Cadbury Bournvita ఆరోగ్యానికి మంచిదేనా..? తయారు చేసేందుకు వాడేదేంటి..?.. అసలు నిజాలివేనంటూ వైరల్‌గా మారిన ఓ వ్యక్తి వీడియో..

ABN , First Publish Date - 2023-04-14T17:31:26+05:30 IST

'మీరు బోర్నవీటా వాడుతున్నారా? దాన్నితయారు చేయడానికి ఉపయోగించేవి ఇవే.. ఇది వాడితే వచ్చేసమస్యలు ఇవే ' అంటూ ఓ వ్యక్తి చెబుతున్న వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

Cadbury Bournvita ఆరోగ్యానికి మంచిదేనా..? తయారు చేసేందుకు వాడేదేంటి..?.. అసలు నిజాలివేనంటూ వైరల్‌గా మారిన ఓ వ్యక్తి వీడియో..

కాఫీలు, టీలు ఆరోగ్యానికి హానికరం. అందుకే చాలామంది హెల్త్ డ్రింక్స్ వైపు మొగ్గుచూపుతారు. ముఖ్యంగా పిల్లలున్న ప్రతి ఇంట్లో హెల్త్ డ్రింక్ పౌడర్స్ తప్పనిసరిగా ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్ లో బోలెడు హెల్త్ డ్రింక్ పౌడర్స్ ఉన్నాయి. అయితే 'మీరు బోర్నవీటా వాడుతున్నారా? దాన్నితయారు చేయడానికి ఉపయోగించేవి ఇవే.. ఇది వాడితే వచ్చేసమస్యలు ఇవే ' అంటూ ఓ వ్యక్తి చెబుతున్న వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. దీనిగురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

పిల్లలు(kids) ఉదయం లేచి ఫ్రెషవ్వగానే, సాయంత్రం స్కూల్ నుండి రాగానే ఖచ్చితంగా పాలల్లో హెల్త్ డ్రింక్ పౌడర్ కలిపి ఇస్తుంటారు తల్లులు. అలాగే చాలామంది మహిళలకు(Women's) కూడా ఉదయం సాయంత్రం ఇలా పాలు కలుపుకుని తాగడం అలవాటు. పాలలో ఈ పౌడర్లు కలుపుకుని తాగడం వల్ల శరీరానికి మంచి శక్తి వస్తుందని అనుకుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం క్యాడ్బరీ బోర్నవీటా(cadbury bournvita) గురించి చాలా షాకింగ్ నిజాలు బయపెట్టాడు. బోర్నవీటాలో అందరూ అనుకుంటున్నట్టు మన శరీరానికి కావలసిన పోషకాలు ఏవీ ఉండవట. పైపెచ్చు దీని తయారీలో మధుమేహానికి కారణం అయ్యే పదార్థాలను వినియోగిస్తున్నారని అంటున్నారు. బోర్నవీటాను ప్రతిరోజూ తీసుకుంటే చాలా తొందరగా మధుమేహం వస్తుందని చెబుతున్నారు. అంతేకాదు బోర్నవీటా కలర్ కోసం ఉపయోగించే పదార్థం క్యాన్సర్ కు కారణం అవుతుందట. ఈ విషయాన్ని వివరిస్తూ ఓ వ్యక్తి వీడియో విడుదల చేశాడు. బోర్నవీటా 'గెలిచేవారికోసం ఇది' అనే ట్యాగ్ బదులుగా 'డయాబెటిస్ రావడానికి బోర్నవీటా' అని పెట్టిఉంటే బావుండేది అంటున్నాడు ఇతను.

Onions: వామ్మో ఉల్లిపాయతో ఎన్ని లాభాలో అని సంబరపడ్డాం.. కానీ ఇన్ని ప్రమాదాలున్నాయని తెలిస్తే..


ఈ వీడియోను Prof Dr Shibu A అనే ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు. ' అయ్యబాబోయ్ నేను చిన్నప్పటి నుండి బోర్నవీటా బాధితుడినా?' అని ఇతను మెన్షన్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. 'తమ పిల్లల ఆరోగ్యం కోసం ఎంతో నమ్మకంతో తల్లులు దీన్ని వాడుతుంటారు కానీ ఇప్పుడిలా అయ్యిందేంటి?' అంటున్నారు. 'బోర్నవీటా పూర్తీగా ఫ్యాన్సీ షుగర్ అని అర్థమైంది' అని మరికొందరు కామెంట్స్ చేశారు. 'ప్యాక్ లలో లభ్యమయ్యే ప్రతి ప్రోడక్ట్ మీద తయారీకి ఉపయోగించిన పదార్థాల లిస్ట్ ఉంటుంది. అన్ని ప్రోడక్ట్ లకు ఇంచుమించు ఇలాగే జరుగుతుంది, ఇలాంటి వాటి నుండి పిల్లలను దూరంగా ఉంచాలి' అంటున్నారు. అయితే ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయిన తరువాత క్యాడ్భరీ బోర్నవీటా ఇన్స్టాగ్రామ్ పేజీలో(Instagram page) ఓ ప్రకటన విడుదల చేసింది. తమ ఉత్పత్తిలో లభ్యమయ్యే పోషకాల లిస్ట్ అందులో పొందుపరిచింది. దీనిగురించి ఏమైనా సందేహాలు ఉంటే తమను సంప్రదించమని కోరింది.

Viral Video: ఈ రైతు తెలివి మామూలుగా లేదుగా.. పొలంలో ఉన్న ఈ ట్రాన్స్‌ఫార్మర్ పక్కన ఇదేంటో.. ఎందుకు పెట్టాడో తెలిస్తే..


Updated Date - 2023-04-14T17:31:26+05:30 IST