Software Engineer: ఏడాదికి రూ.58 లక్షలు సంపాదిస్తున్నా.. అయినా నాదీ ఓ బతుకేనా..? వైరల్‌గా మారిన 24 ఏళ్ల ఓ టెకీ పోస్ట్..!

ABN , First Publish Date - 2023-04-22T13:08:17+05:30 IST

లైఫ్‌లో హ్యాపీగా ఉండాలంటే.. ఒక్క డబ్బు ఉంటే సరిపోతుందా? అనేది చాలా మంది మదిని తొలిచే ప్రశ్న.

Software Engineer: ఏడాదికి రూ.58 లక్షలు సంపాదిస్తున్నా.. అయినా నాదీ ఓ బతుకేనా..? వైరల్‌గా మారిన 24 ఏళ్ల ఓ టెకీ పోస్ట్..!

ఇంటర్నెట్ డెస్క్: లైఫ్‌లో హ్యాపీగా ఉండాలంటే.. ఒక్క డబ్బు ఉంటే సరిపోతుందా? అనేది చాలా మంది మదిని తొలిచే ప్రశ్న. అయితే, దీనిపై చాలా భిన్నాభిప్రాయాలు వినిపిస్తుంటాయి. ఎంత డబ్బు ఉన్నా సరే ఏదో తెలియని వెలితి మాత్రం ఉంటుంది. ఇప్పుడు ఇదే విషయమై బెంగళూరుకు చెందిన ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ (Software Engineer) నెటిజన్లను సలహా కోరాడు. మంచి సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం, తద్వారా 24 ఏళ్లకే ఏడాదికి రూ.58లక్షలు సంపాదిస్తున్నా.. తన లైఫ్‌లో ఏదో వెలితి అని ఆ టెకీ అంటున్నమాట. ఈ బోరింగ్, ఒంటరి, నిష్ఫలమైన జీవితం నుంచి తాను బయటపడేందుకు సలహా ఇవ్వండంటూ ఓ పెద్ద వ్యాసమే రాసుకొచ్చాడు. చివరన ఓ షరతు కూడా పెట్టాడు. దాంతో నెటిజన్లు ఆ సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి తమకు తోచిన సలహాలు ఇస్తున్నారు.

నిజానికి ఆ టెకీ తన నోట్‌ను గ్రేప్‌విన్‌ (Grapevine) అనే ఆఫీస్ చాట్స్‌కు సంబంధించిన యాప్‌లో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్‌ను కాస్తా 'సుఖందా' అనే ట్విటర్ యూజర్ 'ది అదర్ ఇండియా' అనే క్యాప్షన్‌తో ట్విటర్‌లో షేర్ చేసింది. అంతే.. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో (Social Media) వైరల్‌ అవుతోంది. టెకీ నోట్ ప్రకారం.. "నేను 24 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. బెంగళూరులోని ఓ FAANG (ఫేస్‌బుక్, యాపిల్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్ అనే ఐదు టాప్ అమెరికన్ కంపెనీలు) కంపెనీలో గత 2ఏళ్ల 9 నెలలు నుంచి పని చేస్తున్నాను. ఏడాదికి రూ.58లక్షల వరకు సంపాదిస్తున్నాను. చాలా సంతృప్తికరమైన ఉద్యోగ జీవితం నాది. అయినా, అప్పుడప్పుడు ఏదో తెలియని వెలితి, ఒంటరితనం తనం నన్ను వెంటాడుతున్నాయి. వీటి నుంచి బయటపడేందుకు నాకు గర్ల్‌ఫ్రెండ్ కూడా లేదు. మిగతా నా తోటి ఉద్యోగులు ఎంతో హ్యాపీగా వారి లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు. ఇక ఒక విధంగా నా వర్క్‌లైఫ్ కూడా ఒకే పంతలో ఉంది. నేను కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి అదే కంపెనీలో పని చేస్తు్న్నాను. అందుకే అప్పడప్పుడు వర్క్ లైఫ్ కూడా బోరింగ్‌గా అనిపిస్తుంది. ప్రతిరోజు రోటిన్ వర్క్ చేయాల్సి వస్తుంది. అంతేగాక నేను చేస్తున్నా జాబ్‌లో చూడటానికి కొత్త ఛాలెంజెస్, గొప్ప అవకాశాలు కూడా ఏమీ లేవు. అందుకే నా జీవితం మరింత ఆసక్తికరంగా మారేందుకు మీ సలహాలు కావాలి. కానీ, జీమ్‌కి వెళ్లమని మాత్రం చెప్పకండి. ఎందుకంటే నేను ఇప్పటికే అక్కడికి వెళ్లడం జరిగింది." ఇది ఆ సాఫ్ట్‌వేర్ నోట్. ఇప్పుడు ఈ నోట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు తమదైనశైలిలో సలహాలు, సూచనలు చేస్తున్నారు.

Wedding Card: బాబోయ్.. ఈ వరుడు ఇలా చేశాడేంటి..? పెళ్లికార్డుపై ఉన్నదేంటో చదివి అవాక్కవుతున్న బంధువులు.. పెళ్లికి రావాలా..? వద్దా.. అంటూ..!


'గర్ల్‌ఫ్రెండ్‌ను కనుగొనడంలో పరిష్కారం లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు' అని ఒకరు అంటే.. 'ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న చాలామందికి కొన్ని ఆలోచనలు ఉంటాయి. అవి ఉద్యోగం మానేయడం లేదా పర్వతాలకు వెళ్లి వ్యవసాయం చేయడం లేదా కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవడం వంటివి ఉంటాయని నేను భావిస్తున్నాను. ముందుగా ఏం జరుగుతుందోనన్న భయం వీడాలి. ఆ తర్వాత కచ్చితమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉండాలి. అదే మనల్ని అవతలి వారిని వేరు చేసి చూపిస్తుంది' అని మరోకరు అన్నారు. 'అతను ఏదైనా స్టార్టప్‌లో చేరాలి లేదా తన సొంతంగా ఏదైనా స్టార్టప్ ప్రారంభించాలి. అప్పుడే అతనికి ప్రతిరోజూ పరిష్కరించడానికి కొత్త సమస్యలను కలిగి ఉంటాడు. అంతేగాక అతని ఆ సమయంలో కొన్ని లక్ష్యాలు కూడా ఏర్పడతాయి. సొంత వెంచర్‌ను విజయవంతం చేయడం, తన సంస్థలో పనిచేసే వారి ముఖంలో ఆనందాన్ని చూడడం అనే ఒక లక్ష్యానికి డైరెక్ట్ చేస్తాడు. జీవితం అంటే ఇతరులకు విలువ ఇవ్వడం, సృష్టించడం' అని మరో నెటిజన్ సలహా ఇచ్చాడు.

Viral Video: పెళ్లి వేదిక మీదే బావను ఆటపట్టించాలనుకుందో మరదలు పిల్ల.. ఉప్పూ కారం కలిపిన నీళ్లను తెచ్చి డ్రింక్‌లా ఇవ్వబోయి..

Updated Date - 2023-04-22T13:08:17+05:30 IST