Funny Video: వరుడు రెండు కొడితే.. వధువు నాలుగు తన్నింది.. బంధువులు ఆపుతున్నా ఆగకుండా పిచ్చి పిచ్చిగా తన్నుకున్నారు..!

ABN , First Publish Date - 2023-04-21T12:11:31+05:30 IST

ఇటీవల సోషల్ మీడియాలో (Social Media) వధువరూలకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతున్నాయి.

Funny Video:  వరుడు రెండు కొడితే.. వధువు నాలుగు తన్నింది.. బంధువులు ఆపుతున్నా ఆగకుండా పిచ్చి పిచ్చిగా తన్నుకున్నారు..!

Funny Video: ఇటీవల సోషల్ మీడియాలో (Social Media) వధువరూలకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతున్నాయి. ఇదే కోవలో తాజాగా మరో వీడియో నెట్టింట బాగా హల్‌చల్ చేస్తోంది. వీడియో చూసిన వారికి వీళ్లు ఇప్పుడే ఇలా ఉంటే.. భవిష్యత్ ఏంటో అనే అనుమానం రాకమానదు. వీడియో పాతదే అయినా ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే వీడియోకు 1.72లక్షల వ్యూస్ వచ్చాయి. వీడియోలో మొదట వధువు నోటిలో వరుడు (Groom) స్వీట్ పెట్టడం.. ఆమె తినకపోవడంతో బలవంతగా తినిపించబోయాడు. దాంతో వరుడిపై వధువు చెయ్యి చేసుకుంది. దీంతో కోపగించుకున్న వరుడు తిరిగి వధువును కొట్టాడు.

అలా వరుడు రెండు కొడితే.. వధువు (Bride) నాలుగు తన్నింది. ఇద్దరు నువ్వానేనా అన్నట్టుగా బాదుకున్నారు. బంధువులు ఆపుతున్నా ఆగకుండా పిచ్చి పిచ్చిగా తన్నుకున్నారు. వారు అలా కొట్టుకుంటుంటే పెళ్లికి వచ్చినవారంతా నోరెళ్లబెట్టారు. 'ఘర్ కే కలేష్' (Ghar Ke Kalesh) అనే ట్విటర్ హ్యాండిల్ ద్వారా ఈ వీడియో గతేడాది డిసెంబర్ 13న పోస్ట్ అయింది. 27 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోకు ఇప్పటివరకు 1.72లక్షల వ్యూస్ వచ్చాయి. మూడు వేలకు పైగా లైక్స్ వచ్చిపడ్డాయి. నెటిజన్లు దీనిపై ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. 'ఇది అసంపూర్తిగా మిగిలిపోయిన రెజ్లింగ్ పోటీ. ట్రోఫీ ఎవరు గెలిచారో?' అంటూ ఓ నెటిజన్ ఫన్నీగా స్పందించాడు. చాలా మంది 'వామ్మో.. ఈ భార్యాభర్తల భవిష్యత్తు తలచుకుంటే..' అని కామెంట్ చేస్తున్నారు.

Viral Video: మెట్రో రైల్లో ఇవేం ఘోరాలు బాబోయ్.. స్కర్టులతో వచ్చి ప్రయాణీకుల మతి పోగొట్టిన కుర్రాళ్లు.. అమ్మాయిల్లాగే నడుస్తూ..


Updated Date - 2023-04-21T12:11:31+05:30 IST