Crime news: చిన్న కూతురుతో కలిసి ఇంట్లో ఉన్న తండ్రి.. కాసేపటికి పెద్ద కూతురు లోపలికి వెళ్లి చూడగా..

ABN , First Publish Date - 2023-10-06T21:59:09+05:30 IST

రానురాను కొందరు రాక్షసుల్లా తయారవుతున్నారు. మరికొందరు వయసు, వరుస మరచి దారుణాలకు పాల్పడడం చూస్తూ ఉన్నాం. ఇలాంటి వారికి ఎన్ని శిక్షలు వేసినా.. సమాజంలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా..

Crime news: చిన్న కూతురుతో కలిసి ఇంట్లో ఉన్న తండ్రి.. కాసేపటికి పెద్ద కూతురు లోపలికి వెళ్లి చూడగా..
ప్రతీకాత్మక చిత్రం

రానురాను కొందరు రాక్షసుల్లా తయారవుతున్నారు. మరికొందరు వయసు, వరుస మరచి దారుణాలకు పాల్పడడం చూస్తూ ఉన్నాం. ఇలాంటి వారికి ఎన్ని శిక్షలు వేసినా.. సమాజంలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా, రాజస్థాన్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన ఓ వ్యక్తి చివరకు దారుణానికి పాల్పడ్డాడు. చిన్న కూతురు తండ్రితో పాటే ఇంట్లో ఉండగా.. కాసేపటికి పెద్ద కూతురు లోపలికి వెళ్లింది. చివరకు తన తండ్రి చేసిన దారుణం తెలుసుకుని షాక్ అయింది. వివరాల్లోకి వెళితే..

రాజస్థాన్‌లోని (Rajasthan) జైసల్వేర్ ప్రాంత పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన శంకర్ (పేరు మార్చాం) అనే వ్యక్తికి భార్య, 5, 8ఏళ్ల వయసున్న కూతుళ్లు ఉన్నారు. శంకర్ వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. అయితే మొన్నటిదాకా ఎంతో బాగున్న శంకర్.. రాను రాను తాగుడుకు (Addicted to drinking) బానిసయ్యాడు. ఎంతలా అంటే నిత్యం మద్యం మత్తులోనే ఉండేవాడు. ఇంటి సమస్యలను పట్టించుకోకుండా తిరిగేవాడు. దీంతో అతడి భార్యే మొత్తం వ్యవహారాలు చూసుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో ఇటీవల ఓ రోజు అమానవీయ ఘటన చోటు చేసుకుంది.

Shocking Video: నేను పిచ్చిదాన్నే.. చస్తానంటూ కేకలు పెడుతూ.. కిందకు దూకేసిన యువతి.. కాపాడేందుకు ఓ వ్యక్తి ప్రయత్నిస్తే..!

ఓ రోజు శంకర్ ఫుల్‌గా మందు తాగి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో చిన్న కూతురు మాత్రమే ఉంది. కూతురును అని కూడా (father Misbehavior with daughter) చూడకుండా బాలికపై అత్యాచారినికి పాల్పడ్డాడు. కాసేపటికి ఇంటికి వచ్చిన పెద్ద కూతురు.. తండ్రి చేసిన నిర్వాకం చూసి షాక్ అయింది. వెంటనే ఈ విషయాన్ని తల్లికి తెలియజేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన ఈ ప్రభుద్ధుడిపై నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.

Viral news: సింహం వీడియో చూసి పరుగుపరుగున వెళ్లిన పోలీసులు.. చివరకు అతను ఇలా చేస్తాడని ఊహించలేదు..

Updated Date - 2023-10-06T21:59:09+05:30 IST