Tea: టీ తాగిన వెంటనే చనిపోయాడో వ్యక్తి.. అతడి ఫోన్‌లోని వీడియోలను చూసి డెత్ మిస్టరీని బయటపెట్టిన పోలీసులు.. ఇంతకీ అసలు కథేంటంటే..!

ABN , First Publish Date - 2023-04-10T18:35:14+05:30 IST

భార్య ఎంతో ప్రేమతో ఇచ్చిన టీ తాగిన భర్త.. కాసేపటికే అస్వస్థతకు గురయ్యాడు. రోజు రోజుకూ ఆరోగ్యం క్షీణిస్తుండడంతో చివరికి ఆస్పత్రికి వెళ్లాడు. అయితే దురదృష్టవశాత్తు.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు..

Tea: టీ తాగిన వెంటనే చనిపోయాడో వ్యక్తి.. అతడి ఫోన్‌లోని వీడియోలను చూసి డెత్ మిస్టరీని బయటపెట్టిన పోలీసులు.. ఇంతకీ అసలు కథేంటంటే..!

భార్య ఎంతో ప్రేమతో ఇచ్చిన టీ తాగిన భర్త.. కాసేపటికే అస్వస్థతకు గురయ్యాడు. రోజు రోజుకూ ఆరోగ్యం క్షీణిస్తుండడంతో చివరికి ఆస్పత్రికి వెళ్లాడు. అయితే దురదృష్టవశాత్తు.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. చివరకు అతడి ఫోన్‌ను పరిశీలించారు. అందులోని వీడియోల ద్వారా డెత్ మిస్టరీని ఛేదించారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) రేవా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక సివిల్ లైన్ పరిధి హోఘర్ ప్రాంతానికి చెందిన షాహిద్ ఖాన్ (37) అనే వ్యక్తి.. భార్య షలేహా పర్వీన్‌తో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈ దంపతుల (couple) మధ్య ఎలాంటి సమస్యలూ లేవు. దీంతో ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే ఇటీవల షాహిద్ భార్య (wife) ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఇదే ప్రాంతానికి చెందిన బంటు ఖాన్ అనే యువకుడితో (young man) ఆమెకు పరిచయం ఏర్పడింది. వీరి మధ్య కొన్నాళ్లకే వివాహేతర సంబంధం (extramarital affair) ఏర్పడింది. భర్తకు తెలీకుండా పర్వీన్.. తరచూ ప్రియుడిని కలుస్తూ ఉండేది. అయితే భర్త తమకు అడ్డుగా ఉండడం వారికి అసలు నచ్చలేదు. దీంతో ఎలాగైనా షాహిద్ అడ్డు తొలగిచుకోవాలని కుట్రపన్నారు. ఈ క్రమంలో ఓ రోజు భర్తతో ప్రేమగా మాట్లాడుతూ అతడికి విషం కలిపిన టీ (tea mixed with Poison) ఇచ్చింది.

Vrial News: కుర్రాళ్లంతా క్యూలో వెళ్తోంటే.. అమ్మాయిలు కర్రలతో కొడతారట.. వయసు మీద పడుతున్నా పెళ్లిళ్లు కానీ కుర్రాళ్ల కోసం వింత ఆచారం..!

women-crime-today-news'.jpg

అది తాగిన షాహిద్ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తూ వచ్చింది. చివరకు మార్చి 18న చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరాడు. పరీక్షించిన వైద్యులు విష ప్రయోగం వల్లే ఇలా జరిగిందని చెప్పారు. దీనిపై పోలీసులు వాంగ్మూలం నమోదు చేసే లోపే షాహిద్ మృతి చెందాడు. దీంతో చివరకు అతడి భార్య విచారించారు. ఈ క్రమంలో నిందితుడి ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. చివరకు అందులో వీడియోలు పరిశీలించి షాక్ అయ్యారు. షాహిద్ చనిపోక ముందు.. తన భార్య నిర్వాకం గురించి మాట్లాడుతూ వీడియో రికార్డు చేశాడు. ఈ వీడియో ఆధారంగా మృతుడి భార్యను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది. దీంతో పర్వీన్‌తో పాటూ ఆమె ప్రియుడు, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు.

Crime News: రెండేళ్ల కూతురు, పక్కింటి యువకుడితో ఫొటో దిగి.. ఏడుస్తున్న ఎమోజీని పెట్టి వాట్సప్ స్టేటస్‌గా పెట్టిన భార్య.. భర్తకు నిజం తెలిసి..

Updated Date - 2023-04-10T18:36:30+05:30 IST