Disney Layoff Announcement: కీలక ప్రకటన చేసిన డిస్నీ.. 7 వేల మంది ఉద్యోగాలు ఊస్ట్..!

ABN , First Publish Date - 2023-03-28T21:05:37+05:30 IST

ఖర్చులు తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఇటీవల బడా బడా కంపెనీలు సైతం ఉద్యోగులకు షాక్ ఇవ్వడం చూస్తేనే ఉన్నాం. అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, మెటా, గూగుల్‌ వంటి సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ కంపెనీలు.. భారీ స్థాయిలో...

Disney Layoff Announcement: కీలక ప్రకటన చేసిన డిస్నీ.. 7 వేల మంది ఉద్యోగాలు ఊస్ట్..!

ఖర్చులు తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఇటీవల బడా బడా కంపెనీలు సైతం ఉద్యోగులకు షాక్ ఇవ్వడం చూస్తేనే ఉన్నాం. అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, మెటా, గూగుల్‌ (Amazon, Microsoft, Meta, Google) వంటి సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ కంపెనీలు.. భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అమెరికాకు (America) చెందిన వినోదరంగానికి సంబంధించిన వాల్డ్ డిస్నీ (Walt Disney) కూడా ఈ కోవలోకి వచ్చి చేరింది. ఏకంగా సుమారు 7వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. తద్వారా తమ కంపెనీకి 5.5బిలియన్ డాలర్ల (5.5 billion dollars) మేర ఖర్చులు ఆదా చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

తప్పనిసరి పరిస్థితుల్లో తమ కంపెనీలోని 7వేల మంది ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు డిస్నీ సీఈవో బాబ్ ఇగర్ (Disney CEO Bob Iger) తెలిపారు. ఉద్యోగుల తొలగింపునకు (Disney Layoff) సంబంధించి.. ఏప్రిల్‌లో ఉద్యోగులందరికీ తెలియజేయనున్నట్లు చెప్పారు. కంపెనీకి సంబంధించి వ్యూహాత్మక పురర్నిర్మాణంలోభాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిస్నీ సీఈవో తెలిపారు. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 3.6 శాతం అని చెప్పారు. ప్రస్తుతం డిస్నీలో 2లక్షల 20వేల మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. డిస్నీకి ఇటీవల సబ్‌స్క్రైబర్లు (Subscribers) చాలా వరకు తగ్గిపోయారు. దీంతో ఆదాయం కూడా భారీగా తగ్గింది. దీంతో నష్టనివారణ చర్యల్లో భాగంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ యాజమాన్యం చెబుతోంది.

Viral Video: అమ్మ బాబోయ్.. ఇదేం పని..? బాత్రూంలోకి పామును తీసుకెళ్లి మరీ ఓ వ్యక్తి ఏం చేస్తున్నాడో చూస్తే..!

Disney-Layoff.jpg

కరోనా కారణంగా అన్ని కంపెనీల మాదిరే డిస్నీ కూడా చాలా నష్టాల్ని చవి చూసింది. కొవిడ్ ఎఫెక్ట్‌తో (covid effect) డిస్నీ పార్కులు, రిసార్టులు (Disney Parks and Resorts) నెలల తరబడి మూతబడ్డాయి. దీంతో ఈ కంపెనీ తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. డిస్నీలో ఈఎస్పీఎన్, డిస్నీ పార్క్స్, ఎక్స్పీరియన్స్, ప్రొడక్ట్స్ అనే మూడు ప్రధాన విభాగాలు ఉన్నాయి. నష్టాల కారణంగా వీటి నిర్వహణ భారంగా మారింది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ సీఈవో తెలిపారు. రెండు, మూడు విడతల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.

Viral Video: బారీకేడ్స్‌ను పడేసి.. కార్లపైకి ఎక్కి పడుకుని మరీ నడిరోడ్డుపై ఓ యువతి రచ్చ రచ్చ.. ప్రేమలో మోసపోయానంటూ..

Updated Date - 2023-03-28T21:05:37+05:30 IST