Metro Train: మెట్రో రైల్లో షాకింగ్ సీన్.. ఒక్కసారిగా అవాక్కైన ప్రయాణీకులు.. ఈ యువతులంతా ఏం చేశారో మీరే చూడండి..!

ABN , First Publish Date - 2023-08-29T16:33:02+05:30 IST

మెట్రో రైళ్లలో చోటు చేసుకునే వివిధ రకాల ఘటనలకు సంబంధించిన వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ప్రధానంగా ముంబై వంటి మహా నగరాల్లోని మెట్రో రైళ్లలో మహిళలు ప్రమాదకరంగా ప్రయాణించడం చూశాం. అలాగే చాలా మంది యువతీయువకులు...

Metro Train: మెట్రో రైల్లో షాకింగ్ సీన్.. ఒక్కసారిగా అవాక్కైన ప్రయాణీకులు.. ఈ యువతులంతా ఏం చేశారో మీరే చూడండి..!

మెట్రో రైళ్లలో చోటు చేసుకునే వివిధ రకాల ఘటనలకు సంబంధించిన వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ప్రధానంగా ముంబై వంటి మహా నగరాల్లోని మెట్రో రైళ్లలో మహిళలు ప్రమాదకరంగా ప్రయాణించడం చూశాం. అలాగే చాలా మంది యువతీయువకులు రీల్స్ కోసం బోగీల్లో అందరి ముందూ డాన్సులు చేయడం కూడా చూశాం. అయితే తాజాగా, ఓ మెట్రో రైల్లో యువతులంతా కలిసి చేసిన పనికి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇంతకీ ఆ యువకుతులు ఏం చేశారో మీరే చూడండి..

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ (Maharashtra Nagpur) మెట్రోలో ఈ ఘటన చోటు చేసుకుంది. వారాంతం కావడంతో రైల్లో (Metro train) ప్రయాణికులు కిక్కిరిసి ఉన్నారు. ఆ సమయంలో రైలు బోగీలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. బోగీ మధ్యలో నుంచి పలువురు యువతులు, మహిళలు.. (Young women's fashion show) అందమైన దస్తులు ధరించి క్యాట్ వాక్ చేస్తూ వచ్చారు. వీరిని చూసి అంతా ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒకరి తర్వాత ఒకరుగా వారంతా వివిధ రకాల డ్రస్సులతో ప్రయాణికుల దృష్టిని తమ వైపునకు తిప్పుకొన్నారు. వీరిని చూసి అక్కడున్న వారంతా వారి వారి ఫోన్లలో యువతులను ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు.

Viral Video: ప్రాణభయంతో ప్రశాంతంగా తినగలరా..? లక్షలు ఇస్తామన్నా ఈ రిస్క్ చేయలేమంటున్న నెటిజన్లు..!

‘‘సెలబ్రేషన్ ఆన్ వీల్స్’’.. పేరుతో నాగ్‌పూర్ మెట్రో (Nagpur Metro) ఓ పథకాన్ని అందుబాటులోకి తెచ్చారు. శుభకార్యాలు, స్కూల్ పంక్షన్ల కోసం రైలు బోగీలను బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఇందుకోసం అధికారులు సూచించిన మొత్తాన్ని చెల్లించడం ద్వారా వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చు. ఈ పథకం బాగా ప్రాచుర్యం పొందడంతో ఇటీవల చాలా మంది సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇదిలావుండగా, ప్రస్తుతం మెట్రోలో యువతులు నిర్వహించిన ఫ్యాషన్ షో కార్యక్రమానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Viral Video: ఈ పిల్లాడి టాలెంట్‌కు ఫిదా అవాల్సిందే.. ఒక్క చక్రమే ఉన్న సైకిల్‌పై కూర్చుని.. ఒంటి కాలితో తొక్కుతూనే..!

Updated Date - 2023-08-29T16:33:02+05:30 IST