) తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

Wife: భార్య నల్లగా ఉందంటూ కరెంట్ షాకిచ్చి చంపేసిన భర్త.. ఐస్ బాక్సులో పెట్టి తప్పించుకునేందుకు స్కెచ్.. ఎలా దొరికిపోయాడంటే..!

Updated Date - 2023-08-29T20:50:59+05:30 IST