Cab driver extorts: క్యాబ్‌లో వెళ్తున్నారా? ఇలాంటి వారుంటారు జాగ్రత్త సుమీ..!

ABN , First Publish Date - 2023-08-03T13:54:51+05:30 IST

కర్నాటక రాజధాని బెంగళూరు (Bengaluru) లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తన కారులో ప్రయాణించిన ఓ ప్రయాణికురాలిని ఓ క్యాబ్ డ్రైవర్ బ్లాక్‌మెయిల్ (Blackmail) చేస్తూ ఏకంగా రూ.22లక్షల నగదు, సుమారు రూ.69లక్షలు విలువ చేసే 960 గ్రాముల బంగారం ఆభరణాలు గుంజేశాడు.

Cab driver extorts: క్యాబ్‌లో వెళ్తున్నారా? ఇలాంటి వారుంటారు జాగ్రత్త సుమీ..!

ఇంటర్నెట్ డెస్క్: కర్నాటక రాజధాని బెంగళూరు (Bengaluru) లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తన కారులో ప్రయాణించిన ఓ ప్రయాణికురాలిని ఓ క్యాబ్ డ్రైవర్ బ్లాక్‌మెయిల్ (Blackmail) చేస్తూ ఏకంగా రూ.22లక్షల నగదు, సుమారు రూ.69లక్షలు విలువ చేసే 960 గ్రాముల బంగారం ఆభరణాలు గుంజేశాడు. అంతటితో అతడి ఆగడాలు ఆగలేదు. ఇంకా డబ్బు కావాలని బాధితురాలిని బెదిరించాడు. దాంతో ఆమె చివరకు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేటుగాడిని అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ క్యాబ్‌లో ప్రయాణించిన సమయంలో ఆమె చేసిన పొరపాటు ఏంటి? అసలు క్యాబ్ డ్రైవర్‌ (Cab driver) ఆమెను ఏ విషయంలో బ్లాక్‌మెయిల్‌ చేశాడు? తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

బెంగళూరులోని ఇందిరానగర్‌లో ఉండే ఓ మహిళ ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుంది. గతేడాది డిసెంబర్‌లో ఆఫీస్‌కు వెళ్లేందుకు గాను ఇందిరానగర్ నుంచి బనాస్‌వాడికి ఒక క్యాబ్ బుక్ చేసింది. దాంతో హేసరఘట్ట (Hesaraghatta) కు చెందిన క్యాబ్ డ్రైవర్ కిరణ్ కుమార్ ఆమెను పీకాప్ చేసుకున్నాడు. అలా ఆ క్యాబ్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఆమె తన స్నేహితురాలితో ఫోన్‌లో మాట్లాడింది. ఆ సమయంలో ఆమె తన వ్యక్తిగత విషయాలను కూడా ఆమెతో పంచుకుంది. ఈ రహస్య సంభాషణను కిరణ్ విన్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆమెకు వేరే ఫోన్ నంబర్‌తో కాల్ చేశాడు. నీ వ్యక్తిగత విషయాలు బయటపెడతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దాంతో బాధితురాలు కిరణ్ అడిగినట్లు వివిధ దఫాలలో రూ.22లక్షలు అతడి బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేసింది.

Cab-Driver.jpg

Viral Video: ఇలాంటి పెళ్లి మునుపెన్నడూ చూసుండరు.. వైరల్ అవుతున్న వీడియో!


కానీ, అతడు అంతటితో ఆగలేదు. ఈ క్రమంలో ఆమె ఎలాగోలా తనను వేధిస్తుంది క్యాబ్ డ్రైవర్ కిరణే అని తెలుసుకుంది. వెంటనే అతణ్ని నిలదీసింది. అప్పటి నుంచి అతడి వేధింపులు ఇంకా ఎక్కువ అయ్యాయి. తాను అడిగినంత డబ్బులు ఇవ్వాలని లేనిపక్షంలో వ్యక్తిగత విషయాలు తప్పకుండా బయటపెడతానని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలెట్టాడు. దాంతో ఆమె తన వద్ద ఉన్న సమారు రూ.69లక్షలు విలువ చేసే 960 గ్రాముల బంగారు ఆభరణాలు కూడా ఇచ్చేసింది. అయినా అతడి వేధింపులు ఆగలేదు. చివరకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడి నుంచి కొంత మొత్తం స్వాధీనం చేసుకున్నారు. అలాగే వివిధ సంస్థలలో అతడు తాకటు పెట్టిన బంగారం నగలను కూడా రికవరీ చేసుకుని బాధితురాలికి అప్పగించారు.

Viral Video: రోడ్డుపై ఈ స్కూటీని చూసి విస్తుపోతున్న జనం.. ఇందులో వింతేముందనుకుంటున్నారా..? ఒక్కసారి చూస్తే..!


Updated Date - 2023-08-03T13:55:27+05:30 IST