Viral News : బాబోయ్.. ఇలాంటి ప్రమాణం మీరెప్పుడూ, ఎక్కడా చూసుండరు..!

ABN , First Publish Date - 2023-09-23T13:53:53+05:30 IST

ఏ భార్య అయినా తన భర్త ఆరోగ్యంగా ఉండాలని.. కుటుంబాన్ని బాగా చూసుకోవాలని.. తన తాళి బొట్టు పది కాలాలు పాటు వర్థిల్లాలి అని కోరుకుంటుంది. ఏ అర్థాంగి అయినా ఇదే ఆశిస్తుంది. అలా కాకుండా

Viral News : బాబోయ్.. ఇలాంటి ప్రమాణం మీరెప్పుడూ, ఎక్కడా చూసుండరు..!

ధూమపానం.. మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. ఈ మాటలు మనం నిత్యం వింటుండేవే.. చూస్తుండేవే!. సిగరెట్ ప్యాకెట్లు, మందు బాటిళ్ల రాసుంటారు కూడా.. ఇక సినిమాకెళ్తే సినిమా ప్రారంభం నుంచి.. మధ్యలో ఇలాంటి సీన్స్ వస్తే చాలు హానికరం అని కింది బాగాన హెచ్చరిస్తూనే ఉంటారు. అయినా సరే.. అబ్బే మనకన్నీ పట్టవు.. తాగుడే తాగుడు. ఒక్క మాటలో చెప్పాలంటే వాటిని ముట్టుకోకుండా ఉండరంతే.. ప్రమాదమని తెలిసి కూడా వాటితోనే సహవాసం చేస్తుంటారు. ఒకప్పుడు సారా వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయాయి. సారా పిశాచి ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంది. ఎంతోమంది భర్తల తాగుడుకు మహిళల తాళి బొట్టులు తెగిపోయి విధవరాండ్రయ్యారు. ఇప్పుడు మద్యం ఏరులైపారుతోంది. మూతి మీద మీసం రానోళ్లు కూడా దీనికి బానిసలై జీవితాలను పాడుచేసుకుంటున్నారు. చిన్న వయసులోనే భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. ఇక పెద్దవారైతే కుటుంబ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. మరికొందరైతే మత్తుకు బానిసలుగా మారి కన్నుమిన్ను కాకుండా ప్రవర్తిస్తూ నిండు నూరేళ్ల జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఇలా ఒక్కొక్క ఇంట్లో ఒక్కో గాథ కనిపిస్తుంటుంది. కుటుంబ సభ్యులు ఎంత వారించినా బతుకులను మార్చుకోకుండా చేజేతులారా? నరకకూపంలోకి నెట్టేసుకుంటున్న వారిని ఎంతో మందిని చూసే ఉంటారు. ఇదంతా ఇప్పుడెందుకంటారా? అయితే ఈ వార్త చదవాల్సిందే.

వైరల్.. వైరల్!

ఏ భార్య అయినా తన భర్త ఆరోగ్యంగా ఉండాలని.. కుటుంబాన్ని బాగా చూసుకోవాలని.. తన తాళి బొట్టు పది కాలాలు పాటు వర్థిల్లాలి అని కోరుకుంటుంది. ఏ అర్థాంగి అయినా ఇదే ఆశిస్తుంది. అలా కాకుండా భర్త చెడు అలవాట్లకు బానిసై కుటుంబాన్ని పట్టించుకోకుండా కన్నుమిన్ను కాకుండా ప్రవర్తిస్తే... ఏ నారీ కూడా సహించలేదు. కొందరైతే రక్తసంబంధికులకో.. ఊరు పెద్దలకో చెప్పుకుని బాధపడుతుంటారు. కానీ ఆ స్త్రీ మూర్తి ఏమనుకుందో ఏమో తెలియదు గానీ తన భర్త జీవితాన్ని గాడిన పెట్టాలనుకుంది. అంతే తడువుగా గ్రామంలో ఉన్న దేవాలయానికి తీసుకెళ్లి ప్రమాణం చేయించింది. శివలింగంపై చేయి వేయించి ప్రమాణం చేయించింది. ఓ పూజారి చదువుతుండగా ఆ వ్యక్తి ప్రమాణం చేశాడు. ఇకపై మత్తు పానీయాలకు దూరంగా ఉంటానని ప్రమాణం చేస్తాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం రాచపూడి గ్రామంలో చోటుచేసుకుంది.

పూజారి ఏమని ప్రమాణం చేయించాడంటే..

‘రమ్ము, బీజర్, వైన్, గుట్కా, గుడుంబా, తాటి కల్లు, ఈత కల్లు, తాటి చిగురు, ఈత చిగురు, సారా.. మొదలగు మత్తుపానీయాలు నేటి నుంచి 5 సంవత్సరముల కాలంలోపు ఎట్టి పరిస్థితుల్లోనూ తాగనని.. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా.. నాకు పిల్లనిచ్చిన అత్తమామల సాక్షిగా.. నేను పెళ్లి చేసుకున్న నా భార్య సాక్షిగా.. నేను జన్మనిచ్చిన నా పిల్లల సాక్షిగా రాచపూడి గ్రామంలో వెలసిన ఉన్న పరమేశ్వరుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.’’ అని ఆ వ్యక్తితో పూజారి ప్రమాణం చేయించాడు. ఇందులో ఎవరి బలవంతం లేదని అతని చేత పూజారి ఒప్పిస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు.. నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇంత కష్టం పగవాడికి కూడా రావద్దు రా భగవంతుడా’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. చూశారుగా మద్యం మానేయడానికి సదరు వ్యక్తి ఎలా ప్రమాణం చేశారో. ఇక ఎందుకు ఆలస్యం ఆ వీడియోను మీరు కూడా చూసేయండి..

Updated Date - 2023-09-23T13:54:58+05:30 IST