NRI News: ఈ ఆస్ట్రేలియన్ దంపతులకు తగిన శాస్తి జరిగింది.. ఓ భారతీయ మహిళకు 8 ఏళ్లుగా నరకం చూపించినందుకు..!
ABN , First Publish Date - 2023-07-11T19:02:27+05:30 IST
ఉపాధి నిమిత్తం విధిలేని పరిస్థితుల్లో చాలా మంది.. కన్నవాళ్లను, కట్టుకున్న భార్య, పిల్లలను వదిలి విదేశాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో కొందరు తాము అనుకున్న విధంగా ఆర్థికంగా నిలదొక్కుకుంటుంటే.. మరికొందరు తీవ్ర ఇబ్బందులు పడుతూ అటు అక్కడ పని చేయలేక, ఇటు ఇంటికి ...
ఉపాధి నిమిత్తం విధిలేని పరిస్థితుల్లో చాలా మంది.. కన్నవాళ్లను, కట్టుకున్న భార్య, పిల్లలను వదిలి విదేశాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో కొందరు తాము అనుకున్న విధంగా ఆర్థికంగా నిలదొక్కుకుంటుంటే.. మరికొందరు తీవ్ర ఇబ్బందులు పడుతూ అటు అక్కడ పని చేయలేక, ఇటు ఇంటికి వెళ్లలేక నరకయాతన పడుతుంటారు. తరచూ ఇలాంటి వార్తలు వింటూనే ఉంటాం. ఈ తరహా వార్తలు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ భారతీయ మహిళ విషయంలో దారుణం జరిగింది. ఆమెకు 8 ఏళ్లుగా నరకం చూపించినందుకు.. ఆస్ట్రేలియన్ దంపతులకు కోర్టు ఎలాంటి శిక్ష వేసిందంటే..
ఆస్ట్రేలియాలోని (Australia) మెల్బోర్న్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కందసామి కన్నన్, కుముతిని కన్నన్ అనే దంపతుల ఇంట్లో భారతదేశానికి చెందిన 60ఏళ్ల మహిళ పని చేస్తూ ఉండేది. వృద్ధురాలికి ఇంగ్లీష్ రాకపోవడంతో పాటూ అమాయకంగా ఉండడంతో కన్నన్ దంపతులు (couple tortured the old woman) చిత్రహింసలకు గురి చేసేవారు. కొన్నాళ్లు బాగా చూసుకున్న వారు.. రాను రాను వేధించడం మొదలెట్టారు. చివరకు ఆమె పాస్‌పోర్ట్ కూడా తీసుకున్నారు. 2007 నుంచి 2015 వరకూ ఎనిమిదేళ్ల పాటు నరకం చూపించారు. ‘‘దయచేసి నన్ను ఊరికి పంపించండి’’.. అని వేడుకుంటున్నా కనికరం చూపలేదు.
ఈ ఘటన వెలుగులోకి రావడంతో 2016 జూన్‌లో పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో సదరు దంపతులు వృద్ధురాలిని మరింత వేధించారు. తమకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పొందంటూ బెదిరించారు. న్యాయాన్ని తప్పుదారి పట్టించినందుకు గాను.. 2020 ఫిబ్రవరిలో దంపతులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి ఈ కేసుపై విచారణ చేస్తున్న న్యాయస్థానం.. జూలై 7న తీర్పు వెలువరించింది. కుముతినికి ఎనిమిదేళ్లు (నాలుగేళ్ల నాన్ పెరోల్), ఆమె భర్తకు ఆరేళ్ల జైలు (మూడేళ్లు నాన్ పెరోల్) శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘‘తగిన శాస్తి జరిగింది’’.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.