Theft in Temple: వీడి తెలివి తెల్లారిపోనూ.. ఓసారి దొంగతనం చేస్తే ఎవరూ పట్టుకోలేకపోయారని.. 15 రోజుల తర్వాత మళ్లీ వెళ్లాడు.. చివరకు..
ABN , First Publish Date - 2023-03-28T16:46:14+05:30 IST
కొందరు అవసరాలకు తప్పనిసరి పరిస్థితుల్లో దొంగతనం చేస్తుంటారు. తర్వాత దాన్నే అలవాటుగా మార్చుకుంటుంటారు. చిన్న చిన్న చోరీలతో మొదలెట్టి.. చివరకు పెద్ద పెద్ద చోరీలకే ప్లాన్ చేస్తుంటారు. ఇలాంటి వారి ఆటలు కొన్నాళ్లు యథేచ్ఛగా సాగినా.. ఏదో ఒక రోజు..
కొందరు అవసరాలకు తప్పనిసరి పరిస్థితుల్లో దొంగతనం చేస్తుంటారు. తర్వాత దాన్నే అలవాటుగా మార్చుకుంటుంటారు. చిన్న చిన్న చోరీలతో మొదలెట్టి.. చివరకు పెద్ద పెద్ద చోరీలకే ప్లాన్ చేస్తుంటారు. ఇలాంటి వారి ఆటలు కొన్నాళ్లు యథేచ్ఛగా సాగినా.. ఏదో ఒక రోజు పోలీసులకు దొరికిపోతుంటారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉండడంతో చాలా కేసులు సులభంగా పరిష్కారమవుతున్నాయి. తాజాగా, మధ్యప్రదేశ్‌లో ఇలాంటి కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ఒకసారి దొంగతనం చేసినా.. ఎవరూ పట్టుకోలేకపోయారు. దీంతో 15రోజుల తర్వాత మళ్లీ వెళ్లాడు. ఎవరూ గుర్తుపట్టలేదు కానీ.. చివరకు ఏం జరిగిందంటే..
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ఇండోర్ పరిధి ద్వారాకాపురిలోని అమ్మవారి ఆలయంలో (Temple) ఈ ఘటన చోటు చేసుకుంది. 15 రోజుల క్రితం ఆ ఆలయంలో ఓ వ్యక్తి చోరీకి (theft) పాల్పడ్డాడు. బైక్‌పై వచ్చిన దుండగుడు.. ఆలయంలోని లోహపు వినాయక విగ్రహం (Ganesha statue), గంట, నగదును చోరీ చేశాడు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో (CC cameras) రికార్డు అయింది. ఈ కేసులో ఇంతవరకూ ఇతన్ని పోలీసులు పట్టుకోలేకపోయారు. దీంతో అతడిలో మరింత కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇటీవల అదే ఆలయ వార్షికోత్సవాన్ని (Temple Anniversary) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆలయ వార్షికోత్సవం సందర్భంగా పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. ఆలయంలో ఎక్కువ మొత్తంలో నగదు ఉందనే విషయం తెలుసుకున్న సదరు దొంగ.. మళ్లీ చోరీ చేయాలని భావించాడు. మంగళవారం అమ్మవారి ఆలయానికి చేరుకున్నాడు. అయితే అక్కడే ఉన్న ఓ బాలుడు.. బైకు నంబర్ (bike number) ఆధారంగా దొంగను గుర్తించాడు. స్థానికులు అతన్ని చితకబాది.. ద్వారకాపురి పోలీసులకు అప్పగించారు. నిందితుడి ఏరోడ్రం నివాసి గోపాల్ పరాశర్ అని తెలిసింది. రెండు రోజుల క్రితం స్థానిక శ్రీరాముడి ఆలయంలోనూ చోరీ జరిగింది. అయితే అక్కడ సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితులను గుర్తించలేకపోయారు.
Funny Video: ఏమీ చదవకుండానే ఐఏఎస్ అవడం ఎలా..?.. ఈ ప్రశ్నకు ఈ యువతి ఇచ్చిన సమాధానమేంటో వింటే..