Crime News: తెల్లవారినా బెడ్రూం నుంచి బయటికి రాని నవ దంపతులు.. చివరకు తల్లిదండ్రులు తలుపులు తీసి చూడగా..
ABN , First Publish Date - 2023-06-06T18:53:05+05:30 IST
పెళ్లి అనే రెండెక్షరాలతో ఒక్కటయ్యే దంపతులు.. జీవితాంతం అదే బంధాన్ని కొనసాగిస్తుంటారు. అయితే కొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. వివిధ కారణాలతో కొన్ని వివాహాలు మంటపంలోనే రద్దవుతుంటాయి. మరికొన్నిసార్లు...
పెళ్లి అనే రెండెక్షరాలతో ఒక్కటయ్యే దంపతులు.. జీవితాంతం అదే బంధాన్ని కొనసాగిస్తుంటారు. అయితే కొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. వివిధ కారణాలతో కొన్ని వివాహాలు మంటపంలోనే రద్దవుతుంటాయి. మరికొన్నిసార్లు విధి వక్రించి.. పెళ్లింట విషాదం అలుముంటూ ఉంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం నవ దంపతులకు సంబంధించిన ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. తెల్లవారి చాలా సేపైనా నవ దంపతులు బెడ్రూం నుంచి బయటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చి.. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూసి చివరకు షాక్ అయ్యారు. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
యూపీలోని (UP) బహ్రైచ్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన 22ఏళ్ల వ్యక్తికి.. 20ఏళ్ల యువతితో ఇటీవలే (marriage) వివాహమైంది. మరుసటి రోజు వరుడి ఇంటికి వెళ్లారు. మొదటి రాత్రి సందర్భంగా బెడ్రూంలోకి వెళ్లిన వధూవరులు (bride and groom) .. ఉదయం ఎంతకీ బయటికి రాలేదు. చాలా సేపు వేచి చూసినా తలుపులు మాత్రం తీయలేదు. దీంతో వరుడి తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. కొడుకును పిలిచి తలుపులు (doors) తీయాలని కోరారు. అయినా లోపలి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు చివరకు తలుపులను బలవంతంగా తీశారు.
లోపల మంచంపై చలనం లేకుండా పడి ఉన్న కొడుకు, కోడలిని చూసి అంతా షాక్ అయ్యారు. వారిని చికిత్స నిమిత్తం వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం నివేదికలో షాకింగ్ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వధూవరుల మృతికి గుండెపోటు (heart attack) కారణమని వైద్యులు తెలిపారు. గదిలో వెంటిలేషన్ లేకపోవడంతో తలుపులు, కిటికీలు మూయడంతో ఈ సమస్య తలెత్తినట్లు పేర్కొన్నారు. ఒత్తిడి, లైంగిక కార్యకలాపాల సమయంలో కొన్నిసార్లు గుండె పోటు వచ్చే ప్రమాదం ఉందని వారు వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివాహమైన మరుసటి రోజు ఇలా జరగడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.