Wife Swapping: ఇప్పుడిదే కొత్త ట్రెండ్ అంటూ భర్త వికృత చేష్టలు.. భరించలేక కేసు పెట్టిన 26 ఏళ్ల భార్య.. 5 నెలల తర్వాత ఇంట్లో..!
ABN , First Publish Date - 2023-05-20T14:27:49+05:30 IST
జీవితాంతం తోడుంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి.. తాళి కట్టి.. ఏడడుగులు వేస్తారు. అంటే భార్యాభర్తలు పరస్పరం గౌరవించుకుంటూ.. అన్యోన్యంగా..
జీవితాంతం తోడుంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి.. తాళి కట్టి.. ఏడడుగులు వేస్తారు. అంటే భార్యాభర్తలు పరస్పరం గౌరవించుకుంటూ.. అన్యోన్యంగా.. ఆదర్శవంతంగా జీవించాలనేదే దీని అంతరార్థం. అందుకే వివాహబంధాన్ని ఏడడుగుల బంధం అన్నారు. భారత దేశంలో ఈ వివాహ బంధాన్ని ఎంతగానో గౌరవిస్తారు. అంత విలువైన బంధాన్ని ఓ నీచుడు తన విచిత్రమైన కోర్కెల కోసం అపవిత్రం చేశాడు.
కలకాలం తోడుండాల్సిన భర్తే.. భార్య పాలిట కాలయముడయ్యాడు. ఏ స్త్రీ అయినా తన భర్తను తప్ప మరొకరిని కలలో కూడా ఊహించుకోదు. కనీసం పరాయి పురుషులతో మాట్లాడేందుకు కూడా ఇబ్బంది పడుతుంటుంది. అలాంటిది ఓ దుర్మార్గపు భర్త.. పరాయి పురుషులతో (Wife Swapping) గడపాలని ఆమె (26)పై ఒత్తిడి చేశాడు. అందుకు ససేమిరా అనడమే పాపం అయింది. దీనికి ఫలితంగా భర్త చేతిలో అసువులు బాసింది. ఈ దారుణ ఘటన కేరళలో చోటుచేసుకుంది.
పరాయి పురుషులతో గడపాలని భార్యపై (wife) ఒత్తిడి తెచ్చాడు భర్త. అందుకు ఆమె అంగీకరించలేదు. ఈ వ్యవహారంపై బాధితురాలు జనవరిలో పోలీసులకు ఫిర్యాదు (swapping case) చేసింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమె భర్త సహా ఏడుగురిని అరెస్టు చేశారు. అప్పటి నుంచీ ఆమె భర్తకు దూరంగా కొట్టాయంలోని పుట్టింట్లో నివాసం ఉంటుంది.
శుక్రవారం అందరూ ఎవరి పనులకు వాళ్లు వెళ్లిపోయారు. బాధితురాలి తండ్రి, సోదరుడు పనికి వెళ్లగా.. పిల్లలు ఆడుకోవడానికి బయటకు వెళ్లారు. కాసేపటి తర్వాత పిల్లలు ఇంటికి వచ్చి చూడగా ఆమె రక్తపు మడుగులో పడి ఉండడం చూసి ఆందోళనకు చెందారు. ఇరుగుపొరుగు వారికి విషయం తెలియజేశారు. అందరూ వచ్చి చూసేసరికి శవమై కనిపించింది. తన కుమార్తెను ఆమె భర్తే చంపి ఉంటాడని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.