Viral Video: ఈ అమ్మాయిలేంటి..? కాలేజీకి పప్పు కుక్కర్లు, చెత్త డబ్బాలు, బకెట్లను తీసుకొచ్చారేంటని అవాక్కవుతున్నారా..? అసలు కథేంటంటే..
ABN , First Publish Date - 2023-04-01T12:56:06+05:30 IST
స్కూల్ వాతావరణానికి.. కాలేజీ వాతావరణానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. స్కూల్ డేస్‌లో కట్టిపడేసినట్టుగా ఉంటారు. అదే కాలేజీ లైఫ్‌లోకి అడుగుపెడితే రిలీఫ్‌గా ఉంటారు. ఇప్పుడెందుకు ఆ కాలేజీ జ్ఞాపకాలంటారా?
స్కూల్ వాతావరణానికి.. కాలేజీ వాతావరణానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. స్కూల్ డేస్‌లో కట్టిపడేసినట్టుగా ఉంటారు. అదే కాలేజీ లైఫ్‌లోకి అడుగుపెడితే రిలీఫ్‌గా ఉంటారు. ఇప్పుడెందుకు ఆ కాలేజీ జ్ఞాపకాలంటారా?
కాలేజీ అనగానే ఎన్నో కోతి చేష్టలు. అల్లరి పనులు. ఎన్నో స్మృతులు ఉంటాయి. చేసే పని ఏదైనా కాస్త భిన్నంగా చేయాలని ఆలోచిస్తుంటారు. అలాగే ఆలోచించారు ఆ కాలేజీ విద్యార్థినులు. రోజూ బుక్స్.. బ్యాగ్‌లు ఏం మోస్తామనుకున్నారో.. ఏమో తెలియదు గానీ వాటికి ఒకరోజు స్వస్తి చెప్పాలనుకున్నారు. అంతే ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘నో బ్యాగ్ డే’ అంటూ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వారు చేసిన సరదా పనులు నవ్వులు పూయించాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన తమిళనాడు (Tamil Nadu) లోని చెన్నైలో ఓ కళాశాలలో జరిగింది.
చెన్నైలోని ఓ కళాశాల విద్యార్థినులు (College students).. ‘నో బ్యాగ్ డే‘ (No Bag Day ) కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో భాగంగా బుక్స్, బ్యాగ్‌కు బదులుగా ఇంట్లో ఉండే వస్తువులను తీసుకొచ్చి ప్రదర్శించారు. అమ్మాయిలు చేసిన ఈ పనులు నవ్వులు పూయించాయి. ప్రెషర్ కుక్కర్, బకెట్లు, డబ్బాలు, లగేజీ బ్యాగులు, ప్లాస్టిక్ బుట్టలు తీసుకొచ్చి సందడి చేశారు. వీటికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. వారు తీసుకొచ్చిన వస్తువులు.. వారి హావభావాలు.. నెటిజన్లను అమితంగా ఆకట్టుకున్నాయి. అమ్మాయిలు చేసిన ఈ సరదా పనులను పలువురు నెటిజన్లు ప్రశంసించారు. మరికొందరు కాలేజీ రోజులను నెమరువేసుకున్నారు.