Share News

Viral Video: బస్సు నడుపుతూనే రోడ్డు పక్కన మహిళను గమనించిన డ్రైవర్.. ఒక్క క్షణం ఆలస్యమైనా పెద్ద ఘోరమే జరిగేది..

ABN , First Publish Date - 2023-10-19T20:43:58+05:30 IST

చావు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు. అయితే కొందరు మాత్రం కోరి మరీ చావును కొనితెచ్చుకుంటుంటారు. మరికొందరు వివిధ కారణాలతో జీవితంపై విరక్తిచెంది ఆత్మహత్య నిర్ణయాలు తీసుకుంటుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు...

Viral Video: బస్సు నడుపుతూనే రోడ్డు పక్కన మహిళను గమనించిన డ్రైవర్.. ఒక్క క్షణం ఆలస్యమైనా పెద్ద ఘోరమే జరిగేది..

చావు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు. అయితే కొందరు మాత్రం కోరి మరీ చావును కొనితెచ్చుకుంటుంటారు. మరికొందరు వివిధ కారణాలతో జీవితంపై విరక్తిచెంది ఆత్మహత్య నిర్ణయాలు తీసుకుంటుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. చావాలనుకున్న సమయంలో ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు వచ్చి కాపాడుతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి బస్సు నడుపుతుండగా.. రోడ్డు పక్కన మహిళ చేస్తున్న పని చూసి షాక్ అయ్యాడు. చివరకు ఏం జరిగిందంటే...

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ తన కొడుకుని తీసుకుని రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుంటుంది. బ్రిడ్జిపై ఓ వైపు నడుచుకుంటూ వెళ్తున్న ఆమె సడన్‌గా ఆగిపోతుంది. ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. ఉన్నట్టుండి షాకింగ్ నిర్ణయం తీసుకుంటుంది. తన బాబును ఎత్తుకుని బ్రిడ్జి పైనుంచి (woman jumped into the water with her son) కింద నీటిలోకి దూకాలని ప్రయత్నిస్తుంది. అయితే అంతకు ముందు నుంచీ వెనుక వస్తున్న బస్సు డ్రైవర్ (Bus driver) .. ఆమెను గమనిస్తుంటాడు. అయితే మహిళ నదిలోకి దూకడాన్ని చూసి షాక్ అవుతాడు.

Viral Video: బుల్లెట్ బైకుపై మహిళ భయంకర స్టంట్.. మగవారికి ఏమాత్రం తీసిపోని విధంగా ఒంటి చేత్తో..

ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బస్సు ఆపి, చకచకా కిందకు దిగి దూకబోతున్న మహిళను పట్టుకుని వెనక్కు లాగేస్తాడు. తర్వాత ఆమె కొడుకును ఎత్తుకుని బస్సులోకి తీసుకెళ్తాడు. అంతలో మరో వ్యక్తి వచ్చి మహిళను దూకకుండా పట్టుకుని.. చివరకు ఆమెను బస్సు ఎక్కించి తీసుకెళ్తారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ డ్రైవర్ రియల్ హీరో’’.. అని కొందరు, ‘‘సమయానికి దేవుడిలా వచ్చి కాపాడాడు’’.. అని మరికొందరు, ‘‘ఆమె చావడమే కాకుండా పిల్లాడిని కూడా చంపాలనుకోవడం దారుణం’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 26మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఐ ఫోన్ కొనడానికి వెళ్లిన భిక్షగాడు.. దుకాణంలో అందరికీ షాక్ ఇస్తూ.. చివరకు ఏం చేశాడో చూడండి..

Updated Date - 2023-10-19T20:43:58+05:30 IST