Viral News: ఒకేసారి రూ.6.50 కోట్లను విత్‌డ్రా.. డబ్బు తీసుకునేందుకు ఆ వ్యక్తి పెట్టిన వింత కండీషన్‌కు బ్యాంకు సిబ్బంది షాక్.. చివరకు..!
ABN , First Publish Date - 2023-10-29T11:22:51+05:30 IST
ఒకసారి ఊహించుకోండి.. మీ వద్ద కోట్ల రూపాయలు ఉండి. వాటిని చేతితో లెక్కిస్తే ఎలా ఉంటది. అంత డబ్బు చూసి కొద్దిసేపు జోష్‌లో లెక్కించగలమెమో.. కానీ, ఆ తర్వాత వాటిని లెక్కించడమంటే కొంచెం కష్టమే కదా.
Viral News: ఒకసారి ఊహించుకోండి.. మీ వద్ద కోట్ల రూపాయలు ఉండి. వాటిని చేతితో లెక్కిస్తే ఎలా ఉంటది. అంత డబ్బు చూసి కొద్దిసేపు జోష్‌లో లెక్కించగలమెమో.. కానీ, ఆ తర్వాత వాటిని లెక్కించడమంటే కొంచెం కష్టమే కదా. సింపుల్‌గా మనీ కౌంటింగ్ మెషిన్లతో (Money Counting Machine) పని కానిచ్చేస్తాం. కానీ, ఓ చైనీస్ మిలినీయర్ (Chinese Millionaire) మాత్రం ఈ విషయంలో బ్యాంకు ఉద్యోగులకు చుక్కలు చూపించాడు. ఒకేసారి రూ.6.50 కోట్లను విత్‌డ్రా చేసిన అతడు.. వాటిని తీసుకునే ముందు అక్కడి సిబ్బందికి వింత కండీషన్ పెట్టాడు. అది విన్న బ్యాంకు సిబ్బందికి నోటమాట రాలేదు. తాను విత్‌డ్రా చేసిన ఆ మొత్తాన్ని మెషిన్లతో కాకుండా చేతితో లెక్కించి ఇవ్వాలని చెప్పడంతో వారు నోరెళ్లబెట్టారు. ఈ విషయాన్ని చైనీస్ వ్యక్తి ఇటీవల సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అవుతోంది.
Shocking Video: ఓరి దేవుడో.. ఇదేం ఘోరం.. కారుపైకి ఎగబాకిన ఆక్టోపస్.. ఒక్క నిమిషంలోనే కలలో కూడా ఊహించని సీన్..!
కరోనా సమయంలో 2021లో ఈ సంఘటన చోటు చేసుకుంది. బ్యాంక్ ఆఫ్ షాంఘై (Bank of Shanghai) నుంచి చైనీస్ మిలినీయర్ ఒకరు రూ.6.50కోట్లు విత్‌డ్రా (Withdrew) చేశాడు. ఆ తర్వాత అక్కడి సిబ్బందితో వాటిని చేతితో లెక్కించి తనకు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. మొదట ఆ మాట విన్న బ్యాంక్ స్టాఫ్‌కు అతనికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇదంతా అయ్యేపని కాదు.. మెషిన్లతో మాత్రమే లెక్కించి ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. కానీ, మిలినీయర్ వారి మాట వినలేదు. చేతితో లెక్కించి ఇచ్చిన తర్వాతే అక్కడి నుంచి కదులుతానని భీష్మించి కూర్చున్నాడు. దాంతో చేసేదేమీలేక బ్యాంకు సిబ్బంది అతను చెప్పినట్టే చేయాల్సి వచ్చింది. ఇంకేముంది.. ఒక రెండు గంటల పాటు కూర్చొని బ్యాంకు సిబ్బంది ఆ పని పూర్తి చేశారు. ఆ తర్వాత ఆ నగదును మిలినీయర్‌కు అప్పగించారు. అలా బ్యాంకు సిబ్బంది నుంచి తీసుకున్న ఆ మొత్తాన్ని సూట్‌కేసుల్లో సర్దుకుని అక్కడి నుంచి ఇంటికి బయల్దేరాడు. ఈ విషయాన్ని తాజాగా మిలినీయర్ సోషల్ మీడియాలో పెట్టడంతో ఇప్పుడు వైరల్ అవుతోంది.