Married Couple: పాపం ఈ కుర్రాడు.. పెళ్లయిన నెల రోజులకే ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించి ఉండడు..!

ABN , First Publish Date - 2023-03-30T20:28:00+05:30 IST

దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన ఆ జంటను చూసి.. అన్యోన్య దంపతులంటూ అంతా ప్రశంసించేవారు. అందుకు తగ్గట్టుగానే ఆ భార్యాభర్తలు కూడా ఎంతో సంతోషంగా ఉండేవారు. ఇలా చూస్తుండగానే నెల రోజులు గడిచిపోయాయి. జీవితాంతం..

Married Couple: పాపం ఈ కుర్రాడు.. పెళ్లయిన నెల రోజులకే ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించి ఉండడు..!

దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన ఆ జంటను చూసి.. అన్యోన్య దంపతులంటూ అంతా ప్రశంసించేవారు. అందుకు తగ్గట్టుగానే ఆ భార్యాభర్తలు కూడా ఎంతో సంతోషంగా ఉండేవారు. ఇలా చూస్తుండగానే నెల రోజులు గడిచిపోయాయి. జీవితాంతం అదే అనుబంధాన్ని కొనసాగించాలని అనుకున్న ఆ కుర్రాడి కలలు.. నెల రోజులకే కల్లలవుతాయని ఎవరూ ఊహించలేదు. ఇటీవలే బీహార్‌లో జరిగిన ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

బీహార్ (Bihar) భాగల్‌పూర్ జిల్లా ముంగేర్ పరిధి నాథ్‌నగర్‌కు చెందిన శైలేష్ షా అనే యువకుడికి నెల క్రితం స్థానిక ప్రాంతానికి చెందిన యువతితో (young woman) వివాహమైంది. దంపతులిద్దరూ ఒకరికొకరు నచ్చడంతో ఎంతో సంతోషంగా ఉండేవారు. జీవితాంతం అదే అనుబంధాన్ని కొనసాగించాలని అనుకున్నారు. అయితే వివాహమైన (marriage) నెల రోజులకే ఊహించని ఘటన చోటు చేసుకుంటుందని యువకుడితో పాటూ ఎవరూ ఊహించలేకపోయారు. సంతోషంగా సాగుతున్న వీరి కుటుంబంలో గురువారం షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. శైలేష్ తన మామ శశిభూషణ్ (45)తో కలిసి బైకులో వేరే ప్రాంతానికి బయలుదేరారు.

14 ఏళ్ల బాలికకు పదే పదే కడుపునొప్పి.. మాత్రలు వాడినా ఫలితం లేక ఆస్పత్రికి.. స్కానింగ్‌‌ చేశాక డాక్టర్లు చెప్పింది విన్న తల్లిదండ్రులకు..

young-man-accident.jpg

అయితే మార్గ మధ్యలో శ్రీకృష్ణ సేతు ప్రాంతానికి చేరుకోగానే ఇసుకతో వస్తున్న లారీ.. వీరి బైకును (lorry hit the bike) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వీరిని స్థానికులు చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వారిద్దరూ మృతి (Death) చెందారని వైద్యులు తెలిపారు. వివాహమై నెల రోజులకే భర్త మృతి చెందడాన్ని భార్య జీర్ణించుకోలేకపోయింది. వార్త తెలిసిన వెంటనే కుప్పకూలిపోయింది. ‘‘అప్పుడే నీకు నిండు నూరేళ్లు నిండాయా’’.. అంటూ రోదిస్తున్న మృతుడి తల్లిదండ్రులను చూసి స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.

Wife: ఏం చేయమంటారు..? నా భర్త వికలాంగుడు.. నేను ఇలాంటి పనులు చేస్తేనే ఇల్లు గడుస్తుందంటూ.. పోలీసులకు తేల్చిచెప్పిన ఈ మహిళ కథేంటంటే..

Updated Date - 2023-03-30T20:28:00+05:30 IST