Auto Driver Video: బెంగళూరులో ఆటో డ్రైవర్ల పరిస్థితి మరీ ఇంత దారుణంగా ఉందా..? ఈ డ్రైవరన్న మాటలు వింటే..!
ABN , First Publish Date - 2023-06-29T13:30:11+05:30 IST
గార్డెన్ సిటీగా(Garden city) పిలువబడే బెంగళూరు నగరం(Bengaluru) సాంకేతికంగా కూడా ఎంతో అభివృద్ది చెందింది. పొరుగు రాష్ట్రాల ప్రజలు కూడా జీవనోపాధికోసం బెంగుళూరుకు వలస వెళుతుంటారు. నిత్యం రద్దీగా ఉండే ఈ నగరంలో ఆటోడ్రైవర్ల(Auto driver) జీవితం కంపెనీలలో పనిచేస్తూ ఐదంకెల జీతం తీసుకునేవారికంటే నయం అనేలా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం..
'దూరపు కొండలు నునుపు' అనే సామెత అందరికీ తెలిసిందే. పెద్ద పెద్ద నగరాల్లో కనీసం ఆటో లాగినా జీవితం బ్రహ్మాండంగా ఉంటుందని ఎంతో మంది అనుకుంటూ ఉంటారు. కంపెనీలలో పనిచేసేవారికంటే వీరి జీవితాలే నయమని కూడా చెప్పుకుంటారు. దీనికి తగినట్టే ఆటో డ్రైవర్లు మీటర్ వేయకపోవడం, పరిస్థితులను బట్టి కస్టమర్లను సొమ్ముచేసుకోవడం చేస్తుంటారు. ఒకప్పుడు బెంగుళూరు నగరంలోనూ పరిస్థితి ఇలాగే ఉండేది, కానీ ఇప్పుడది తారుమారైంది. ఓ ఆటో డ్రైవర్ కంటతడి పెడుతూ చెప్పిన మాటలు వింటే తప్ప అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం కాదు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. బెంగుళూరులో పరిస్థితులేంటి? ఈ ఆటో డ్రైవర్ కంట తడిపెట్టుకోవడం వెనుక కారణమేంటి తెలుసుకుంటే..
గార్డెన్ సిటీగా(Garden city) పిలువబడే బెంగళూరు నగరం(Bengaluru) సాంకేతికంగా కూడా ఎంతో అభివృద్ది చెందింది. పొరుగు రాష్ట్రాల ప్రజలు కూడా జీవనోపాధికోసం బెంగుళూరుకు వలస వెళుతుంటారు. నిత్యం రద్దీగా ఉండే ఈ నగరంలో ఆటోడ్రైవర్ల(Auto driver) జీవితం కంపెనీలలో పనిచేస్తూ ఐదంకెల జీతం తీసుకునేవారికంటే నయం అనేలా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. బెంగుళూరులో కాంగ్రేస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత బస్సులు(free buses) ఆటోడ్రైవర్లను చాలా దారుణంగా దెబ్బతీస్తున్నాయి. వీడియోలో ఓ ఆటో డ్రైవర్ తన కష్టాన్నంతా చెప్పకొచ్చాడు. అతను ఉదయం 8గంటలనుండి మధ్యాహ్నం 1గంట వరకు కష్టపడ్డాడు. 5గంటలలో అతను సంపాదించింది కేవసలం 40రూపాయలు మాత్రమే. అతను తన చొక్కా జేబులో నుండి తను సంపాదించిన మొత్తాన్ని బయటకు తీసి మరీ చూపిస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. తాజాగా ఏర్పాటైన ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఫ్రీ బస్సుల కారణంగా మా దగ్గరకు కస్టమర్లు రావడం లేదంటూ వాపోయాడు.
Eggs vs Paneer: కోడిగుడ్లు మంచిదా..? పనీర్ వాడటం బెస్టా..? బరువు తగ్గాలనుకునే వాళ్లు ఏది వాడాలంటే..!
ఈ వీడియోను Megh Updates అనే ట్విట్టర్(Twitter) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆటోడ్రైరైవర్ల మీద సానుభూతి చూపడం లేదు. విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. 'బెంగుళూరులో చాలామంది ఆటోడ్రైవర్లు మీటర్ ప్రకారం నడిపేవారు చాలా తక్కువ మంది ఉంటారు' అని కామెంట్ చేశారు. 'ఈ ఆటోడ్రైవర్లకు సరైన గుణపాఠం లభించింది. ఒకప్పుడు అమాయకులైన కస్టమర్ల నుండి వారు చాలా డబ్బు లాక్కున్నారు' అని మరొకరు వారిని నిందించారు. 'నిన్ననే ఓ ఆటో డ్రైవర్ 9కి.మీ ప్రయాణానికి 900రూపాయలు చార్జ్ చేశాడు. ట్రైన్ రిజర్వేషన్ చేసుకుని ఉండటంతో నేను తప్పక వెళ్లాల్సి వచ్చింది' అంటూ బెంగుళూరు ఆటోడ్రైవర్లు ఎంతలా దోచుకుంటారో ఉదాహరణ చెప్పుకొచ్చారు. అయితే నిజాయితీగా పనిచేసేవారు కూడా ఈ పరిస్థితులకు బలవ్వడం బాధాకరమని మరికొందరు అంటున్నారు.